Dried Fish: ఈ సమస్య ఉన్నవారు ఎండు చేపలకు దూరంగా ఉండండి… లేదంటే కష్టమే
అధిక రక్తపోటు అనేది ప్రస్తుతం ప్రపంచాన్ని పీడిస్తున్న వ్యాధి. దీన్ని సైలెంట్ కిల్లర్ అంటారు. అధిక బీపీ అనేది హృదయ సంబంధ వ్యాధులకు దారితీస్తుంది.

మనకు క్వాలిటీ ఫుడ్ తినడం ఎంత ఇంపార్టెంటే.. కరోనా తర్వాత తెలిసివచ్చింది. ఇప్పుడు అందరూ ఫాట్ ఫుడ్ వదిలేసి.. ప్రొటీన్ ఫుడ్ వైపు పరుగులు తీస్తున్నారు. అనారోగ్య కారకం అని తెలిస్తే.. ఎంత ఇష్టమైనా సరే.. ఆ ఫుడ్‌ను అవౌడ్ చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో చిన్న వయస్సులోనే షుగర్లు, బీపీలు, హార్ట్ అటాక్స్ గురించి వింటున్నాం. జాగ్రత్తలు తీసుకోకపోతే.. ఇబ్బందులు తప్పవ్. ఈ క్రమంలోనే ఎండు చేపల గురించి మీరు తెలుసుకోవాలి. చాలా మంది ఇష్టంగా డ్రై ఫిష్ తింటారు. రకరకాల కూరల్లో మిక్స్ చేసి.. డైలీ తినేవారు సైతం ఉన్నారు. సముద్ర తీర ప్రాంతాలకు దగ్గరగా ఉంటున్నవారు ఎండు చేపలు ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. ఎండు చేపలో కొవ్వు ఆమ్లాలు , విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి నిజమే. కానీ ఒక వ్యాధి ఉన్న బాధితులు మాత్రం ఎండు చేపల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.
అధిక రక్తపోటు ఉన్నవారికి ఎండు చేపలు అనర్థం
అధిక రక్తపోటు అన్నది మిలియన్ల మంది జనాల్ని పీడిస్తున్న వ్యాధి. దీన్ని హైపర్ టెన్షన్ అని కూడా అంటారు. డ్రై ఫిష్ ఎక్కువగా తినడం వల్ల మనిషి శరీరంలో రక్తపోటు పెరిగి.. గుండె సంబంధిత సమస్యలు వస్తాయని పలు పరిశోధనల్లో తేలింది. అధిక రక్తపోటు ఉన్నవారు ఎండు చేపలకు తినకపోవడమే మంచిదని డైటీషియన్లు సూచిస్తున్నారు. ఎండు చేపలు శరీరంలో ఉప్పు శాతాన్ని పెంచుతాయి. బాడీలో ఉప్పు ఎక్కువగా చేరినప్పుడు, రక్తం రక్తనాళాలను అధిక ఒత్తిడికి గురిచేస్తుంది. దీనివల్ల బీపీ పెరుగుతుంది. శరీరంలోని హార్మోన్లు, ఇన్‌ఫ్లమేటరీ, ఇమ్యునోలాజికల్, జీర్ణవ్యవస్థలను ఎఫెక్ట్ చేసే గుణాలు ఉప్పులో ఉంటాయి. డ్రై ఫిష్ ద్వారా శరీరంలో ఉప్పు శాతం పెరుగుతుంది కాబట్టి.. రక్తపోటు ఉన్నవారు దాన్ని అవౌడ్ చేయడం బెటర్. శరీరంలో ఉప్పు శాతం పెరిగితే మెదడు ఆరోగ్యంపై కూడా ప్రభావం ఉంటుంది.
మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
నోట్.. ఈ కథనంలో పేర్కొన్న విషయాలు కేవలం అవగాన కోసం మాత్రమే. వీటని పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోవడం ఉత్తమం.




