AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Menstrual Health: నెలకు రెండుసార్లు పిరియడ్స్.. ఎందుకిలా జరుగుతుందో తెలుసా?

ప్రతి అమ్మాయి తప్పక భరించవల్సిన బాధ పీరియడ్స్. సాధారణంగా 13 లేదా 14 యేళ్లకు ఈ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత ప్రతి 24 నుంచి 38 రోజులకు ఒకసారి పీరియడ్స్ వస్తుంటాయి. అయితే ఒక్కోసారి నెలలో రెండు పీరియడ్స్ వస్తుంటాయి. ఇలా అకస్మాత్తుగా నెలకు రెండుసార్లు రుతుక్రమం ఎందుకు వస్తుందో? తెలియక ఆందోళన చెందుతుంటారు. అలాంటి సమస్య తరచుగా సంభవిస్తే ఏం చేయాలి? ఎలా నివరణ పొందాలి?..

Menstrual Health: నెలకు రెండుసార్లు పిరియడ్స్.. ఎందుకిలా జరుగుతుందో తెలుసా?
Irregular Periods
Srilakshmi C
|

Updated on: Aug 07, 2024 | 1:11 PM

Share

ప్రతి అమ్మాయి తప్పక భరించవల్సిన బాధ పీరియడ్స్. సాధారణంగా 13 లేదా 14 యేళ్లకు ఈ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత ప్రతి 24 నుంచి 38 రోజులకు ఒకసారి పీరియడ్స్ వస్తుంటాయి. అయితే ఒక్కోసారి నెలలో రెండు పీరియడ్స్ వస్తుంటాయి. ఇలా అకస్మాత్తుగా నెలకు రెండుసార్లు రుతుక్రమం ఎందుకు వస్తుందో? తెలియక ఆందోళన చెందుతుంటారు. అలాంటి సమస్య తరచుగా సంభవిస్తే ఏం చేయాలి? ఎలా నివరణ పొందాలి? అనే విషయాలు ఇక్కడ తెలుసుకుందాం.. నెలలో రెండు లేదా అంతకంటే ఎక్కువ పీరియడ్స్ రావడాన్ని సక్రమంగా లేని రుతుక్రమం అంటారు. కానీ ఈ రకమైన సమస్య చాలా అరుదు. అయితే నేటి కాలంలో చాలా మంది అమ్మాయిలు పీసీఓడీ సమస్యతో బాధపడుతున్నారు. దీని కారణంగా, నెలకు రెండుసార్లు పీరియడ్స్ వస్తుంటాయి. అరుదుగా వస్తే పెద్దగా ఇబ్బంది ఉండదుకానీ.. ఇలాంటి సమస్యలు తరచూ వస్తుంటే మాత్రం ఖచ్చితంగా వైద్యులను సంప్రదించాలి. ఇలా పీరియడ్స్ సక్రమంగా రాకపోవడం వల్ల ఒవేరియన్ ట్యూమర్, అండాశయ క్యాన్సర్ వచ్చే అవకాశం పెరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి జాగ్రత్తగా ఉండటం చాలా ముఖ్యం.

చాలా సార్లు, శరీరంలో ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ సమతుల్యత కోల్పోతుంది. ఒత్తిడి పెరిగినా, ఆహారంలో మార్పు వచ్చినా నెలకు రెండుసార్లు పీరియడ్స్ వస్తుంది. పీసీఓడీ, థైరాయిడ్, ఫ్రైబోయిడ్ సమస్యల కారణంగా కూడా నెలకు రెండుసార్లు పీరియడ్స్ వస్తుంది. మీరూ ఈ రకమైన సమస్యతో బాధపడుతుంటే ఈ చిట్కాల ద్వారా ఉపశమనం పొందొచ్చు.

ఇర్రెగ్యులర్ పీరియడ్స్‌ సమస్యకు అల్లం చక్కగా పనిచేస్తుంది. అల్లం తినడం వల్ల రుతుచక్రం సాధారణం అవుతుంది. అలాగే పీరియడ్స్ క్రాంప్స్, అధిక రక్తస్రావం, వికారం, అపానవాయువు సమస్యల నుంచి ఉపశమనం కూడా కలిగిస్తుంది. పీరియడ్స్ సమస్యల నుంచి ఉపశమనం పొందడంలో దాల్చిన చెక్క ఎంతగానో ఉపయోగపడుతుంది. మీరు PCODతో బాధపడుతున్నట్లయితే మీ ఆహారంలో దాల్చిన చెక్కను ఖచ్చితంగా చేర్చుకోవాలి. ఈ మసాలా దినుసు శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. దాల్చిన చెక్క క్రమంతప్పకుండా తినడం వల్ల పీరియడ్స్ సమస్య క్రమంగా తగ్గుతుంది.

యాపిల్ సైడర్ వెనిగర్ బ్లడ్ షుగర్ లెవల్స్, హార్మోన్ బ్యాలెన్స్ మెయింటెన్ చేయడంలో సహాయపడుతుంది. ఒక గ్లాసు నీటిలో ఒక చెంచా యాపిల్ సైడర్ వెనిగర్ మిక్స్ చేసి తాగినా ఫలితం ఉంటుంది. చాలా మంది బరువు తగ్గేందుకు జీలకర్ర నీరు తాగుతుంటారు. పీరియడ్స్ సమస్యల నివారణకు కూడా జీలకర్ర నీటిని తాగవచ్చు. ఖాళీ కడుపుతో జీలకర్ర నీటిని తాగడం వల్ల రుతుక్రమం ఆరోగ్యం మెరుగుపడుతుంది. పసుపులో కర్కుమిన్ ఉంటుంది. ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ పదార్ధంగా పనిచేస్తుంది. ఇది పీరియడ్స్ సమయంలో శారీరక అసౌకర్యాన్ని తగ్గిస్తుంది. హార్మోన్ల సమతుల్యతను కాపాడుతుంది. అందుకే మీ రోజువారీ ఆహారంలో పసుపును తప్పనిసరిగా తీసుకోవాలి.

మరిన్ని ఆరోగ్య సంబంధిత కథనాల కోసం క్లిక్ చేయండి.

Follow Us