AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Milk Powder: ఉదయాన్నే పాలపొడితో తయారుచేసిన కాఫీ, టీలు తాగుతున్నారా.. అయితే మీరు ప్రమాదంలో పడినట్లే..!

Milk Powder: భారతదేశంలో చాలా మంది ఉదయాన్నే టీ లేదా కాఫీతో రోజుని ప్రారంభిస్తారు. చాలామంది ప్రజలు టీ, కాఫీల కోసం స్వచ్ఛమైన పాలని ఉపయోగిస్తారు. కానీ టీ, కాఫీ కోసం పాలపొడిని ఉపయోగించే కొంతమంది ఉన్నారు.

Milk Powder: ఉదయాన్నే పాలపొడితో తయారుచేసిన కాఫీ, టీలు తాగుతున్నారా.. అయితే మీరు ప్రమాదంలో పడినట్లే..!
Milk Powder Side Effects
uppula Raju
|

Updated on: Jun 01, 2022 | 6:44 AM

Share

Milk Powder: భారతదేశంలో చాలా మంది ఉదయాన్నే టీ లేదా కాఫీతో రోజుని ప్రారంభిస్తారు. చాలామంది ప్రజలు టీ, కాఫీల కోసం స్వచ్ఛమైన పాలని ఉపయోగిస్తారు. కానీ టీ, కాఫీ కోసం పాలపొడిని ఉపయోగించే కొంతమంది ఉన్నారు. వీరికి పాలపొడి వల్ల కలిగే నష్టాలేంటో తెలియదు. దీంతో సమస్యలు కొని తెచ్చుకుంటారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం పాలపొడి మీ బరువును పెంచడమే కాకుండా మీ గుండె ఆరోగ్యానికి ప్రమాదకరం. పాలపొడి దుష్ప్రభావాల గురించి తెలుసుకుందాం. వాస్తవానికి పచ్చి పాలలో దాదాపు 87.3% నీరు, 3.9% పాల కొవ్వు, 8.8% ప్రోటీన్ ఉంటుంది. కాని పాలపౌడర్‌ చేయడానికి ఇందులోని పచ్చి పాలని ఆవిరి చేస్తారు. ఇది మరింత చిక్కగా ఉంటుంది. దీనికి రసాయనాలు కలిపి ప్రాసెస్ చేస్తారు.

1. అధిక కొలెస్ట్రాల్

ఏ విధంగా చూసిన అధిక కొలెస్ట్రాల్ ఆరోగ్యానికి మంచిది కాదు. ఇది గుండెకు సంబంధించిన సమస్యలను కలిగిస్తుంది. ఇది మీ ధమనులలో నిల్వ ఉంటుంది. రక్త ప్రవాహాన్ని అడ్డుకుంటుంది.

ఇవి కూడా చదవండి

2. మధుమేహ రోగులకు పెద్ద ప్రమాదం

మధుమేహం సమస్య ఉన్నవారు పాలపొడి వాడకూడదు. వాస్తవానికి పాలపొడిలో ఇప్పటికే అధిక మొత్తంలో చక్కెర ఉంటుంది. ఈ సందర్భంలో ఇది మీ రక్తంలో చక్కెర స్థాయిని మరింత పెంచుతుంది.

3. డైట్‌లో ఉన్నవారు జాగ్రత్త

పాలపొడి అనేది అధిక కొలెస్ట్రాల్ ఉండే పదార్థం. అంటే ఇందులో మంచి కొవ్వు ఉండదు. అందుకే ఇది బరువును పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు.

4. పాలపొడిలో కాల్షియం ఉండదు

సాధారణ పాల కంటే పాలపొడిలో కాల్షియం తక్కువగా ఉంటుంది. మీరు పాలపొడిని సరిగ్గా నిల్వ చేయకపోతే అందులో బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. పాలలో కనిపించే విటమిన్ బి5, బి12 వంటి పోషకాలు ఉండవు. పాలపొడితో తయారుచేసిన పానీయాలు ఆరోగ్యానికి హానికరం.

గమనిక :- అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించండి.

మరిన్ని హెల్త్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
టీమిండియా సెమీఫైనల్‌ చేరడం పక్కా.. ఏ టీంను ఢీ కొట్టనుందో తెలుసా?
టీమిండియా సెమీఫైనల్‌ చేరడం పక్కా.. ఏ టీంను ఢీ కొట్టనుందో తెలుసా?
రోజుకు కేవలం రూ.150 ఆదా చేస్తే చేతికి రూ.26 లక్షలు..
రోజుకు కేవలం రూ.150 ఆదా చేస్తే చేతికి రూ.26 లక్షలు..
సింగర్ చిన్మయిపై నెటిజన్ దారుణమైన కామెంట్స్.. స్ట్రాంగ్ కౌంటర్
సింగర్ చిన్మయిపై నెటిజన్ దారుణమైన కామెంట్స్.. స్ట్రాంగ్ కౌంటర్
ఈ లడ్డూ రోజుకి ఒకటి తిన్నారంటే.. ఈ సమస్యలకు చూమంత్రం వేసినట్టే
ఈ లడ్డూ రోజుకి ఒకటి తిన్నారంటే.. ఈ సమస్యలకు చూమంత్రం వేసినట్టే
మీ పిల్లల కోసం ల్యాప్‌టాప్‌ కొంటున్నారా?
మీ పిల్లల కోసం ల్యాప్‌టాప్‌ కొంటున్నారా?
పాలు విరిగిపోకుండా చేసే సైంటిఫిక్ పద్ధతులు తెలుసా
పాలు విరిగిపోకుండా చేసే సైంటిఫిక్ పద్ధతులు తెలుసా
తెలంగాణ విద్యుత్‌ శాఖలో ఉద్యోగాలు.. రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేదు
తెలంగాణ విద్యుత్‌ శాఖలో ఉద్యోగాలు.. రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేదు
20 రోజులకే ఓటీటీలోకి తెలుగు హారర్ థ్రిల్లర్.. అధికారిక ప్రకటన
20 రోజులకే ఓటీటీలోకి తెలుగు హారర్ థ్రిల్లర్.. అధికారిక ప్రకటన
నాసా నుండి భారత్ వరకు ఎవరికీ అంతుచిక్కని రహస్యాలు!
నాసా నుండి భారత్ వరకు ఎవరికీ అంతుచిక్కని రహస్యాలు!
నోరూరించే ఉసిరికాయ కూర.. ఓసారి ఇలా ట్రై చేయండి.. టేస్ట్ అదుర్స్
నోరూరించే ఉసిరికాయ కూర.. ఓసారి ఇలా ట్రై చేయండి.. టేస్ట్ అదుర్స్