Work From Home: ఇకపై ఆఫీసులు ఉండవా..? శాశ్వతంగా వర్క్ ఫ్రమ్ హోమ్ విధానమేనా.? సర్వేలో వెల్లడైన..
Work From Home: కరోనా మహమ్మారి కారణంగా తీవ్రంగా ప్రభావితమైన రంగాల్లో ఉపాధి రంగం ఒకటి. ఈ వ్యాధి వర్క్ ఫ్రమ్ హోమ్ అనే కొత్త కల్చర్‌ను ఉద్యోగులకు పరిచయం చేసింది. అంతకుముందు ఎప్పుడూ ఇంటి నుంచి పని చేసే విధానాన్ని అమలు చేయని సంస్థలు...
Work From Home: కరోనా మహమ్మారి కారణంగా తీవ్రంగా ప్రభావితమైన రంగాల్లో ఉపాధి రంగం ఒకటి. ఈ వ్యాధి వర్క్ ఫ్రమ్ హోమ్ అనే కొత్త కల్చర్‌ను ఉద్యోగులకు పరిచయం చేసింది. అంతకుముందు ఎప్పుడూ ఇంటి నుంచి పని చేసే విధానాన్ని అమలు చేయని సంస్థలు సైతం కరోనా కారణంగా అటువైపుగా అడుగులు వేయాల్సి వచ్చింది. ఇక కరోనా వ్యాప్తి మొదలైన రోజుల్లో ఉన్న పరిస్థితులు ఇప్పుడు లేవు, అప్పుడున్న లాక్‌డౌన్ లేదు కానీ.. కొన్ని కంపెనీలు ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని కొనసాగిస్తూనే ఉన్నాయి. ఇక ఉద్యోగులు కూడా పట్టణాలను వదిలి సొంతూళ్లకు వెళ్లిపోయారు. ఈ కొత్త కల్చర్ పుణ్యామాని రివర్స్ మైగ్రేషన్ మొదలైంది. ఇదిలా ఉంటే మొదట్లో తప్పనిసరి పరిస్థితుల్లో వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్‌ను మొదలుపెట్టిన కంపెనీలు ఇప్పుడు దాన్ని శాశ్వతంగా మార్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా బీసీజీ-జూమ్ నిర్వహించే సర్వేలో ఈ విషయం స్పష్టమైంది. ఈ సర్వేలో పాల్గొన్న సుమారు 87 శాతం సంస్థలు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని శాశ్వతంగా అమలు చేయనున్నట్లు తెలిపాయి. అంతేకాకుండా మొదటితో పోలిస్తే ప్రస్తుతం వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తోన్న వారి సంఖ్య మూడు నుంచి ఐదు రెట్లు పెరిగినట్లు ఈ సర్వేలో తేలింది. ఈ సర్వేను భారత్‌తో పాటు అమెరికా, యూకే, జపాన్, జర్మనీ దేశాల్లో నిర్వహించారు. ఇక వర్క్ ఫ్రమ్ హోమ్ విధానం ద్వారా మొదట్లో చిన్న చిన్న సమస్యలున్నా ఇప్పుడు పనితీరు బాగా మెరుగుపడిందని సంస్థలు చెప్పుకొచ్చాయి. సర్వేలో భాగంగా సంస్థల్లో ఉన్న మేనేజర్ స్థాయి వ్యక్తులను ఇంటర్వ్యూ చేయగా 70 శాతం మంది ఇంటి నుంచి పనిచేయడానికే తమ ఓటు వేశారు. ఇక కరోనా సమయంలో వర్క్ ఫ్రమ్ హోమ్ కారణంగా కంపెనీలకు పెద్ద మొత్తంలో డబ్బు ఆదా కావడంతో పాటు చాలా మంది ఉద్యోగాలు కోల్పోలేదని గణంకాలు చెబుతున్నాయి.