World No Tobacco Day 2022: మీరు స్మోకింగ్ చేస్తారా.. అయితే మీ కళ్లు ప్రమాదంలో ఉన్నట్లే..!
World No Tobacco Day 2022: ప్రపంచవ్యాప్తంగా మరణాల రేటు పెరగడానికి ధూమపానం అతిపెద్ద కారణం. పొగాకు ప్రతి సంవత్సరం 8 మిలియన్లకు పైగా మరణాలకు కారణమవుతుంది.
World No Tobacco Day 2022: ప్రపంచవ్యాప్తంగా మరణాల రేటు పెరగడానికి ధూమపానం అతిపెద్ద కారణం. పొగాకు ప్రతి సంవత్సరం 8 మిలియన్లకు పైగా మరణాలకు కారణమవుతుంది. ధూమపానం శ్వాసకోశ వ్యాధులు, గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధులకు దారి తీస్తుంది. స్మోకింగ్ వల్ల కళ్లకు చాలా నష్టం జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. సిగరెట్ పొగ శరీరంలోకి ప్రమాదకరమైన కణాలను విడుదల చేస్తుంది. ఈ కణాలు రక్త ప్రసరణ ద్వారా శరీరం అంతటా వ్యాపిస్తాయి. ధూమపానం వల్ల కంటిశుక్లం, గ్లాకోమా, రెటినోపతి వంటి తీవ్రమైన కంటి వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. పొగతాగే వ్యక్తులు ఈ విషయాన్ని తెలుసుకోవడం చాలా ముఖ్యం.
కంటిశుక్లం
కంటిశుక్లం కారణంగా చూపు కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కంటి లెన్స్ మబ్బుగా మారినప్పుడు ఈ వ్యాధి వస్తుంది. దీని కారణంగా చూపు తగ్గడం ప్రారంభమవుతుంది. ధూమపానం వల్ల కళ్లలోని ప్రొటీన్లు, లిపిడ్లు దెబ్బతినడంతో పాటు కంటిశుక్లం వచ్చే అవకాశం ఉంటుంది.
మధుమేహం
ధూమపానం మధుమేహం ప్రమాదాన్ని 40% వరకు పెంచుతోంది. ఇది డయాబెటిక్ రెటినోపతికి దారితీస్తుంది. ఈ వ్యాధిలో రక్త నాళాలు దెబ్బతినడం ప్రారంభిస్తాయి. దీని కారణంగా ద్రవం, రక్తం కళ్ళలోకి రావడం ప్రారంభమవుతుంది. దీనివల్ల చూపు తగ్గిపోతుంది.
పొడి కళ్ళు
ధూమపానం వల్ల కళ్లు పొడిగా మారుతాయి. ఇది అనేక సమస్యలకు దారితీస్తుంది. ధూమపానం మానేయడం వల్ల కళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి. అలాగే సూర్యుని కిరణాల నుంచి కళ్లను రక్షించుకోండి. బయటకు వెళ్లేటప్పుడు సన్ గ్లాసెస్ ధరించండి. కళ్లను ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. మధుమేహం, బీరీ, కొలెస్ట్రాల్‌లను అదుపులో ఉంచుకుంటే మంచిది.
గమనిక :- అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించండి.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి