- Telugu News Photo Gallery These are the secret symptoms that appear in the eyes if the kidneys are in danger!
కిడ్నీలు ప్రమాదంలో ఉంటే కంటిలో కనిపించే సీక్రెట్ లక్షణాలు ఇవే!
మానవ శరీరంలో కిడ్నీలు కీలక పాత్ర పోషిస్తాయి. శరీరంలోని విషాన్ని బయటకు పంపిచడంలో ప్రధాన పాత్ర వహిస్తాయి. అందుకే కిడ్నీల ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తారు ఆరోగ్య నిపుణులు. అయితే ఇప్పుడున్న జీవన శైలీ, తీసుకుంటున్న ఆహారం కారణంగా చాలా మంది కిడ్నీ ఫెయిల్యూర్ వంటి చాలా సమస్యలను ఎదుర్కొంటున్నారు. అయితే కిడ్నీలు ప్రమాదంలో ఉంటే కళ్లలో పలు లక్షణాలు కనిపిస్తాయంట. అవి ఏవో ఇప్పుడు చూద్దాం.
Updated on: Jun 17, 2025 | 11:41 AM

ఉబ్బిన కళ్లు : కళ్లు ఉబ్బడం అనేది కొన్నిసార్లు సహజం. అయితే కంటి నిండా నిద్రపోయినా, కళ్లు ఉబ్బినట్లు అనిపిస్తే.. రోజుల తరబడి ఇలానే జరిగితే కాస్త జాగ్రత్తపడాలి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఎందుకంటే. కొన్ని సార్లు మూత్రపిండాలు దెబ్బతింటే కూడా కళ్లు ఉబ్బినట్లు కనిపిస్తాయంట. దీనిని ప్రోటీన్యూరియా అంటారంట. అందుకే ఈ విషయంలో కాస్త జాగ్రత్త అవసరం.

అస్పష్టమైన కంటి చూపు : మూత్రపిండాలు ప్రమాదంలో ఉంటే కంటి చూపు అస్పష్టంగా కనిపిస్తుందంట. ఎందుకంటే? అధిక రక్తపోటు, మధుమేహం సమస్యలు ఉన్నవారిలో అవి వారి కంటిలోని రక్తనాళాలను కూడా ప్రభావితం చేయడం వలన దృష్టిలో మార్పు వస్తుంది. ఇది మూత్రపిండాలపై కూడా ప్రభావం చూపిస్తుందంట.

కళ్లు పొడిబారడం : కళ్లు పొడిబారడం కొన్ని సమయంలో సహజం. కానీ తరచుగా కళ్లు పొడిబారడం, కంటిలో దురద వంటి సమస్యలు తలెత్తే జాగ్రత్తపడాలని చెప్తున్నారు వైద్యనిపుణులు. ఎందుకంటే మూత్రపిండాల సమస్యతో బాధపడే వారిలో కూడా ఈ సమస్య ఉంటుందంట.

కళ్లు ఎక్కువగా ఎరుపు రంగులోకి మారడం : కళ్లకు ఏదైనా గాయం అయినప్పుడు లేదా, దుమ్ము ధూళి పడినప్పుడు మాత్రమే కళ్లు ఎరుపు రంగులోకి మారుతాయి. కానీ మీ కళ్లు ఎప్పుడూ ఎరుపు రంగులో ఉంటే మాత్రం తప్పకుండా ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించాలంట. కళ్లు ఎరుపు రంగులోకి మారడం మూత్రపిండాల వ్యాధికి ప్రధాన కారణం అంటున్నారు నిపుణులు.

కిడ్నీ సమస్య ఉన్నవారు రంగులను చూడటంలో కొన్ని సమస్యలు తలెత్తుతాయంటున్నారు ఆరోగ్య నిపుణులు.మూత్రపిండాల సమస్యలు ఉన్న కొంతమందికి కొన్ని రంగులను, ముఖ్యంగా నీలం , పసుపు రంగులను వేరు చేయడం కష్టంగా అనిపించవచ్చు. ఇది ఆప్టిక్ నరాల దెబ్బతినడం లేదా దీర్ఘకాలిక అనారోగ్యం కారణంగా రెటీనాలో మార్పుల వల్ల వస్తుందంట.



