మీ ఏకాగ్రతను పెంచడానికి బెస్ట్ యోగా అసనాలు ఇవే!
మానసికంగా ప్రశాంతంగా గడిపితే కొన్ని కోట్ల సంపద ఉన్నట్లే. ఈరోజుల్లో చాలా మంది బిజీ బిజీగా గడుపుతున్నారు. ఉదయం లేచిందంటే ఉరుకుల పరుగులతో కాలాన్ని వెల్లదీస్తున్నారు. దీంతో మానసిక ప్రశాంతతే కరువై అనేక అనారోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయి. అందుకే ఆనందంగా ఉండాలన్నా, ఒత్తిడి నుంచి బయటపడాలి అనుకుంటే తప్పకుండా యోగా చేయాలంట. యోగా అనేది మనసుకు ప్రశాంతతను, మంచి ఏకాగ్రతను ఇస్తుంది.కాగా, మానసిక ప్రశాంతతను పెంచుకోవడానికి ఎలాంటి యోగాసనాలు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
Updated on: Jun 17, 2025 | 11:41 AM

తడసన (పర్వత భంగిమ) : కొన్ని యోగాసనాలు వేయడం వలన మెదడు పనితీరు మెరుగు పడటమే కాకుండా అది మానసిక స్థితిపై మంచి ప్రభావం చూపిస్తుంది. అయితే మానసికంగా ప్రశాంతతను ఇచ్చే ఆసనాల్లో తడసనం ఒకటి. దీనిని వేయడం వలన మెదడుకు రక్తప్రసరణ పెరిగి నాడీవ్యవస్థ పనితీరు బాగుంటుంది. అయితే దీనిని ఎలా వేయాలంటే? నిటారుగా నిలబడి, రెండు చేతులుపైకి లేపి నమస్కరిస్తూ ఉండాలి. శరీరాన్ని పూర్తిగా పైకి వంచాలి.

వృక్షాసన (వృక్ష భంగిమ) :మెదడు, కండరాల బలోపేతానికి అద్భుతమైన ఆసనం వృక్షాసనం. దీనిని రెండు పాదాలపై నిలబడి, తర్వాత మరోకాలిని మోకాలిపై వరకు పెట్టాలి. ఒంటి కాలిపై నిలబడి నమస్కారం చేయాలి. ఇలా రోజు 10 నిమిషాలు చేయడం ఆరోగ్యానికి చాలా మంచిదంట.

పద్మాసనం : చాలా మంది ఇష్టంగా వేసే ఆసనాల్లో ఇదొక్కటి. ఈ ఆసనం ధాన్య భంగిమలా ఉంటుంది. దీనిని వేయడం వలన మనసుకు ప్రశాంతత కలగడమే కాకుండా, జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుందంట. అందుకే ప్రతి రోజూ కనీసం 10 నిమిషాలపాటు ఈ ఆసనం వేయాలి.

బాలసనం : బాలాసనం నాడీ వ్యవస్థ సక్రమంగా సాగేలా చేస్తుంది. దీనిని ఎలా వేయాలంటే? మోకాల్లపై వంగి, తలను నేలకు ఆనించి, రెండు అరచేతులను నేలపై ఉంచాలి. కనీసం రెండు నిమిషాల పాటు ఇలా వేయడం వలన శ్వాస సమస్యలు తొలిగిపోతాయంట.

త్రతక ఆసనం :శారీరక భంగిమ కాకపోయినా, ఈ యోగ వ్యాయామం కళ్ళు , మనస్సును ఒకే ధాటికి తీసుకొస్తాయి. దీనిని చికటి ప్రదేశంలో ఒక చోట కొవ్వత్తిని వెలిగించి కొద్ది దూరంలో కొర్చొని వెలిగే మంటనే చూడాలి. తర్వాత కళ్లు మూసుకొని దానిని ఊహించుకోవాలి.



