Omicron – Immunity Boost: ముంచుకొస్తున్న ఒమిక్రాన్ ముప్పు.. ఇలా ఇమ్యూనిటీని పెంచుకోండి..
Omicron - Immunity Boost: దేశవ్యాప్తంగా ఓమిక్రాన్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ ఓమిక్రాన్ బారిన పడకుండా ఉండాలంటే టీకా తీసుకోవడం, రోగ నిరోధక వ్యవస్థను..

Omicron – Immunity Boost: దేశవ్యాప్తంగా ఓమిక్రాన్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ ఓమిక్రాన్ బారిన పడకుండా ఉండాలంటే టీకా తీసుకోవడం, రోగ నిరోధక వ్యవస్థను పదిలంగా ఉంచుకోవడం చాలా కీలకం. శరీర రోగ నిరోధక వ్యవస్థ పటిష్టంగా ఉంటే.. ఓమిక్రాన్ బారి నుంచి తప్పించుకోవచ్చు. రోగ నిరోధక వ్యవస్థ బలంగా ఉండాలంటే.. సరైన ఆహారం తినడం, వ్యాయామం చేయడం, చక్కని నిద్ర, జీవన శైలి అవసరం. మరి రోగ నిరోధక వ్యవస్థ పటిష్టంగా ఉండాలంటే ఏం చేయాలి, ఏం తినాలి వంటి వివరాలను ప్రముఖ ఆరోగ్య నిపుణులు ల్యూక్ కౌటిన్హో పలు చిట్కాలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. మరి ఆ చిట్కాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
విటమిన్ డి కీలకం.. రోగనిరోధక పనితీరు మెరుగ్గా ఉండాలంటే విటమిన్ డి చాలా కీలకం. శరీరంలో విటమిన్ డి స్థాయి ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. దానికి తగిన ఆహారం తీసుకోవాలి. ప్రతీ రోజూ కొంతసేపు సూర్యరశ్మి కోసం ఉదయాన్నే ఎండలో నిల్చుకోవాలి.
మంచిగా నిద్రోపోవాలి.. రోగ నిరోధక శక్తిని పెంపొందించడంలో నిద్ర చాలా కీలకం. కంటి నిండా నిద్ర పోవడం వల్ల రోజంతా శరీరానికి కావాల్సిన శక్తి లభిస్తుంది. ఆకలి స్థాయిలను స్థిరీకరిస్తుంది. నిద్ర లేమి సమస్య.. రోగ నిరోధక శక్తిని తగ్గిస్తుంది. ఇతర ఇన్‌ఫెక్షన్లు, వైరస్ బారిన పడే ఆస్కారాన్ని పెంచుతుంది. అందుకని కనీసం 7 గంటల పాటు తప్పనిసరిగా నిద్ర పోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
శారీరక వ్యాయామాలు.. చురుకుగా ఉండటం కోసం వ్యాయామం చేయాలి. భారీ వ్యాయామాలు కాకపోయినా.. మితంగా అయినా వ్యాయామాలు చేయాలి. ప్రతి రోజూ వ్యాయామం చేయడం వలన చురుకుగా ఉండటమే కాకుండా.. రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది.
విటమిన్లు ఉండే ఆహారం తీసుకోవాలి.. వెల్లుల్లి, అల్లం, గరం మసాలాలు, పసుపు, తేనె, తులసి, క్రూసిఫర్‌లు, ఉసిరి వంటి ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలు తినాలి. వీటిలో విటమిన్ సీ అధికంగా ఉంటుంది. అలాగే, జింక్, కాల్షియం ఉండే ఆహార పదార్థాలు కూడా తీసుకోవాలని సూచిస్తున్నారు.
శ్వాస సంబంధిత వ్యాయామాలు.. ప్రశాంతంగా, ఒత్తడి లేకుండా ఉండటం వలన రోగ నిరోధక శక్తి పెరిగుతుంది. అందుకే వీలైనంత వరకు ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించండి. ప్రశాంతంగా ఉండేందుకు ప్రాథమిక ప్రాణాయామ వ్యాయామాలు చేస్తుండాలని నిపుణులు సూచిస్తున్నారు. శ్వాస సంబంధిత వ్యాయామాలు కూడా చాలా మేలు చేస్తాయని చెబుతున్నారు.
Also read:
RBI Recruitment 2022: ఆర్‌బీఐలో స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాలు.. ఎప్పటి నుంచి దరఖాస్తు చేసుకోవచ్చంటే?
Realme GT 2 Pro: రియల్‌మీ తొలి ఫ్లాగ్‌షిప్ ఫోన్ విడుదలకు సిద్ధం.. ఫీచర్లివే!
Cyber Attack: రెచ్చిపోయిన సైబర్ నేరగాళ్లు.. 40 పైసలకు 6 లక్షలు అంటూ భారీ ఝలక్..