Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Star Fruit: వావ్.. స్టార్ ఫ్రూట్స్‌ తింటే ఇన్ని లాభాలా..? తెలిస్తే షాక‌వుతారు..!

కంటి చూపు మెరుగు పడటానికి సహాయం చేస్తుంది. ఈ పండ్లను ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా కళ్లలో శుక్లాలు రాకుండా చేస్తుంది. కంటి ఆరోగ్యం మెరుగవుతుంది. ఇందులోని విటమిన్ బి6 మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. దీనివల్ల మెదడు ఉత్తేజకరంగా మారి యాక్టివ్‌గా పనిచేస్తుంది. మిమ్మల్నీ ఉత్సాహంగా ఉంచుతుంది.

Star Fruit: వావ్.. స్టార్ ఫ్రూట్స్‌ తింటే ఇన్ని లాభాలా..? తెలిస్తే షాక‌వుతారు..!
Star Fruit
Follow us
Jyothi Gadda

|

Updated on: Feb 03, 2025 | 11:59 AM

మార్కెట్‌లో మనకు ఎన్నో రకాల వెరైటీ ఫ్రూట్స్‌ అందుబాటులో ఉంటాయి. ముఖ్యంగా శీతాకాలంలో మరిన్ని రకాల పండ్లు నోరూరిస్తుంటాయి. చాలా మంది ఈ పండ్లను కొని తినడానికి ఆసక్తి చూపుతుంటారు. అలాంటి పండ్లలో స్టార్ ఫ్రూట్ కూడా ఒకటి. ఇది నక్షత్ర ఆకారంలో ఉండి, పసుపు రంగులో ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఈ పండు రుచిలో మాత్రమే కాదు.. ఆరోగ్యపరంగా మనకు ఎన్నో లాభాలను అందిస్తుందని మీకు తెలుసా.? స్టార్‌ఫ్రూట్‌ని తరచూ ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలను పొందుతారని నిపుణులు చెబుతున్నారు.

స్టార్ ఫ్రూట్ రుచిలో తియ్యగా ఉండి క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఈ పండ్లలో ఫైబర్ అధికంగా ఉంటుంది. వీటిని తీసుకుంటే ఎక్కువ సమయం పాటు కడుపు నిండిన భావన కలుగుతుంది. ఎక్కువ సేపు ఆకలి వేయదు. దీంతో తీసుకునే ఆహార శాతం తగ్గుతుంది. ఫలితంగా అధిక బరువు తగ్గిపోతుంది. కాబట్టి బరువు తగ్గాలని కోరుకునే వారికి ఈ పండ్లు ఉత్తమమైన ఎంపిక అని చెబుతున్నారు. స్టార్ ఫ్రూట్‌లోని విటమిన్ బి6 శరీరమెటబాలిజంనుపెంచుతుంది. అందువల్ల క్యాలరీలు వేగంగా ఖర్చయ్యి కొవ్వు తగ్గిపోతుంది .

స్టార్ ఫ్రూట్‌లో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. దాంతో సీజనల్ వ్యాధుల నుండి ఉపశమనం కలిగిస్తుంది. దగ్గు, జలుబు వంటి సమస్యల నుంచి త్వరగా ఉపశమనం లభిస్తుంది.ఇంకా,ఈ పండ్లలోని విటమిన్ సి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది, చర్మం పగలకుండా ఉంటుంది. 100 గ్రాముల స్టార్ ఫ్రూట్‌లో సుమారు 2.8 గ్రాముల ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. గ్యాస్,అసిడిటీ నుంచి ఉపశమనాన్ని కలిగిస్తుంది. మలబద్ధకం తగ్గుతుంది. ఈ పండ్లలో పొటాషియం కూడా ఎక్కువగా ఉంటుంది,ఇది రక్త సరఫరాను మెరుగుపరుస్తుంది. రక్త నాళాల్లోని అడ్డంకులను ,హైబీపీ ని తగ్గిస్తుంది. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. హార్ట్ ఎటాక్ రాకుండా చూడటానికి సహాయం చేస్తుంది.

ఇవి కూడా చదవండి

నాడీ మండల వ్యవస్థ కూడా మెరుగుపడుతుంది, నరాల బలహీనత తగ్గుతుంది. మెడ, భుజం నొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది. స్టార్ ఫ్రూట్‌లో విటమిన్ ఎ కూడా అధికంగా ఉంటుంది. ఇది రోగ నిరోధక శక్తితో పాటుగా పాటు కళ్ళను కూడా సంరక్షిస్తుంది. కంటి చూపు మెరుగు పడటానికి సహాయం చేస్తుంది. ఈ పండ్లను ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా కళ్లలో శుక్లాలు రాకుండా చేస్తుంది. కంటి ఆరోగ్యం మెరుగవుతుంది. ఇందులోని విటమిన్ బి6 మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. దీనివల్ల మెదడు ఉత్తేజకరంగా మారి యాక్టివ్‌గా పనిచేస్తుంది. మిమ్మల్నీ ఉత్సాహంగా ఉంచుతుంది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది… ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని జీవనశైలి వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.