AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Five Foods in Your Diet : బరువు తగ్గడానికి.. ఆకలి వేయకుండా ఉండటానికి.. ఈ ఐదు రకాల ఆహారాలను మీ డైట్‌లో చేర్చుకోండి..

Five Foods in Your Diet : పెరుగుతున్న బరువును తగ్గించుకోవడానికి చాలా మంది డైట్ ‌ప్లాన్ చేస్తారు కానీ ఈ విషయాలను మరిచిపోతారు. మధ్యాహ్నం ఆహారం తినడానికి ముందు.. తరువాత విపరీతమైన

Five Foods in Your Diet : బరువు తగ్గడానికి.. ఆకలి వేయకుండా ఉండటానికి.. ఈ ఐదు రకాల ఆహారాలను మీ డైట్‌లో చేర్చుకోండి..
uppula Raju
|

Updated on: Mar 30, 2021 | 9:54 PM

Share

Five Foods in Your Diet : పెరుగుతున్న బరువును తగ్గించుకోవడానికి చాలా మంది డైట్ ‌ప్లాన్ చేస్తారు కానీ ఈ విషయాలను మరిచిపోతారు. మధ్యాహ్నం ఆహారం తినడానికి ముందు.. తరువాత విపరీతమైన ఆకలి ఉంటుంది. ఈ సమయంలో చాలా మంది ఆకలిని నుంచి తప్పించుకోవడానికి బరువు పెరిగే ఆహారాన్ని తింటుంటారు. ఈ కారణంగా బరువు పెరుగుతారు. అంతేకాకుండా స్నాక్స్ తిన్న తర్వాత కూడా మీకు మళ్ళీ ఆకలి వేస్తుంది. అనారోగ్యకరమైన ఆహారం తినడం వల్ల ఆకలి తీరినా.. దాని ద్వారా కేలరీలు పెరుగుతాయి దీంతో మీ బరువు అలాగే ఉంటుంది. మీ ఆకలిని తీరడానికి మీరు ఆరోగ్యకరమైన ఆహారం తినాలి.. ఇదే సమయంలో బరువు కూడా పెరుగొద్దు.. ఇలా కావాలంటే ఈ పద్దతులను పాటిస్తే సరి. మీరు మీ డైట్‌లో ఈ ఐదు ఆహారాలను చేర్చుకుంటే బరువు పెరగడం నుంచి తప్పించుకుంటారు.

1. బాదం మీ ఆకలిని తగ్గించడంలో బాదం మంచిగా పనిచేస్తుంది. బాదంపప్పులో విటమిన్ ఇ, మెగ్నీషియం, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ అధికంగా ఉంటాయి, ఇవి మీ ఆకలిని తగ్గిస్తాయి. రోజూ బాదం తినడం మీ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అలాగే మీ ఆకలి కూడా ప్రశాంతంగా ఉంటుంది.

2. డార్క్ చాక్లెట్ చాక్లెట్ తినడం వల్ల మంచి ప్రయోజనాలున్నాయి. మీరు సాధారణ చాక్లెట్‌కు బదులుగా డార్క్ చాక్లెట్‌ను తినండి.. ఇందులో 70 శాతం కోకా ఉంటుంది. ఇది మీ ఆకలిని చాలాకాలం ప్రశాంతంగా ఉంచుతుంది. ఇది స్టెరిక్ ఆమ్లాన్ని కలిగి ఉంటుంది, ఇది జీర్ణవ్యవస్థను నెమ్మదిస్తుంది. మీకు ఎక్కువసేపు ఆకలి అనిపించదు. మీరు రోజూ రెండు ముక్కలు డార్క్ చాక్లెట్ తినవచ్చు.

3. దాల్చిన చెక్క దాల్చినచెక్క మన ఇంట్లో సులభంగా లభిస్తుంది. దాల్చినచెక్క మీ ఆహార రుచిని పెంచుతుంది అలాగే చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది. 2007 అధ్యయనం ప్రకారం.. రోజూ 6 గ్రాముల దాల్చినచెక్క తినడం వల్ల జీర్ణ ప్రక్రియను నెమ్మదిస్తుంది, దీనివల్ల మీ కడుపు చాలా కాలం పాటు నిండి ఉంటుంది. మీరు దాల్చిన చెక్కను వోట్మీల్స్, స్మూతీస్, హెర్బల్ టీలతో కలపడం ద్వారా తినవచ్చు.

4. మెంతులు ఆయుర్వేద వ్యాధులపై పోరాడడం, ఆహారంలో రుచిని పెంచడంలో మెంతి చాలా బాగా పనిచేస్తుంది. ఇది మీ జీర్ణవ్యవస్థను బలోపేతం చేయడానికి పనిచేసే 45 శాతం ఫైబర్ కలిగి ఉంటుంది. రుచిని జోడించడానికి మెంతులను భారతీయ వంటకాల్లో ఉపయోగిస్తారు. బరువు తగ్గడానికి గ్లాసు నీటిలో చెంచా మెంతి గింజలు వేసి తాగాలి.

5. అల్లం అల్లం వేలాది సంవత్సరాలుగా వివిధ రకాల అనారోగ్యాలకు చికిత్సగా ఉపయోగిస్తున్నారు. ఇది అద్భుతమైన జీర్ణ శక్తిని కలిగి ఉంది. ఇది మీ ఆకలిని చాలాకాలం ప్రశాంతంగా ఉంచుతుంది. 2012 అధ్యయనం ప్రకారం.. అల్పాహారంలో అల్లం తినే వ్యక్తులు రాబోయే మూడు గంటలు ఆకలితో ఉండరు. మీరు ఉదయం టీ, హెర్బల్ టీలో అల్లం ఉపయోగించవచ్చు.

Work From Home: ఇకపై ఆఫీసులు ఉండవా..? శాశ్వతంగా వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ విధానమేనా.? సర్వేలో వెల్లడైన..

Raviprakash Arrest : మద్యం మత్తులో బైక్ నడిపి మహిళ మృతికి కారణమైన రవిప్రకాష్‌ని అరెస్ట్ చేసిన మాదాపూర్ పోలీసులు

మీ పిల్లలకు ఐదేళ్లు నిండాయా..! వెంటనే ఆధార్‌ కార్డ్‌కి సంబంధించి ఈ పని చేయండి.. లేదంటే అంతే సంగతులు..