Summer Drinks:వేసవిలో కడుపు చల్లగా ఉండాలంటే ఈ 3 జ్యూస్‌లు తాగాల్సిందే..!
Summer Drinks:వేసవిలో శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని రకాల జ్యూస్‌లు తాగాలి. ఇంట్లో ఉండే కూల్‌డ్రింక్స్, లేదా ప్యాక్ చేసిన జ్యూస్‌లు తాగే బదులు తాజా పండ్ల రసాలను తాగితే ఆరోగ్యానికి మంచిది.
Summer Drinks:వేసవిలో శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని రకాల జ్యూస్‌లు తాగాలి. ఇంట్లో ఉండే కూల్‌డ్రింక్స్, లేదా ప్యాక్ చేసిన జ్యూస్‌లు తాగే బదులు తాజా పండ్ల రసాలను తాగితే ఆరోగ్యానికి మంచిది. ఫ్రెష్ జ్యూస్ తాగితే మంచి రుచిని ఆస్వాదిస్తారు. అయితే వేసవిలో కడుపుని చల్లగా ఉంచే పండ్లు చాలా ఉన్నాయి. వీటి నుంచి జ్యూస్‌ని సులభంగా తయారుచేయవచ్చు. ఈ జ్యూస్‌లు పొట్టని ఆరోగ్యంగా ఉంచుతాయి. శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచే అటువంటి 3 జ్యూస్‌ల గురించి తెలుసుకుందాం.
నిమ్మరసం
ఎండాకాలం నిమ్మరసం శరీరానికి చాలా మంచిది. దీనిని తయారుచేయడం చాలా సులభం. అంతేకాదు తాగడానికి చాలా రుచిగా ఉంటుంది. దీని కోసం నిమ్మకాయ, పంచదార, బ్లాక్ సాల్ట్ బాగా మిక్స్ చేయాలి. అలాగే ఈ మిశ్రమంలో కొన్ని సోడా నీటిని కలపాలి. అప్పుడు చాలా రుచిగా తయారవుతుంది. అలాగే కొన్ని పుదీనా ఆకులను కూడా జోడించవచ్చు.
బేల్ రసం
బేల్ రసం కడుపుకి చాలా మంచిది. దీనిని ఆయుర్వేదంలో కూడా ఉపయోగిస్తారు. ఈ రసం చేయడానికి మిక్సర్ అవసరం లేదు. ఒక గిన్నెలో దాని గుజ్జును తీసి కొన్ని నీటిని కలపాలి. రుచి కోసం కొంచెం ఉప్పు, చాట్ మసాలా, చక్కెరను కలపవచ్చు. తరువాత దీనిని ఫిల్టర్ చేసి ఐస్ క్యూబ్స్ జోడించి సర్వ్ చేస్తే సూపర్.
పుచ్చకాయ రసం
పుచ్చకాయ రసం వేసవిలో అత్యంత రుచికరమైన, హైడ్రేటింగ్ పానీయం. దీన్ని తయారు చేయడం చాలా సులభం. తాగడానికి చాలా రుచిగా ఉంటుంది. దీన్ని చేయడానికి పుచ్చకాయ గింజలను తీసివేసి వాటిని మిక్సర్‌లో బాగా రుబ్బుకోవాలి. కొంత చక్కెర, నల్ల ఉప్పు కలపాలి. తరువాత ఫిల్టర్ చేసి ఐస్ క్యూబ్స్ వేసి సర్వ్ చేయాలి.
గమనిక :- అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించండి.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి