Oral Cancer:ఈ లక్షణాలు కనిపిస్తే నోటి క్యాన్సర్.. పరిశుభ్రత పాటించకపోతే అంతే సంగతులు..!
Oral Cancer:ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ కేసులు ఏటా పెరుగుతున్నాయి. ధూమపానం క్యాన్సర్‌కు ప్రధాన కారణం అవుతుంది. గుట్కా, పాన్ మసాలా, ఖైనీ తినడం వల్ల నోటి క్యాన్సర్ వస్తుందని వైద్యులు చెబుతున్నారు.
Oral Cancer:ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ కేసులు ఏటా పెరుగుతున్నాయి. ధూమపానం క్యాన్సర్‌కు ప్రధాన కారణం అవుతుంది. గుట్కా, పాన్ మసాలా, ఖైనీ తినడం వల్ల నోటి క్యాన్సర్ వస్తుందని వైద్యులు చెబుతున్నారు. పురుషుల్లో ఇది ఎక్కువగా ఉంది. ఈ రకం క్యాన్సర్ సాధారణంగా బుగ్గలు, నాలుక, చిగుళ్ళలో వస్తుంది. ఒక్కోసారి తల, మెడకి కూడా సోకుతుంది. పొగాకు వల్ల వచ్చే నోటి క్యాన్సర్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం లక్షలాది మంది మరణిస్తున్నారు. కానీ సరైన సమయంలో లక్షణాలను గుర్తించి పొగతాగడం మానేస్తే ఈ క్యాన్సర్‌ను నివారించవచ్చు. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా నోటి క్యాన్సర్ గురించి తెలుసుకుందాం.
నోటి పరిశుభ్రతపై శ్రద్ధ వహించడం ముఖ్యం
వైద్యుల ప్రకారం పొగాకు ఏ రూపంలో ఉన్నా ఆరోగ్యానికి హానికరం. అయితే ఈ నిజం తెలిసిన తర్వాత కూడా చాలా మంది యువత పొగాకుని మానలేకపోతున్నారు. అనవసరంగా క్యాన్సర్ బారిన పడుతున్నారు. అలాగే నోటి పరిశుభ్రత గురించి జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల కూడా వస్తుంది. కాబట్టి ఈ క్యాన్సర్‌ను నిరోధించేందుకు అవగాహన పెంచుకోవడం చాలా అవసరం. ధూమపానం లేదా పొగాకు మానడం ద్వారా నోటి క్యాన్సర్‌ను చాలా వరకు నివారించవచ్చు. ఇది కాకుండా దంతాలను క్రమం తప్పకుండా శుభ్రపరచడం చాలా ముఖ్యం.
పొగాకు వినియోగం వల్ల ఏటా 8 మిలియన్ల మరణాలు సంభవిస్తున్నాయి. బీడీలు చేసే మహిళలు కూడా ఈ రకమైన క్యాన్సర్‌కు గురయ్యే అవకాశం ఉంది. 16 ఏళ్ల తర్వాత ప్రతి ఒక్కరూ కనీసం నెలకు ఒకసారి నోటిని పరీక్షించుకోవాలి. నోటిలో బొబ్బలు, తెల్లమచ్చలు, దవడల నుంచి రక్తం వస్తుంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి. ఇవి నోటిలో క్యాన్సర్ లక్షణాలు కావొచ్చు. అందుకే జాగ్రత్తగా ఉండాలి.
గమనిక :- అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించండి.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి