Healthy Drinks: ఈ జ్యూస్‌ల ఉపయోగాలు తెలిస్తే.. ఉదయాన్నే టీ, కాఫీల జోలికి అస్సలు వెళ్లరు..
టీ, కాఫీలతోనే ఉదయాన్ని మొదలు పెట్టే వారు మనలో చాలా మంది ఉంటారు. లేవగానే టీ తాగితే కానీ రోజును మొదలు పెట్టరు. అయితే టీ, కాఫీలు ఆరోగ్యానికి మంచివి కావని తెలిసినా వాటిని వదిలిపెట్టడానికి ఇష్టపడరు. కారణం.. ఏళ్ల నుంచి వాటికి అలవాలు పడిపోవడమే. అయితే...

టీ, కాఫీలతోనే ఉదయాన్ని మొదలు పెట్టే వారు మనలో చాలా మంది ఉంటారు. లేవగానే టీ తాగితే కానీ రోజును మొదలు పెట్టరు. అయితే టీ, కాఫీలు ఆరోగ్యానికి మంచివి కావని తెలిసినా వాటిని వదిలిపెట్టడానికి ఇష్టపడరు. కారణం.. ఏళ్ల నుంచి వాటికి అలవాలు పడిపోవడమే. అయితే టీ, కాఫీలకు బదులుగా కొన్ని రకాల డ్రింక్స్‌ని అలవాటు చేసుకుంటే ఆరోగ్యం మీ సొంతమవుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ ఆ డ్రింక్స్ ఏంటంటే..
* ఉదయం లేవగానే టమాటో జ్యూస్ తీసుకోవడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. శరీరాన్ని హైడ్రేట్ చేయడంతోపాటు, అసిడిటీ వంటి సమస్యలకు చెక్ పెట్టొచ్చు. అలాగే ఉదయం శరీరానికి కావాల్సిన పోషకాలను ఇన్‌స్టాంగ్‌గా పొందొచ్చు.
* ఉదయం టీ, కాఫీలకు బదులుగా ఆలోవెరా జ్యూస్‌ను తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇందులోని సద్గుణాలు పేగుల వాపును తగ్గించడంలో ఉపయోగపడతాయి. ఉదయం లేవగానే కొంచెం కలబంద గుజ్జు నీటిలో వేసి బాగా మరిగించే తాగితే రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.
* యాపిల్ సిడర్ వెనిగర్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా ఉదయం పూట దీనిని తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగ్గా పనిచేస్తుంది. అలాగే రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో ఉపయోగపడుతుంది.
* ఉదయం లేవగానే సొరకాయ జ్యూస్ తాగడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ఈ జ్యూస్ తీసుకోవడం వల్ల రక్తం శుద్ధి అవుతుంది. శరీరంలోని ఇతర విష పదార్థలను బయటకు పంపుతుంది. ఎర్రకర్తకణాల ఉత్పత్తిలో కీలకపాత్ర పోషిస్తుంది. అయితే కేవలం సొరకాయే కాకుండా.. అందులో చిన్న దోసకాయ ముక్క, పుదీనా, నిమ్మరసం, జీలకర్రపొడి, కొద్దిగా ఉప్పు వేసుకొని జ్యూస్ చేసుకొని తాగితే మేలు.
నోట్: పైన తెలిపినవి కేవలం ప్రాథమిక సమాచారం కోసం అందించినవి మాత్రమే. ఆరోగ్యం విషయంలో వైద్యుల సూచనల మేరకే తుది నిర్ణయం తీసుకోవడం ఉత్తమం.
మరిన్ని హెల్త్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..