Neem Health: ఫంగల్ ఇన్ఫెక్షన్లకు వేప ఆకులు దివ్యౌషధం.. ఇలా చేస్తే ఎలాంటి సమస్య అయినా పారా హుషార్..

వాతావరణంలో ఉన్న అనేక వ్యాధికారక కారకాలలో శిలీంధ్రాలు తక్కువ హాని కలిగిస్తాయి. అయితే.. వీటిని ఆహారంగానూ ఉపయోగించడం విశేషం. పుట్టగొడుగులతో చేసిన స్నాక్స్, బేకర్ ఈస్ట్‌తో తయారు...

Neem Health: ఫంగల్ ఇన్ఫెక్షన్లకు వేప ఆకులు దివ్యౌషధం.. ఇలా చేస్తే ఎలాంటి సమస్య అయినా పారా హుషార్..
Neem Leaves
Follow us

|

Updated on: Jan 07, 2023 | 8:02 PM

వాతావరణంలో ఉన్న అనేక వ్యాధికారక కారకాలలో శిలీంధ్రాలు తక్కువ హాని కలిగిస్తాయి. అయితే.. వీటిని ఆహారంగానూ ఉపయోగించడం విశేషం. పుట్టగొడుగులతో చేసిన స్నాక్స్, బేకర్ ఈస్ట్‌తో తయారు చేసిన బేకరీ పదార్థాలను మనం ఉపయోగిస్తూనే ఉన్నాం. అయినప్పటికీ.. హానికరమైన శిలీంధ్రాలు 300 కంటే ఎక్కువ జాతులు ఉన్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఫంగల్ ఇన్ఫెక్షన్లు అంటువ్యాధి మాత్రమే కాదు.. కొన్ని సందర్భాల్లో ప్రాణాపాయంగా మారతాయి. పెరుగుతున్న కలుషిత వాతావరణం, భూగోళ ఉష్ణోగ్రతలు శిలీంధ్రాల జీవనాన్ని, వాటి ద్వారా కలిగే వ్యాధులు తీవ్రత అధికంగా ఉండేలా చేస్తున్నాయి. శిలీంధ్రాలు సాధారణంగా తడి ప్రదేశాలలో ఉంటాయి. ఇవి ఊబకాయం, మధుమేహం, ఆరోగ్య పరిశుభ్రత లేని వారికి అధిక నష్టం కలిగిస్తాయి.

వేప, తులసి, పసుపు, దాల్చినచెక్క, యూకలిప్టస్, సోంపు వంటి అనేక మూలికలు, సుగంధ ద్రవ్యాలు వేలాది సంవత్సరాలుగా ఫంగల్ ఇన్ఫెక్షన్లను అరికట్టడంలో ఉపయోగపడుతున్నాయి. ఫంగల్ ఇన్ఫెక్షన్లను పూర్తిగా నివారించే విషయాలను భారతీయ ఆయుర్వేదంలో పొందుపరిచారు. మారిపోతున్న ఆహారపు అలవాట్లు, అపరిశుభ్రమైన జీవన శైలి , పని-ఒత్తిడి, మానసిక సమస్యలు వంటివి ఫంగల్ ఇన్‌ఫెక్షన్‌లకు ప్రధాన కారణాలు. ఈ ఇన్‌ఫెక్షన్‌లను నివారించడంలో కలబంద మంచి ప్రయోజనాన్ని ఇస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఫంగల్ ఇన్ఫెక్షన్లను నివారిస్తాయి.

కలబందతో పాటు వేప ఆకులు చాలా ప్రభావవంతంగా పని చేస్తాయి. వేపలో రెండు ప్రధాన ఔషధాల సమ్మేళనాలు ఉన్నాయి. నింబియోడోల్, గెడునిన్. ఫంగస్‌ను అంతమొందించడంలో ఇవి చాలా ఉపయోగపడతాయి. ఇన్‌ఫెక్షన్‌ సోకిన ప్రాంతాన్ని వేప నీటితో కడగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. వేప ఆకులను ఎండబెట్టి చూర్ణం చేసి పౌడర్ తయారు చేసుకోవాలి. వేపపొడిలో గంధపు పొడి వేసి రోజ్ వాటర్ తో పేస్ట్ చేయాలి. ఈ పేస్ట్ ఫంగల్ ఇన్ఫెక్షన్‌ను చంపడంలో సహాయపడుతుంది.

ఇవి కూడా చదవండి

నోట్.. ఈ కథనంలో పేర్కొన్న విషయాలు కేవలం అవగాన కోసం మాత్రమే. వీటని పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోవడం ఉత్తమం.