Parenting Tips: వేసవి ఎండలు ప్రారంభమయ్యాయి.. పిల్లల విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే ఎదురయ్యే సమస్యలివే..

సవి ఎండల ఉష్ట్రోగ్రతలు అధికంగా ఉండడం వల్ల అవి మీ పిల్లల ఆరోగ్యాన్ని దెబ్బతీయడమే కాక చర్మ సమస్యలను కలిగిస్తాయి. ఎలా అంటే గాలిలో..

Parenting Tips: వేసవి ఎండలు ప్రారంభమయ్యాయి.. పిల్లల విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే ఎదురయ్యే సమస్యలివే..
ఏ తల్లిదండ్రులు అయినా తమ పిల్లలను అల్లారు ముద్దుగా, ఆరోగ్యంగా పెరగాలని కోరుకుంటారు. ఈ క్రమంలో వారి ఆహారంపై కూడా ప్రత్యేక శ్రద్ద చూపిస్తుంటారు. కానీ చాలా మంది తల్లిదండ్రులు తెలిసీ తెలియక పిల్లల విషయంలో కొన్ని తప్పులు చేస్తుంటారు. ఆ తప్పులే మీ పిల్లల భవిష్యత్ జీవితంపై తీవ్ర ప్రభావం చూపుతాయి.
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Mar 08, 2023 | 4:17 PM

వేసవి వచ్చిందంటే చాలు.. పిల్లల విషయంలో అనేక జాగ్రత్తలు పాటించాలి. వేసవి ప్రారంభమయ్యే ముందు స్కూళ్లకు హాఫ్ డేస్ ప్రారంభమవుతాయి. దీంతో పిల్లలు ఉన్న చోట ఉండకుండా మండుటెండలో పడి బయట తిరుగుతుంటారు. వేసవి సెలవులను ఆనందిస్తూ ఆడుకునే వారికి తెలియకపోవచ్చు.. ఈ ఎండలలో తిరిగితే శాపంగా మారగలవని. వేసవి ఎండల ఉష్ట్రోగ్రతలు అధికంగా ఉండడం వల్ల అవి మీ పిల్లల ఆరోగ్యాన్ని దెబ్బతీయడమే కాక చర్మ సమస్యలను కలిగిస్తాయి. ఎలా అంటే గాలిలో ఉండే కాలుష్య కారకాలు, సూర్యుడి నుంచి వచ్చే కఠినమైన UV కిరణాలు, వేడివలన కలిగే చెమట మొదలైన కారణాల వలన పిల్లలకు అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి ఈ ఎండాకాలంలో మీ పిల్లల ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

పిల్లల విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే కలిగే సమస్యలివే..

వేసవి ఫ్లూ: 5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు ఏడాది పొడవునా ఈ సమస్యలు తరచుగా వస్తాయి. కాబట్టి వారిని ఎండలో తిరగనీయకుండా ఉంచాలి. సాయంత్రం వేళ, లేదా ఉదయం పూట వాతావరణం చల్లగా ఉన్నప్పుడు ఆడుకోవడానికి అనుమతివ్వండి. వారికి సరైన పౌష్టికాహారం ఇవ్వడం ద్వారా రోగనిరోధక శక్తిని పెంచవచ్చు.

ఇవి కూడా చదవండి

కీటకాలు కాటు: ఎండాకాలంలో దోమలు చిరాకు పుట్టిస్తాయి. దోమలే కాకుండా ఇతర కీటకాల కాటుకు పిల్లలు గురయ్యే అవకాశం ఉంది. దీంతో ప్రభావిత ప్రాంతంలో దురద, వాపు కలుగుతుంది. వైద్యుల సూచన మేరకు పిల్లల కోసం ప్రత్యేకమైన దోమల నివారణ మందులను వాడేందుకు ప్రయత్నించండి.

జీర్ణకోశ సమస్యలు: కలుషిత ఆహారం తినడం లేదా కలుషిత పానీయాలు తాగడం ద్వారా అనేక రకాల జీర్ణకోశ సమస్యలు కలుగుతాయి. కడుపునొప్పి, గ్యాస్‌, ఎసిడిటీ వంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి. నాణ్యత, శుభ్రత లేని కలుషిత ఆహారం తీసుకుంటే, వాటిలోని హానికర వైరస్‌లు, ఇతర టాక్సిన్‌ల వలన పిల్లలకు ఫుడ్ పాయిజనింగ్ జరిగే అవకాశం ఉంటుంది.

డీహైడ్రేషన్: వేసవి ఎండలలో పడి బయట తిరిగే పిల్లలు నీరు తాగడాన్ని మరచిపోతారు. ఫలితంగా సులభంగా డీహైడ్రేషన్‌కు గురవుతారు. కాబట్టి రాబోయే వేసవిలో వారితో రోజుకు కనీసం 7,8 గ్లాసుల నీళ్లను తాగిపించండి. ఇంకా పుచ్చకాయలు తినిపించడం, పండ్ల రసాలు ఇవ్వడం, రీహైడ్రేషన్ డ్రింక్స్ అందిస్తూ ఉండడం కూడా మంచిది.

చర్మ సమస్యలు: వేడి, తేమతో కూడిన వాతావరణం వలన చెమట ఎక్కువ పడుతుంది. ఫలితంగా తామర, దురద వంటి ఎన్నో చర్మ సమస్యలు తలెత్తుతాయి. ఇంకా చర్మంపై చెమటకాయలు రావడం, చర్మం కమిలిపోవడం కూడా జరగవచ్చు. కాబట్టి పిల్లలకు ఎక్కువ చెమట పట్టినపుడు శుభ్రమైన గుడ్డతో తుడవడానికి ప్రయత్నించండి. తేలికపాటి కాటన్ దుస్తులు ధరింపజేయండి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..