Women Health: స్మోకింగ్ చేసే మహిళలకి హెచ్చరిక.. అనర్థాలు తెలిస్తే మామూలుగా ఉండదు..!
Women Health:ఊపిరితిత్తుల క్యాన్సర్ అత్యంత సాధారణ క్యాన్సర్లలో ఒకటి. దీనివల్ల ఏటా చాలామంది మరణిస్తున్నారు. భారతదేశంలోని కొత్త క్యాన్సర్ కేసులలో
Women Health:ఊపిరితిత్తుల క్యాన్సర్ అత్యంత సాధారణ క్యాన్సర్లలో ఒకటి. దీనివల్ల ఏటా చాలామంది మరణిస్తున్నారు. భారతదేశంలోని కొత్త క్యాన్సర్ కేసులలో ఊపిరితిత్తుల క్యాన్సర్ 6.9 శాతంగా ఉంది. అయితే క్యాన్సర్ కారణంగా ప్రాణాలు కోల్పోతున్న పురుషులు, స్త్రీలు 9.3 శాతం మంది ఉన్నారు. ఊపిరితిత్తుల క్యాన్సర్‌కి ప్రధాన కారణం పొగాకు. దీనిని ఏ రూపంలో తీసుకున్న ఆరోగ్యానికి హాని చేస్తుంది. ఇక పట్టణాల్లో ధూమపానం చేసే మహిళల సంఖ్య నిరంతరం పెరుగుతోంది. దీంతో వారిలో ఊపిరితిత్తుల క్యాన్సర్ కేసులు కూడా పెరుగుతున్నాయి.
అలాగే పాసివ్ స్మోకింగ్ కారణంగా కూడా కొంతమంది క్యాన్సర్ బాధితులుగా మారుతున్నారు. అంతేకాకుండా కలుషిత వాతావరణం వల్ల కూడా క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయి. పాసివ్ స్మోకింగ్ విషయంలో చాలామందికి అవగాహన లేదు. ‘చాలా మంది మహిళలు పొగతాగినప్పుడే తమపై ప్రభావం పడుతుందని అనుకుంటారు. కానీ ఇది నిజం కాదు. ఇంట్లో ఒక వ్యక్తి ధూమపానం చేస్తే భార్య, పిల్లలు, వృద్ధులు ఊపిరితిత్తుల క్యాన్సర్‌కి గురయ్యే అవకాశాలు ఉంటాయి. ఇంట్లో పొగాకు తినేవారు ఉన్నన్ని రోజులు ఎవ్వరూ సురక్షితం కాదు.
అయితే దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ధూమపానం కారణంగా పురుషులలో ఊపిరితిత్తుల క్యాన్సర్ కేసులు తగ్గాయి. అయితే చాలా ప్రాంతాల్లో మాత్రం పెరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో మహిళల్లో పోషకాహార లోపం పెద్ద సమస్య. ఇక్కడ మహిళలు 14-15 సంవత్సరాల వయస్సు నుంచే పొగాకు తినడం ప్రారంభిస్తారు. ఈ ప్రాంతాల్లో ఊపిరితిత్తుల క్యాన్సర్ కేసులు తక్కువగా ఉండవచ్చు. కానీ నోటి క్యాన్సర్ కేసులు ఎక్కువగా ఉంటాయి.
ధూమపానం వల్ల అనేక ఇతర వ్యాధులు సోకుతాయి. కేవలం ఊపిరితిత్తుల క్యాన్సర్ మాత్రమే కాకుండా శరీరం మొత్తం ప్రభావితమవుతుంది. జుట్టు నుంచి కాలి వరకు ప్రతి భాగం ప్రభావితమవుతుంది. వంధ్యత్వం, హృదయ సంబంధ సమస్యలు, బోలు ఎముకల వ్యాధి ధూమపానం చేసే మహిళల్లో కనిపిస్తాయి. ధూమాపానం వల్ల గర్భాశయ, రొమ్ము, నోటి క్యాన్సర్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఒక మహిళ గత 10 సంవత్సరాలలో ఎప్పుడైనా ధూమపానం చేస్తే ఆమె ప్రమాదంలో ఉన్నట్లే. అలాంటి వారు వెంటనే ఊపిరితిత్తుల క్యాన్సర్‌ని గుర్తించే పరీక్ష చేయించుకోవాలి.
గమనిక :- అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించండి.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి