రోజుకు 10 వేల అడుగుల వాకింగ్ ఆరోగ్యానికి వరం..! ఎలాగో తెలుసుకోండి..
నేటి ఆధునిక జీవన శైలి, ఆహారపు అలవాట్ల కారణంగా ప్రజలు తీవ్రమైన అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. అందుకే తప్పనిసరిగా, యోగా, ప్రాణాయామం, వ్యాయామాలు అలవాటు చేసుకోవటం ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పొందుతారని వైద్య ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే, అందరికీ వ్యాయామం చేయడం కుదరకపోవచ్చు. అలాంటివారు రెగ్యులర్‌గా వాకింగ్ చేయడం వల్ల వ్యాయామం చేసినన్నీ ప్రయోజనాలు పొందొచ్చని చెబుతుంటారు. వాకింగ్ అనేది ఇది బరువు తగ్గడానికి మాత్రమే కాదు.. గుండె, మనస్సు, శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.
Updated on: Feb 03, 2025 | 7:36 AM

వాకింగ్‌లో రోజూ 10,000 అడుగులు నడవడం వల్ల శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. ఇది గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఇది గుండెను బలపరుస్తుంది. శరీరంలోని రక్తపోటు స్థాయిని నిర్వహించడంలో సహాయపడుతుంది.

చిత్తవైకల్యం యొక్క మరొక ముఖ్యమైన లక్షణం పార్కిన్సోనిజం. అంటే, చేతులు మరియు కాళ్ళు అకస్మాత్తుగా వణుకు ప్రారంభమవుతాయి. ముఖ్యంగా భావోద్వేగ పరిస్థితులలో చేతులు మరియు కాళ్ళు విపరీతంగా వణుకుతాయి. ఇది చిత్తవైకల్యానికి సంకేతం. నడుస్తున్నప్పుడు అకస్మాత్తుగా పడిపోవడం కూడా దీని సంకేతమే. నడుస్తూ బ్యాలెన్స్ కోల్పోవడం దీని ప్రధాన లక్షణం.

వాకింగ్ వల్ల శరీరంలోని రక్తంలో చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది. నడక ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచడంలో సహాయపడుతుంది. టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. డయాబెటిక్ రోగులకు వాకింగ్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

నడక శరీరానికే కాదు మానసిక ఆరోగ్యానికి కూడా మంచిది. ఇది ఒత్తిడి, నిరాశను తగ్గించడంలో సహాయపడుతుంది. మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. రోజూ వాకింగ్ చేయడం వల్ల నిద్ర నాణ్యత పెరుగుతుంది. రోజూ వాకింగ్ చేయడం వల్ల ఎముకలు దృఢంగా ఉండి కీళ్ల నొప్పులు తగ్గుతాయి. ఇది ఆస్టియోపోరోసిస్, ఆర్థరైటిస్ వంటి సమస్యలను దూరంగా ఉంచడంలో సహాయపడుతుంది.

ప్రతిరోజూ 30 నిమిషాలు వాకింగ్ చేస్తే రక్త ప్రసరణ మెరుగుపడి, బాడీకి ఆక్సిజన్ రవాణా బాగా జరుగుతుంది. దీంతో అలసట దూరమవుతుంది. తక్షణ శక్తి లభిస్తుంది. బరువు తగ్గాలనుకునేవారు ప్రతిరోజూ వాకింగ్ చేయడం మంచిది. దీనివల్ల కేలరీల ఖర్చు ఎక్కువగా జరుగుతుంది. దీంతో బరువు ఆరోగ్యంగా ఉంటుంది. బీపీ అదుపులో ఉండాలంటే రోజూ వాకింగ్ చేయడం మంచిది. దీనివల్ల రక్తంలో చెడు కొలెస్ట్రాల్ కరిగిపోయి రక్తపోటు అదుపులోకి వస్తుంది.




