AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cholesterol: వైద్య రంగంలో మరో అద్భుతానికి నాంది.. కొలెస్ట్రాల్‌ను తగ్గించే ఇంజెక్షన్‌

మరీ ముఖ్యంగా చెడు కొలెస్ట్రాల్‌ స్థాయిలు పెరగడం వల్ల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుంది. LDL (లో డెన్సిటీ లిపోప్రోటీన్‌) అనేది చెడు కొలెస్ట్రాల్‌ శరీరంలో ఇది పెరిగితే.. లివర్ ఆరోగ్యానికి ముప్పు వాటిల్లుతుంది. రక్త ప్రసరణలో కూడా ఆటంకం కలుగుతుంది. స్ట్రోక్, హార్ట్ ఎటాక్ వంటి సమస్యలకు ఇదే ప్రధాన...

Cholesterol: వైద్య రంగంలో మరో అద్భుతానికి నాంది.. కొలెస్ట్రాల్‌ను తగ్గించే ఇంజెక్షన్‌
Inclisiran
Narender Vaitla
|

Updated on: Jan 15, 2024 | 5:27 PM

Share

వైద్య రంగంలో మరో అద్భుతానికి నాంది పడుతోంది. కొలెస్ట్రాల్‌ సమస్యకు చిన్న ఇంజక్షన్‌తో చెక్‌ పెట్టే రోజులు త్వరలోనే రానున్నాయి. ఇందుకు సంబంధించి ఇప్పటికే ఈ దిశగా అడుగులు పడుతున్నాయి. మరికొన్ని రోజుల్లోనే ఈ అద్భుతం సాకారం కానుంది. శరీరంలో కొలెస్ట్రాల్‌ ఎక్కువైతే ఎంతటి నష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

మరీ ముఖ్యంగా చెడు కొలెస్ట్రాల్‌ స్థాయిలు పెరగడం వల్ల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుంది. LDL (లో డెన్సిటీ లిపోప్రోటీన్‌) అనేది చెడు కొలెస్ట్రాల్‌ శరీరంలో ఇది పెరిగితే.. లివర్ ఆరోగ్యానికి ముప్పు వాటిల్లుతుంది. రక్త ప్రసరణలో కూడా ఆటంకం కలుగుతుంది. స్ట్రోక్, హార్ట్ ఎటాక్ వంటి సమస్యలకు ఇదే ప్రధాన కారణమవుతుంది. అయితే ప్రస్తుతం పరిశోధకులు తీసుకొస్తున్న ఇంజెక్షన్‌ సహాయంతో ఈ చెడు కొలెస్ట్రాల్‌ స్థాయిలను గణనీయంగా తగ్గించవచ్చని చెబుతున్నారు.

నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్ రక్తప్రవాహంలో డెసిలీటర్‌కు 100 ఎంజి కంటే ఎక్కువగా ఉన్నప్పుడు ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపుతుందని చెబుతున్నారు. ఈ కొలెస్ట్రాల్‌ స్థాయి పెరిగినప్పడు శరీరంలో ఎలాంటి లక్షణాలు కనిపించని కారణంగా త్వరగా గుర్తించడం కష్టంతో కూడుకున్న పని. ముంబయికి చెందిన ఓ ఆసుపత్రిలో ఇన్‌క్లిసిరాన్‌ పేరుతో ఈ కొత్త ఇంజక్షన్‌పై క్లినికల్‌ ట్రయల్స్‌ను నిర్వహిస్తున్నారు. ఇన్‌క్లిసిరాన్‌ శరీరం నుంచి కొలెస్ట్రాల్‌ను వేగంగా తగ్గిస్తుందని పరిశోధకులు చెబుతున్నారు.

రెండేళ్ల క్రితం అమెరియాతో పాటు యూకేలో ఆమోదించిన ఈ ఔషధం Sybrava బ్రాండ్ పేరుతో డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా లేదా DGCI నుండి ఆమోదం పొందిన తర్వాత భారత్‌లోకి అందుబాటులోకి రానుంది. ఈ ఇంజక్షన్‌ ఖరీదు సుమారు రూ. 1.2 లక్షలు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఈ ఇంజక్షన్‌ కొలెస్ట్రాల్ ఉత్పత్తిని సమర్థవంతంగా నిలిపివేస్తుంది. ఇతర దేశాల్లో నిర్వహించిన ట్రయల్స్‌లో రోగుల్లో కొలెస్ట్రాల్‌ను 50 శాతం తగ్గించినట్లు గుర్తించారు.

మరిన్ని హెల్త్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..

గ్రామాల్లో కొత్తగా 70 అన్న క్యాంటీన్లు.. ప్రారంభానికి డేట్ ఫిక్స్
గ్రామాల్లో కొత్తగా 70 అన్న క్యాంటీన్లు.. ప్రారంభానికి డేట్ ఫిక్స్
బయటికొస్తే బంతాటే.. సెలబ్రిటీస్‌కు ఈ తిప్పలేంటి
బయటికొస్తే బంతాటే.. సెలబ్రిటీస్‌కు ఈ తిప్పలేంటి
మెట్రో నగరాలకు పోటీగా బెజవాడ.. ఆన్‌లైన్‌ షాపింగ్‌లో సరికొత్త రికా
మెట్రో నగరాలకు పోటీగా బెజవాడ.. ఆన్‌లైన్‌ షాపింగ్‌లో సరికొత్త రికా
అన్ని రోగాలను హరించే నల్ల వెల్లుల్లి.. ఆరోగ్యానికి మంత్రంలా మారి
అన్ని రోగాలను హరించే నల్ల వెల్లుల్లి.. ఆరోగ్యానికి మంత్రంలా మారి
రౌడీ జనార్ధన టీజర్..ఇదెక్కడి మేకోవర్ సామీ
రౌడీ జనార్ధన టీజర్..ఇదెక్కడి మేకోవర్ సామీ
ఆరోగ్య సిరి.. ఉసిరి తినే ముందు ఈ 6 విషయాలు గుర్తించుకోండి! లేదంటే
ఆరోగ్య సిరి.. ఉసిరి తినే ముందు ఈ 6 విషయాలు గుర్తించుకోండి! లేదంటే
OG సీక్వెల్ నుంచి ఆయన అవుట్.. సూపర్ ట్విస్ట్
OG సీక్వెల్ నుంచి ఆయన అవుట్.. సూపర్ ట్విస్ట్
స్మైల్‌తో కట్టిపడేస్తున్న బ్యూటీ.. ఆషికా అందానికి ఫిదా అవ్వాల్సిం
స్మైల్‌తో కట్టిపడేస్తున్న బ్యూటీ.. ఆషికా అందానికి ఫిదా అవ్వాల్సిం
ప్రేమే జీవితం.. ప్రియుడే సర్వం అనుకుంది.. చివరకు
ప్రేమే జీవితం.. ప్రియుడే సర్వం అనుకుంది.. చివరకు
ఏ హీరో ఎక్కడున్నారు..? ఎవరి సినిమా షూటింగ్ ఎక్కడ జరుగుతోంది
ఏ హీరో ఎక్కడున్నారు..? ఎవరి సినిమా షూటింగ్ ఎక్కడ జరుగుతోంది