AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Women Health: మితిమీరిన శృంగారం స్త్రీ ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తుందా? నిపుణులు చెబుతున్న షాకింగ్ విశేషాలు మీకోసం..

భాగస్వామిపై ఆకర్షణ పెరిగినప్పుడు సహజంగానే అది శారీరక సాన్నిహిత్యానికి దారి తీస్తుంది. సాధారణంగానే చాలామంది మహిళలు లైంగికంగా చురుకుగా ఉంటారు.

Women Health: మితిమీరిన శృంగారం స్త్రీ ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తుందా? నిపుణులు చెబుతున్న షాకింగ్ విశేషాలు మీకోసం..
File Pic
Shiva Prajapati
|

Updated on: Jan 14, 2023 | 1:45 PM

Share

భాగస్వామిపై ఆకర్షణ పెరిగినప్పుడు సహజంగానే అది శారీరక సాన్నిహిత్యానికి దారి తీస్తుంది. సాధారణంగానే చాలామంది మహిళలు లైంగికంగా చురుకుగా ఉంటారు. తమ భాగస్వామితో మళ్లీ మళ్లీ ఫిజికల్‌గా కలిసేందుకు ఇష్టపడుతుంటారు. దీనివల్ల సెక్సువల్ బాండింగ్ పెరిగడమే కాకుండా, సామర్థ్యం కూడా పెరుగుతుంది. అయితే, అతి శృంగారం కూడా ప్రమాదకరమే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ప్రతి దానికి లిమిట్స్ ఉన్నట్లే.. ఈ విషయంలోనూ లిమిట్స్ ఉన్నాయంటున్నారు. ముఖ్యంగా స్త్రీలు ఎక్కువగా ప్రభావితం అవుతారని చెబుతున్నారు. అందుకే సెక్స్ డ్రైవ్ ఎంతవరకు మంచిది? ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? అనేది తెలుసుకోవాలని సూచిస్తున్నారు. వాస్తవానికి శృంగారినికి పరిమితి అంటూ లేదంటూనే.. ఎక్కువసార్లు పాల్గొనడం వల్ల స్త్రీలు కొన్ని సమస్యలు ఎదుర్కొంటారని చెబుతున్నారు నిపుణులు. మరి ఆ సమస్యలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

పొడిబారడం..

ఎక్కువసార్లు శృంగారంలో పాల్గొనడం వల్ల స్త్రీ జననాంగం పొడిబారడం మొదలవుతుంది. ఫలితంగా తదుపరి కలయిక బాధకరంగా మారుతుంది. ఇలాంటి కంప్లైంట్స్ తమకు ఎక్కువగా వస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు.

వాపు..

ఎక్కువసార్లు శారీరక కలయిక వల స్త్రీ జననాంగం వాపు వస్తుంది. దీని కారణంగా ఎక్కోరియేషన్ వంటి సమస్యను ఎదుర్కొంటారు. మూత్రంలో మంట, నొప్పి, వాపు వంటిది వస్తుంది. ఇలాంటి పరిస్థితి ఉంటే.. ఎక్కువసార్లు శృంగారంలో పాల్గొనడం సరికాదంటున్నారు నిపుణులు.

ఇవి కూడా చదవండి

మూత్ర నాళాల ఇన్‌ఫెక్షన్..

లైంగికంగా చురుకుగా ఉండే చాలా మంది స్త్రీలు యూరినరీ ట్రాక్ట్ ఇన్‌ఫెక్షన్ సమస్యతో బాధపడుతున్నట్లు ఓ అధ్యయనంలో తేలింది. వేర్వేరు వ్యక్తులతో సక్స్ చేయడం వల్ల కూడా ఈ సమస్య తలెత్తుతుంది. అందుకే.. ఇతరులతో శృంగారంలో పాల్గొనడం ఆపేయాలని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు.

వెన్నునొప్పి..

శృంగారం సమయంలో వెన్నుపాముపై ఒత్తిడి పెరుగుతంది. ఈ కారణంగా వెన్నునొప్పి వస్తుంది. ఇలాంటి సమస్య వచ్చినప్పుడు జాగ్రత్తలు పాటించడం ఉత్తమం అని చెబుతున్నారు వైద్యులు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..