Diabetes: ఈ ఐదు అలవాట్లు మానుకుంటే మీకు డయాబెటిస్ రమ్మన్నా రాదు.. అవేంటంటే..

మన భారతదేశం డయాబెటిస్ వ్యాధికి రాజధానిగా మారబోతోంది. ప్రపంచంలో ఐదింట రెండు వంతుల జనాభా డయాబెటిస్ పేషెంట్లు భారతదేశంలోనే ఉన్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

Diabetes: ఈ ఐదు అలవాట్లు మానుకుంటే మీకు డయాబెటిస్ రమ్మన్నా రాదు.. అవేంటంటే..
Diabetes
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: May 25, 2023 | 8:15 AM

మన భారతదేశం డయాబెటిస్ వ్యాధికి రాజధానిగా మారబోతోంది. ప్రపంచంలో ఐదింట రెండు వంతుల జనాభా డయాబెటిస్ పేషెంట్లు భారతదేశంలోనే ఉన్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. డయాబెటిస్ అనేది ఒక దీర్ఘకాలిక వ్యాధి. డయాబెటిస్ కు ప్రత్యేకంగా నివారణ లేదా మందులు అనేవి ఏమీ లేవు డయాబెటిస్ ను కంట్రోల్లో ఉంచుకోవడమే అతిపెద్ద సమస్య. మందులు వాడుతూ లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటేనే డయాబెటిస్తో మనం పోరాడగలం.

డయాబెటిస్ వ్యాధి దీర్ఘకాలం కంట్రోల్లో లేకపోతే గుండెపోటు కిడ్నీ ఫెయిల్యూర్ లివర్ ఫెయిల్యూర్ కంటి చూపు మందగించటం వంటి జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది. వీటన్నిటి నుంచి మీ శరీరాన్ని కాపాడుకోవాలంటే డయాబెటిస్ ను కంట్రోల్లో ఉంచుకోవాలి రక్తంలో షుగర్ విలువను ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకుంటూ కంట్రోల్ చేసుకోవాలి. అయితే కొన్ని అలవాట్లు కూడా డయాబెటిస్ ను పెంచేందుకు దోహదం చేస్తూ ఉంటాయి అలాంటి ఐదు రకాల అలవాట్లను గుర్తించి వాటిని మానుకుంటే చాలా మంచిది అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

రోజూ పెరుగు తినడం:

ఇవి కూడా చదవండి

పెరుగు ఆరోగ్యకరమైన ప్రోబయోటిక్ ఆహారంగా పరిగణిస్తారు. ప్రజలు దానిని వారి రోజువారీ ఆహారంలో చేర్చుకోవడానికి ప్రయత్నిస్తారు. కానీ నిజానికి ఆయుర్వేదం సైతం ప్రతిరోజూ పెరుగుని తినమని సిఫారసు చేయదు. రోజూ పెరుగు తినడం వల్ల బరువు పెరగడం, వాపు, జీవక్రియ బలహీనపడుతుందని డాక్టర్లు చెబుతున్నారు.

రాత్రి ఆలస్యంగా తినడం:

మనలో చాలా మంది రాత్రిపూట ఆలస్యంగా తినడం వల్ల చాలా రకాలు జబ్బుల్ని ఆహ్వానిస్తున్నారు. మన జీర్ణవ్యవస్థకు దాని పని చేయడానికి సరైన సమయం ఇవ్వడం లేదు. భారీ విందులు కాలేయంపై ఎక్కువ భారం పడతాయి. జీవక్రియను నెమ్మదింపజేస్తుంది, ఇది చివరికి పోషకాహార లోపం, ఇతర ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని డాక్టర్లు చెబుతున్నారు.

అతిగా తినడం:

మనకు ఆకలి లేకపోయినా, నిండుగా ఉన్నా ప్లేట్‌లో ఉన్నవాటిని పూర్తి చేయమని బలవంతం చేసే సందర్భాలు ఉన్నాయి. ఆకలి లేదా సామర్థ్యం కంటే ఎక్కువ తినడం ఊబకాయం, కొలెస్ట్రాల్ జీర్ణ సమస్యలకు దారితీస్తుందని నిపుణులు చెబుతున్నారు.

ఆకలి లేకుండా తినడం:

మీరు మీ శరీర సంకేతాలను పట్టించుకోకుండా తినడం అలవాటు చేసుకుంటే, మీరు ఇబ్బందుల్లో పడతారు. ప్రతి కొన్ని గంటలకొకసారి ఆహారం తీసుకోవడం వల్ల దీర్ఘకాలికంగా నష్టం జరగవచ్చు. ఆకలి లేకుండా తినడం లేదా ప్రతి గంట లేదా రెండు గంటలకు తినడం వల్ల ఇన్సులిన్ సెన్సిటివిటీ తగ్గి మధుమేహానికి దారితీస్తుందని డాక్టర్లు చెబుతున్నారు.

వీటితోపాటు అతిగా మద్యం సేవించడం ధూమపానం చేయడం, అదేపనిగా గంటలు గంటలు కూర్చోవడం వంటివి కూడా మధుమేహానికి దారితీస్తుంటాయి. మధుమేహాన్ని కంట్రోల్ చేసుకోవాలంటే మీ వయసు 35 సంవత్సరాలు దాటినప్పటి నుంచి రెగ్యులర్ గా షుగర్ చెక్ అప్ చేయించుకోవాలి. ఒకవేళ రక్తంలో షుగర్ కనిపించినట్లయితే డాక్టర్ సలహా మేరకు జీవనశైలిలో మార్పులు లేదా టాబ్లెట్, ఇన్సులిన్ తీసుకోవడం వంటివి చేస్తూ ఉండాలి.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ న్యూస్ కోసం