Raviprakash Arrest : మద్యం మత్తులో బైక్ నడిపి మహిళ మృతికి కారణమైన రవిప్రకాష్‌ని అరెస్ట్ చేసిన మాదాపూర్ పోలీసులు
Ravi Prakash Arrested for killing a woman : హైదరాబాద్ లోని మాదాపూర్ ప్రాంతంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఒక అమాయిక..
Ravi Prakash Arrest for killing a woman : హైదరాబాద్ లోని మాదాపూర్ ప్రాంతంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఒక అమాయిక మహిళ క్షణాల్లో ప్రాణాలు కోల్పోయింది. బైక్ పై మద్యం మత్తులో మహిళని రవిప్రకాష్ అనే యువకుడు వేగంగా ఢీ కొట్టడంతో సదరు మహిళ అక్కడికక్కడే ప్రాణాలొదిలింది. పూటుగా మద్యం సేవించి మత్తులో బైక్ నడిపి ఒక మహిళ మృతికి కారణమైన సదరు వ్యక్తిని మాదాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. మాదాపూర్ అయ్యప్ప సొసైటీ 100 ఫీట్ రోడ్డు లో కార్వీ ఆఫీసు ఎదుట రోడ్డు ఈ ప్రమాదం జరిగింది.
మృతురాలి పేరు కవిత అని గుర్తించారు. ఆమెకు ఇద్దరు పిల్లలు ఉన్నట్టు తెలుస్తోంది. అతిగా మద్యం సేవించిన రవి ప్రకాష్ అనే వ్యక్తి అతి వేగంగా యమహా బైక్ తో ఢీకొనడం తోనే కవిత మృతి చెందినట్టు పోలీసులు ప్రాధమిక నిర్ధారణకు వచ్చారు. ప్రమాదానికి కారణమైన రవి ప్రకాష్ స్పాట్ లో పీకల్లోతు మద్యం మత్తులో ఉన్నట్టు గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేశారు.