AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Fever: జ్వరం వచ్చినప్పుడు స్నానం చేయొచ్చా..? ఒకవేళ చేస్తే డేంజర్‌గా మారుతుందా..

మారుతున్న వాతావరణంతో సీజనల్ వ్యాధుల ప్రమాదం పెరుగుతోంది.. కావున జాగ్రత్తగా ఉండటం, ఆరోగ్యవంతంగా ఉండటం కోసం చర్యలు తీసుకోవడం చాలామంచిది.. దీంతో వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించవచ్చు.. అయితే, వర్షా కాలం నాటినుంచి వైరల్ ఫీవర్ల ప్రమాదం పెరుగుతోంది.

Viral Fever: జ్వరం వచ్చినప్పుడు స్నానం చేయొచ్చా..? ఒకవేళ చేస్తే డేంజర్‌గా మారుతుందా..
Viral FeverImage Credit source: Getty Images
Shaik Madar Saheb
|

Updated on: Oct 02, 2024 | 12:52 PM

Share

మారుతున్న వాతావరణంతో సీజనల్ వ్యాధుల ప్రమాదం పెరుగుతోంది.. కావున జాగ్రత్తగా ఉండటం, ఆరోగ్యవంతంగా ఉండటం కోసం చర్యలు తీసుకోవడం చాలామంచిది.. దీంతో వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించవచ్చు.. అయితే, వర్షా కాలం నాటినుంచి వైరల్ ఫీవర్ల ప్రమాదం పెరుగుతోంది.. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ విషజ్వరాల బారిన పడుతున్నారు. అంతేకాకుండా ఈ రోజుల్లో ప్రజలు తరచుగా అనారోగ్యానికి గురవుతున్నారు.. దీనికి ప్రధాన కారణం బ్యాక్టీరియా.. మీ రోగనిరోధక శక్తి కూడా బలహీనంగా ఉంటే.. ఈ వ్యాధి మిమ్మల్ని సులభంగా బాధితుడిగా చేస్తుంది. వైరల్ ఫీవర్ మిమ్మల్ని చాలా బాధపెడుతుంది.. అందుకే ఈ ఇన్‌ఫెక్షన్‌ను నివారించడం చాలా ముఖ్యం..

అయితే.. వైరల్ ఫీవర్ల సమయంలో తరచూ అనేక సందేహాలు వ్యక్తమవుతుంటాయి.. ఏం తినాలి.. ఏం తినకూడదు.. వైరల్ ఫీవర్ వస్తే స్నానం చేయాలా వద్దా..? అన్న ప్రశ్న ఎప్పుడూ జనాల్లో మెదులుతూ ఉంటుంది. ముఖ్యంగా విషజ్వరాల సమయంలో స్నానం చేయాలా వద్దా… అని తరచూగా బాధితులు ఆరోగ్య నిపుణులను అడుగుతుంటారు. అయితే, సరైన జవాబు ఏమిటో ఇప్పుడు తెలుసుకోండి..

వైరల్ ఫీవర్ లక్షణాలు..

సాధారణంగా జ్వరం, శరీర నొప్పి, తలనొప్పి, అలసట, నిద్రలేమి వైరల్ ఫీవర్ ప్రముఖ లక్షణాలు.. ఈ వ్యాధి కారణంగా, శరీరం చాలా బలహీనంగా మారుతుంది. దాని ప్రభావం చాలా కాలం పాటు ఉండటంతోపాటు బరువును కూడా తగ్గిస్తుంది.

వైరల్ ఫీవర్ సమయంలో స్నానం చేయాలా వద్దా?

కొంతమంది వైద్యులు వైరల్ ఫీవర్ విషయంలో స్నానం చేయడం ఆరోగ్యకరమైన మార్గం అని చెబుతారు. ఎందుకంటే ఇది శరీరం నుంచి మురికిని తొలగిస్తుంది. మానసికంగా కూడా ఆహ్లాదకరమైన అనుభూతిని ఇస్తుంది. అందువల్ల, అనేక సందర్భాల్లో, వైరల్ ఫివర్ ఉన్నప్పుడు స్నానం చేయడం సురక్షితంగా పరిగణిస్తారు.

పిల్లలకి లేదా వృద్ధులకు వైరల్ జ్వరం వస్తే, స్నానం చేసేటప్పుడు జాగ్రత్త వహించాలి. ఎందుకంటే అటువంటి పరిస్థితిలో, ప్రతి వ్యక్తి వైద్య పరిస్థితి ఒకేలా ఉండదు. కాబట్టి వైద్యుడిని సంప్రదించడం చాలా ముఖ్యం. మన శరీరం వైరల్ ఇన్‌ఫెక్షన్‌కు వ్యతిరేకంగా పోరాడుతున్నప్పుడు, అది మరింత అలసిపోకుండా కాపాడాలని వైద్యులు చెబుతారు. స్నానం చేసే సమయంలో లక్షణాలు పెరగవచ్చు. దీని కారణంగా రోగి మరింత అసౌకర్యానికి గురవుతాడు.

వైరల్ జ్వరాన్ని ఎలా నివారించాలి..

క్రమం తప్పకుండా చేతులు కడుక్కోండి.. పరిశుభ్రతను జాగ్రత్తగా చూసుకోండి. వైరస్ మీ నుండి ఎంత దూరంగా ఉంటే, వైరల్ ఫీవర్ దాడి అంత తక్కువగా ఉంటుంది. కావున, మనమందరం మన ఆరోగ్యం పట్ల పూర్తి శ్రద్ధ వహించడం.. మారుతున్న వాతావరణంలో మాస్క్‌లు ధరించడం ఉత్తమం. ఇది కాకుండా, అవసరమైతే, వైరల్ ఫీవర్ రోగుల నుంచి దూరం పాటించండి.. వీలైనంత వరకు రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాన్ని తినండి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..