Cylenders Blast: నంద్యాల చెక్‌పోస్టు వద్ద భారీ పేలుడు.. భయంతో పరుగులు తీసిన స్థానికులు

Massive explosion at Nandyala check post: కర్నూలు జిల్లాలోని నంద్యాల చెక్ పోస్టు భారీ పేలుడు సంభవించింది. నంద్యాల

Cylenders Blast: నంద్యాల చెక్‌పోస్టు వద్ద భారీ పేలుడు.. భయంతో పరుగులు తీసిన స్థానికులు
Oxygen Cylinder Exploded
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Mar 31, 2021 | 12:38 AM

Massive explosion at Nandyala check post: కర్నూలు నగరంలోని నంద్యాల చెక్ పోస్టు భారీ పేలుడు సంభవించింది. నంద్యాల చెక్‌పోస్టు వద్దనున్న ఓ హోటల్ గదిలో ఉన్న మూడు సిలెండర్లు పేలాయి. దీంతో అక్కడున్న వారంతా భయంతో పరుగులు తీశారు. ఈ ప్రమాదం మంగళవారం రాత్రి జరిగింది. అదృష్టవశాత్తూ హోటల్‌లో ఎవరూ లేకపోవడంతో.. ప్రాణ నష్టం తప్పింది. మద్దిలేటి అనే వ్యక్తి చెక్‌పోస్టు వద్ద చిన్నపాటి రేకులషెడ్డులో హోటల్ నడుపుతున్నాడు. గ్రామంలో జాతర జరుగుతుండటంతో ఇంటికి వెళ్లాడు. ఈ క్రమంలో హోటల్ గదిలో 16 సిలిండర్లు ఉన్నాయి. వాటిలో మూడు పేలడంతో భారీగా మంటలు చెలరేగాయి.

చుట్టూ పక్కల ఉన్న ప్రజలంతా భయం ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మూడు ఫైరింజన్లతో చేరుకోని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అనంతరం హోటల్ యజమానిని పోలీసులు అదుపులోకి తీసుకోని విచారిస్తున్నారు.

వీడియో..

Also Read: