Mouth Ulcers: నోటి పూతతో బాధపడుతున్నారా..? అయితే సులువుగా ఇలా తగ్గించుకోవచ్చు తెలుసా..
Canker Sores Remedies: నోటి అల్సర్లు.. నోటి పూత.. ఈ రెండు కూడా ఒకటే.. అయితే ఈ సమస్యను చాలా మంది ఎదుర్కొంటుంటారు. నోటిలో పుండ్లు అయితే ఆ బాధ వర్ణనాతీతం. ఈ నోటి పూత వల్ల
Canker Sores Remedies: నోటి అల్సర్లు.. నోటి పూత.. ఈ రెండు కూడా ఒకటే.. అయితే ఈ సమస్యను చాలా మంది ఎదుర్కొంటుంటారు. నోటిలో పుండ్లు అయితే ఆ బాధ వర్ణనాతీతం. ఈ నోటి పూత వల్ల ఆహారం తినడం, నీరు తాగడం చాలా కష్టమవుతుంది. బ్రష్ చేయాలన్నా ఇబ్బందిగా ఉంటుంది. ఏం తిన్నా నోరంతా మండుతూ ఉంటుంది. ఈ పుండ్లు నోటిలో పెదాల కింద, బుగ్గల భాగంలో, నాలుకపై ఇలా ప్రతీ చోట వస్తుంటాయి. ఇవి ఎక్కువగా వేడి వల్లనే వస్తుంటాయి. అయితే నోటి పూతకు ఇంట్లో దొరికే కొన్ని ఆహార పదార్థాలతోనే చెక్ పెట్టొచ్చంటున్నారు నిపుణులు.. అవేంటో ఇప్పుడు చూద్దాం.
తేనె.. తేనె నోటి అల్సర్లను తగ్గించడంతో శక్తివంతంగా పనిచేస్తుంది. తేనెలో ఉండే.. యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు నోటి పూతను నయం చేయడంలో అద్భుతంగా పనిచేస్తాయి. అల్సర్లు అయిన చోట తేనె పూస్తే.. ఆ ప్రాంతంలో తేమగా మారి ఉపశమనం కలుగుతుంది. నోరు పొడి బారకుండా.. దురద రాకుండా తగ్గిస్తుంది. ఇలా చేయడం వలన అల్సర్లకు కారణమయ్యే బ్యాక్టీరియా తొందరగా నాశనమవుతుందని నిపుణులు పేర్కొంటున్నారు.
కొబ్బరి నూనె.. నోటిలో పుండ్లు అయిన చోట కొబ్బరి నూనెను రాయడం వల్ల మంట తగ్గి ఉపశమనం కలుగుతుంది. దీంతోపాటు పుండ్ల వల్ల కలిగే వాపు కూడా తగ్గుతుంది. ఎండు కొబ్బరిని నమిలినా ఫలితం ఉంటుందని పేర్కొంటున్నారు. కొబ్బరి నీళ్లు తాగిన అల్సర్ల సమస్య నుంచి బయటపడొచ్చు.
ఆపిల్ సైడర్ వెనిగర్.. నోటి పుండ్లను ఆపిల్ సైడర్ వెనిగర్ తొందరగా.. అరికడుతుంది. దీనిద్వారా నోటి పుండ్లు వెంటనే నయమవుతాయి. ఇది అల్సర్లకు కారణమయ్యే సూక్ష్మక్రిములను నాశనం చేస్తుంది. కావున మూడు టీస్పూన్ల ఆపిల్ సైడర్ వెనిగర్‌ను కొంచెం నీటిలో వేసి.. 30 సెకన్ల పాటు నోటిలో ఉంచి గార్గింగ్ చేయాలి. దీంతో నోటి పూత నుంచి తక్షణ ఉపశమనం పొందవచ్చు.
ఉప్పునీరు.. నోటిపూతను తగ్గించడంలో ఉప్పునీరు బాగా పనిచేస్తుంది. నోటి పూతలను నయం చేసేందుకు ప్రాచీన కాలం నుంచి ఈ పద్దతిని ఉపయోగిస్తున్నారు. ఉప్పునీటి పుక్కిలించడం వల్ల ఈ సమస్య తొందరగా నయమవుతుంది.
వెల్లుల్లి.. వెల్లుల్లి యాంటిబయోటిక్‌గా పనిచేస్తుందని మనందరికీ తెలుసు.. వెల్లుల్లి నోటిపూతను తొందరగా తగ్గిస్తుంది. వెల్లుల్లిలోని శక్తివంతమైన అల్లిసిన్ నొప్పిని తగ్గించడంతోపాటు నోటి పుండ్లను అరికడుతుంది. కొంచెం వెల్లుల్లి పేస్ట్ తీసుకోని పుండు పై భాగంలో 10-20 నిమిషాల పాటు ఉంచితే.. ఉపశమనం కలుగుతుంది.
ALSO READ: