Flax Seeds Benefits: అవిసె గింజలు.. వీటి గురించి చాలామందికి పెద్దగా తెలిసి ఉండదు. కానీ వీటి వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయో తెలసుకుంటే మాత్రం అస్సలు వదిలిపెట్టరు. ఈ అవిసె గింజలను రోజూ వారి ఆహారంలో తీసుకుంటే.. ఎన్నో రకాల రోగాల నుంచి ఉపశమనం పొంది ఆరోగ్యవంతంగా ఉండవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు.
1 / 5
ఈ అవిసె గింజల్లో అధికంగా ఫైబర్ ఉంటుంది. దీంతో ఒమేగా-3, యాంటీ ఇన్ఫెమేటరీ స్వభావం ఎక్కువగా ఉంటాయి. వీటిని తీనడం వల్ల గుండెకు మేలు జరుగుతుందని.. హృదయ సంబంధిత వ్యాధులనుంచి ఉపశమనం పొందవచ్చని పేర్కొంటున్నారు.
2 / 5
కీళ్ల నొప్పులు, వాపులు, కీళ్ల వాతం నిర్మూలనకు అవిసె గింజలు దివ్యఔషధంలా పనిచేస్తాయి. అయితే.. వీటిని వేయించి పొడి చేసి ఆహార పదార్ధాలలో కలుపుకొని తినవచ్చు. దీంతోపాటు పొడిని నీటిలో కలుపుకొని తాగవచ్చు.
3 / 5
అవిసె గింజలు రోజూ ఉపయోగించడం వల్ల జీర్ణవ్యవస్థ ప్రక్రియ మెరుగుపడుతుంది. అతిసారం, మలబద్ధకం వంటి సమస్యలు తొలిగిపోతాయి. ఉదరం సమస్యలను నియంత్రిస్తాయి.
4 / 5
రక్తంలోని షుగర్ లెవెల్స్ ను నియంత్రించడంలో అవిసెగింజలు బాగా సహాయపడతాయి. వీటిని తరచు తీసుకుంటే మధుమేహం బారిన త్వరగా పడే అవకాశముందని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు.