AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మీరు మటన్, చికెన్ లివర్స్ ని ఇష్టంగా తింటున్నారా..! అయితే ఇది మీ కోసమే..!

చికెన్, మటన్ లివర్ పోషక విలువలతో శరీరానికి మేలు చేస్తాయి. వీటిలో ప్రోటీన్, ఐరన్, సెలీనియం, విటమిన్ బి12, ఫోలెట్, విటమిన్ ఎ లాంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తహీనత నివారణ, మెదడు ఆరోగ్యం, రోగనిరోధక శక్తి పెంపు వంటి ప్రయోజనాలను అందిస్తాయి. అయితే అధికంగా తీసుకుంటే గుండె సంబంధిత సమస్యలు రావచ్చు అంటున్నారు నిపుణులు.

మీరు మటన్, చికెన్ లివర్స్ ని ఇష్టంగా తింటున్నారా..! అయితే ఇది మీ కోసమే..!
Chicken Mutton Livers
Prashanthi V
|

Updated on: Feb 03, 2025 | 12:36 PM

Share

నాన్ వెజిటేరియన్ లో చికెన్, మటన్ లివర్ ప్రత్యేక రుచి కారణంగా చాలా మంది తినడానికి ఇష్టపడుతారు. లివర్ ఫ్రై, లివర్ కర్రీ, లివర్ గ్రేవీ వంటివి ఇష్టంగా తింటుంటారు. కానీ దీని ఆరోగ్య ప్రయోజనాలు, నష్టాలను తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యం. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

చికెన్ లివర్ ప్రయోజనాలు

చికెన్ లివర్ అనేక పోషకాలకు అద్భుతమైన మూలం. ఇందులో ప్రోటీన్, ఐరన్, సెలీనియం, విటమిన్ బి12, ఫోలెట్, విటమిన్ ఎ అధికంగా ఉంటాయి. ముఖ్యంగా విటమిన్ బి12 మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరిచే శక్తిని కలిగి ఉంది. సెలీనియం కేన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.

చికెన్ లివర్ రక్తంలో షుగర్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇది డయాబెటిస్ ఉన్నవారికి ప్రయోజనం కలిగించే అవకాశం ఉంది. అంతేకాకుండా ఫోలెట్ లైంగిక ఆరోగ్యాన్ని మెరుగుపరిచే గుణాలను కలిగి ఉంటుంది. ఉడికించిన చికెన్ లివర్ తినడం వల్ల కొవ్వు శాతం తక్కువగా ఉండి బరువు పెరగకుండా ఉంటుంది.

మటన్ లివర్ ప్రయోజనాలు

మటన్ లివర్ అంటే కూడా చాలా మంది ఇష్టపడుతారు. ఇందులో విటమిన్ ఎ, డి, బీ12, ఐరన్, జింక్, పొటాషియం, రాగి వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. మటన్ లివర్ రక్తహీనతను నివారించడంలో శరీరంలోని ఆక్సిజన్ సరఫరాను మెరుగుపరిచే పనితీరును అందిస్తుంది.

విటమిన్ బీ12 రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. మటన్ లివర్‌లో ఉండే ఖనిజాలు శరీర ఎంజైమ్ పనితీరును మెరుగుపరిచే శక్తిని కలిగి ఉంటాయి.

హానికరమైన విషయాలు

ఈ చికన్, మటన్ లివర్స్ ని అధికంగా తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగే అవకాశం ఉంది. గుండె వ్యాధులు, కొలెస్ట్రాల్ సమస్యలు, ఫ్యాటీ లివర్ ఉన్నవారు లివర్ తో చేసిన వంటకాలను ఎక్కువగా తీసుకోకూడదు. అలాగే కిడ్నీ వ్యాధులు ఉన్నవారు కూడా డాక్టర్ సలహా తీసుకోవడం మంచిది.

లివర్ తినే సరైన పద్ధతి

లివర్‌ను ఎక్కువగా ఫ్రై చేయకుండా ఉడికించి కూరగాయలతో కలిపి తినడం మంచిది. వారానికి ఒకటి లేదా రెండు సార్లు మాత్రమే తినడం ఉత్తమం. మటన్ లివర్, చికెన్ లివర్ కంటే ఎక్కువ పోషకాలు కలిగి ఉన్నప్పటికీ లిమిటెడ్ గా తీసుకోవడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

భద్రతా దళాలు-ఉగ్రవాదుల మధ్య భీకర ఎన్‌కౌంటర్!
భద్రతా దళాలు-ఉగ్రవాదుల మధ్య భీకర ఎన్‌కౌంటర్!
సిపిఐ శతాబ్ది ఉత్సవాలు.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రసంగం..
సిపిఐ శతాబ్ది ఉత్సవాలు.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రసంగం..
క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లించకపోతే మిమ్మల్ని అరెస్టు చేయవచ్చా?
క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లించకపోతే మిమ్మల్ని అరెస్టు చేయవచ్చా?
ఒకే రోజు ఏడు వాహనాలపై భక్తులను క‌టాక్షించ‌నున్న మలయప్ప స్వామి
ఒకే రోజు ఏడు వాహనాలపై భక్తులను క‌టాక్షించ‌నున్న మలయప్ప స్వామి
ఆటోలో అనుమానాస్పదంగా కనిపించిన నీలి రంగు పెట్టె..!
ఆటోలో అనుమానాస్పదంగా కనిపించిన నీలి రంగు పెట్టె..!
కదిలే కారులోకి దూసుకొచ్చిన అడవి మృగం..తల్లి ఒడిలోని చిన్నారి మృతి
కదిలే కారులోకి దూసుకొచ్చిన అడవి మృగం..తల్లి ఒడిలోని చిన్నారి మృతి
ఒకే బ్యాటర్ పై మూడు సార్లు అటాక్..హర్షిత్ హ్యాట్రిక్ రికార్డ్
ఒకే బ్యాటర్ పై మూడు సార్లు అటాక్..హర్షిత్ హ్యాట్రిక్ రికార్డ్
ఆలయానికి ఏ పండు తీసుకెళ్తే శుభ ప్రదం.? ఎలాంటి ఫలితం వస్తుందో..
ఆలయానికి ఏ పండు తీసుకెళ్తే శుభ ప్రదం.? ఎలాంటి ఫలితం వస్తుందో..
చికెన్ లివర్ తింటున్నారా? అయితే, ఈ విషయాలు తెలుసుకోండి
చికెన్ లివర్ తింటున్నారా? అయితే, ఈ విషయాలు తెలుసుకోండి
వాట్సాప్‌ స్క్రీన్‌షాట్‌ కోర్టులో సాక్ష్యంగా చెల్లుతుందా?
వాట్సాప్‌ స్క్రీన్‌షాట్‌ కోర్టులో సాక్ష్యంగా చెల్లుతుందా?