Saunf And Ajwain Tea: ఆరోగ్యానికి అమృతం వాము, జీలకర్ర హెర్బల్ టీ.. ఇక మందుల అవసరమే ఉండదు..
మన పోపుల పెట్టెలో కనిపించే తరచూ వాడే జీలకర్ర, వాము వంటి పదార్థాలు ఆయుర్వేదంలో ఎంతో ప్రాముఖ్యత ఉన్న ఔషధాలుగా చెప్పవచ్చు.

మన పోపుల పెట్టెలో కనిపించే తరచూ వాడే జీలకర్ర, వాము వంటి పదార్థాలు ఆయుర్వేదంలో ఎంతో ప్రాముఖ్యత ఉన్న ఔషధాలుగా చెప్పవచ్చు. ముఖ్యంగా ఉదర సంబంధిత వ్యాధుల నివారణకు ఈ రెండు అద్భుతంగా పనిచేస్తాయి. ఉదయాన్నే పరగడుపునే జీలకర్ర వాము నీటిలో మరిగించి హెర్బల్ టీ చేసుకొని తాగితే ఒకటి కాదు రెండు కాదు అనేక వ్యాధుల నుంచి మన శరీరాన్ని కాపాడుతాయి. అంతే కాదు మన శరీరంలో పేరుకుపోయిన టాక్సీన్లను తొలగించడంతోపాటు శరీరాన్ని డిటాక్సిఫై చేయడంలో జీలకర్ర వాము అద్భుతంగా పనిచేస్తాయి. అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆయుర్వేదంలో వామును సంజీవనిగా పోలుస్తూ ఉంటారు. వాము మీ ఉదర సంబంధిత వ్యాధులకు రామబాణం అనే చెప్పాలి. ఇక జీలకర్ర సర్వరోగ నివారిణి, జీలకర్రలో ఔషధ గుణాలు మీ శరీరాన్ని అనేక వ్యాధుల నుంచి కాపాడటంలో ముందుంటాయనే చెప్పవచ్చు.
చర్మ వ్యాధుల నివారణలో:
జీలకర్ర, వాము చర్మానికి చాలా మేలు చేస్తాయి. ఈ హెర్బల్ టీ తా గడం వల్ల చర్మం మెరుస్తుంది. జీలకర్ర, వాము వాటర్ మన చర్మాన్ని నిర్విషీకరణ చేస్తుంది.మొటిమలు లేకుండా , మచ్చలు లేకుండా చేస్తుంది.




దగ్గు, జలుబు నివారణలో;
జలుబు , ఫ్లూ వంటి కాలానుగుణ జ్వరాలను వదిలించుకోవడానికి జీలకర్ర, వాము నీరు ప్రభావవంతంగా ఉంటాయి. ఈ నీటిని తాగడం వల్ల గొంతు నొప్పి, దగ్గు వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది:
జీలకర్ర, వాము నీరు కూడా కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలో చాలా ప్రభావవంతంగా ఉంటాయి. ఈ నీటిలో చాలా తక్కువ మొత్తంలో కేలరీలు ఉంటాయి, ఇది పెరుగుతున్న బరువును తగ్గించడానికి ఉపయోగకరంగా ఉంటుంది.
పొట్ట సమస్య నుంచి విముక్తి లభిస్తుంది:
జీలకర్ర, వాము వాటర్ మీ జీర్ణవ్యవస్థను బలపరుస్తుంది. దీంతో పాటు గ్యాస్, అజీర్ణం, మలబద్ధకం వంటి అనేక రకాల సమస్యలు కూడా ఈ నీటిని తాగడం వల్ల దూరమవుతాయి.
మార్నింగ్ సిక్‌నెస్‌లో ఇది ఉపయోగకరంగా ఉంటుంది:
వాంతులు, వికారం లేదా భయము , వికారం వంటి మార్నింగ్ సిక్‌నెస్ వంటి సమస్యలు జీలకర్ర, వాము హెర్బల్ టీని తాగడం వల్ల మార్నింగ్ సిక్ నెస్ సమస్యలు దూరమవుతాయి. అలాగే మీరు తాజాదనాన్ని అనుభవిస్తారు.
జీలకర్ర, వాము పొడిని తయారు చేసి. ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో వేడి నీటిలో కాసేపు మరిగించి ఆ నీటిని తాగండి. తద్వారా పైన పేర్కొన్నటువంటి అన్ని వ్యాధులకు చాలా ప్రభావంతంగా పనిచేస్తున్న నే చెప్పవచ్చు. అయితే గర్భిణీ స్త్రీలు మాత్రం వాము నీరు తాగేటప్పుడు సమయంలో జాగ్రత్తగా ఉండాలని చెప్పవచ్చు. గర్భిణీలు డాక్టర్ సలహా మేరకు మాత్రమే ఈ హెర్బల్టిని తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే చిన్నపిల్లలు సైతం ఈ హెర్బల్ టీకి దూరంగా ఉంటే మంచిది. పేగు పూత వ్యాధితో బాధపడేవారు కూడా ఈ హెర్బల్ టీని డాక్టర్ సూచన మేరకే తీసుకోవాల్సి ఉంటుంది.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని హెల్త్ న్యూస్ కోసం



