COVID Vaccine: వ్యాక్సిన్ వేయించుకున్నవారు శృంగారంలో పాల్గొనడం క్షేమమేనా? నిపుణులు ఏమంటున్నారు?
ఒకవైపు కరోనా పై యుద్ధాన్ని వాక్సిన్ల సహాయంతో ముమ్మరంగా చేస్తున్నాయి ప్రభుత్వాలు. వాటిని ప్రజలందరూ వేసుకునేలా చేయడానికి అవసరమైన చర్యలు అన్నీ తీసుకుంటున్నాయి.
COVID Vaccine: ఒకవైపు కరోనా పై యుద్ధాన్ని వాక్సిన్ల సహాయంతో ముమ్మరంగా చేస్తున్నాయి ప్రభుత్వాలు. యుద్ధప్రాతిపాదికన వాక్సిన్ ను ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చిన ప్రభుత్వాలు.. వాటిని ప్రజలందరూ వేసుకునేలా చేయడానికి అవసరమైన చర్యలు అన్నీ తీసుకుంటున్నాయి. కానీ, వాక్సిన్ పై ప్రజల్లో అనేక సందేహాలు మాత్రం నెలకొని ఉన్నాయి. ఎంతవరకూ ఈ వ్యాక్సిన్ లు రక్షణ కల్పిస్తాయి అనే సందేహం ప్రజల్లో ఇంకా ఉంది. అంతేకాకుండా వాక్సిన్ లతో వచ్చే సైడ్ ఎఫెక్ట్ ల పైన కూడా ఎన్నో అనుమానాలు సాధారణ ప్రజలను పట్టి పీడిస్తున్నాయి.
ఇదిలా ఉంటే.. తాజాగా వినవస్తున్న ఒక వార్త వాక్సిన్ తీసుకున్నవారిని గందరగోళంలో పడేస్తోంది. వాక్సిన్ తీసుకున్నవారు సెక్స్ లో పాల్గొంటే ఏదైనా హాని జరిగే అవకాశం ఉందా అనే సందేహం అందరిలోనూ పెరిగిపోతోంది. అందుకు కారణం లేకపోలేదు.
కొవాక్సిన్, కోవిషీల్డ్ రెండు వ్యాక్సిన్ లు ప్రస్తుతం మనదేశంలో అందుబాటులో ఉన్నాయి. అయితే, రెండు వ్యాక్సిన్ లకు సంబంధించి కొన్ని అనుమానాలను ఇప్పటికీ ఆయా సంస్థలు పూర్తిగా నివృత్తి చేయలేకపోయాయి. అయినప్పటికీ డ్రాగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) మాత్రం వీటికి అనుమతి ఇచ్చేసింది.
వ్యాక్సిన్ తీసుకున్నవారు సెక్స్ లో పాల్గొనవచ్చా?
ఈ రెండు వ్యాక్సిన్ లు కూడా మన దేశంలోనే తయారు అవుతున్నాయి. వీటిపై పరిశోధనలు ఇంకా పూర్తి కాలేదు. మరోవైపు భారతీయులకు మాత్రం ఈ వ్యాక్సిన్ లు ఇస్తున్నారు. ఈ విషయంలో ఆరోగ్య మంత్రిత్వ శాఖ మాత్రం ఎటువంటి గైడ్ లైన్స్ ఇప్పటివరకూ ఇవవలేదు. అయితే, ఆరోగ్య నిపుణులు మాత్రం కొన్ని సూచనలు చేస్తున్నారు.
కొవాక్సిన్ వ్యాక్సిన్ల క్లినికల్ ట్రయల్స్ ఫేస్ 3 లో ప్రస్తుతం పాల్గొంటున్న వాలంటీర్లకు ఆరోగ్య నిపుణులు ఓ కీలక జాగ్రత్తలు చెబుతున్నారు. వారిని మూడు నెలల పాటు శృంగారంలో పాల్గొనే సమయంలో కండోమ్ కచ్చితంగా వాడమని సూచిస్తున్నారు.
పునరుత్పత్తి సామర్ధ్యం ఉన్న మగవారిని కచ్చితంగా సెక్స్ లో పాల్గొనే సమయంలో కండోమ్ వాడమని చెప్పడమే కాకుండా స్పెర్మ్ డొనేట్ చేయవద్దని కూడా చెబుతున్నారు. వాక్సిన్ చివరి డోస్ తీసుకున్న తరువాత కనీసం మూడు నెలల పాటు ఈ జాగ్రత్తలు తప్పనిసరి అని చెబుతున్నారు.
వ్యాక్సిన్ లపై ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారు?
ఇప్పుడు ఈ విషయం చర్చనీయాంశంగా మారిపోయింది. ఏ సూచన ఇప్పుడు ప్రభుత్వం నిర్వహిస్తున్న వాక్సినేషన్ డ్రైవ్ లో వాక్సిన్ తీసుకుంటున్న వారికీ వర్తిస్తుందా లేదా అనేది ప్రస్తుతం పెద్ద ప్రశ్నగా మారిపోయింది. ఆరోగ్య నిపుణులు మాత్రం ఈ విషయంలో స్పష్టమైన అభిప్రాయం వ్యక్తం చేయకపోయినా.. వాక్సిన్ తీసుకున్నవారు సెక్స్ లో పాల్గొంటే అది పిండం లేదా ఫలదీకరణం పై ప్రతికూల ప్రభావాన్ని చూపించవచ్చని భావిస్తున్నారు.
నిపుణులు చెబుతున్న దాని ప్రకారం పునరుత్పత్తి సామర్ధ్యం ఉన్నవారు.. తమ భాగస్వామితో 3 నుంచి 12 నెలల పాటు సెక్స్ లో పాల్గొనకపోవడమే మంచిది అని అంటున్నారు. ఘజియాబాద్ కు చెందిన కొలంబియా ఆసియా ఆసుపత్రి ఇంటర్నల్ మెడిసిన్ డాక్టర్ దీపక్ వర్మ ప్రముఖ పత్రికకు ఇంటర్వ్యూ ఇస్తూ ”కోవిడ్-19 వైరస్ న్యూట్రలైజ్ చేయడం కోసం వ్యాక్సిన్ అభివృద్ధి చేశారు. ఇప్పుడప్పుడే ఈ వ్యాక్సిన్ లతో వచ్చే సైడ్ ఎఫెక్ట్ ల గురించి చెప్పలేము. కానీ, ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్త వహించడం మంచిదే కదా” అంటున్నారు.