Weight loss tips: తక్కువ కేలరీలు.. ఎక్కువ ఆరోగ్యం.. ఈ ఫుడ్స్‌తో ఈజీగా బరువుగా తగ్గొచ్చు..

సెంటర్‌ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకారం.. ఆహార విధానాలు, శారీరక శ్రమ, నిద్ర అలవాట్లు వంటి అనేక అంశాలు అధిక బరువు పెరగడానికి దోహదం చేస్తాయి. బాడీ మాస్ ఇండెక్స్ 30 కంటే ఎక్కువ ఉన్నట్లయితే, ఆ వ్యక్తిని ఊబకాయుడిగా పరిగణిస్తారు.

Weight loss tips: తక్కువ కేలరీలు.. ఎక్కువ ఆరోగ్యం.. ఈ ఫుడ్స్‌తో ఈజీగా బరువుగా తగ్గొచ్చు..
Weight Loss
Follow us

|

Updated on: Mar 09, 2023 | 11:16 AM

శారీరక శ్రమ తక్కువగా ఉంటు‍న్న నేటి ఆధునిక ప్రపంచంలో అధిక బరువు మనుష్యులను పట్టి పీడిస్తోంది. చిన్నా పెద్దా తేడా లేకుండా అందరినీ ఊబకాయం వేధిస్తోంది. జీవనశైలి కారణంగానే అనేక మంది ఊబకాయులుగా మారిపోతున్నారు. అనంతరం ఆ బరువును తగ్గించుకునేందుకు చాలా కష్టపడాల్సి వస్తోంది. ఆ డైట్లు, ఈ డైట్లు అంటూ డబ్బుతో పాటు మానసికంగా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. అందుకనే బరువు విషయంలో తగిన శ్రద్ధ తీసుకోవాలి. అలా అని కడుపు మాడ్చుకోవల్సిన అవసరం లేదు. బరువును అదుపులో ఉంచుకునేందుకు తగిన విధంగా ఆహారాన్ని ప్లాన్ చేసుకుంటే సరిపోతుంది. తినేటప్పుడు, తాగేటప్పుడు బరువు తగ్గడం గురించి ఒకసారి ఆలోచించాలి. అలాగే మనం తినే ఆహారాన్ని కూడా సక్రమంగా ఎంపిక చేసుకోవాలి. మీ శరీరంలోని క్యాలరీలను తగ్గించేందుకు సాయపడే కొన్ని ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలను మీకు పరిచయం చేస్తున్నాం. వీటిని మీ ఆహారంలో చేర్చుకుంటే మీ బరువును ఈజీగా తగ్గించుకోవచ్చు.

ఎవరిని ఊబకాయులు అంటారు..

సెంటర్‌ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకారం.. ఆహార విధానాలు, శారీరక శ్రమ, నిద్ర అలవాట్లు వంటి అనేక అంశాలు అధిక బరువు పెరగడానికి దోహదం చేస్తాయి. బాడీ మాస్ ఇండెక్స్ 30 కంటే ఎక్కువ ఉన్నట్లయితే, ఆ వ్యక్తిని ఊబకాయుడిగా పరిగణిస్తారు. అయితే అది 25 నుంచి 30 మధ్య ఉన్నా కూడా అధిక బరువుతో ఉంటారు.

ఈ ఫుడ్స్‌ ట్రై చేయండి..

ఓట్స్.. భూమిపై ఆరోగ్యకరమైన ఆహారాలలో ఓట్స్ ఒకటి. కేలరీలు తక్కువగా ఉండటంతో పాటు, ముఖ్యమైన విటమిన్లు, ఖనిజాలను కూడా కలిగి ఉంటాయి. ఓట్స్‌లోని అధిక స్థాయి ప్రొటీన్, ఫైబర్ ఆకలిని తగ్గించడానికి సాయపడతాయి.

ఇవి కూడా చదవండి

బెర్రీలు..  వీటిలో ఉండే ఫ్లేవనాయిడ్లు, విటమిన్లు, మినరల్స్, యాంటీఆక్సిడెంట్లు అధిక స్థాయిలో ఉండటం వల్ల మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీస్, రాస్ప్‌బెర్రీస్, బ్లాక్‌బెర్రీస్‌లలో అధిక ప్రోటీన్, ఫైబర్‌లను కలిగి ఉంటాయి. అలాగే  సి, కె, మాంగనీస్ వంటి విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. ఇందులో ఫైబర్ కూడా అధికంగా ఉంటుంది. ఇవి మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. మీరు బరువు తగ్గాలనుకుంటే బ్లూ బెర్రీస్, స్ట్రాబెర్రీస్, కోరిందకాయలతో సహాయపడతాయి. అరకప్పు బెర్రీలలో కేవలం 32కేలరీలు మాత్రమే ఉంటాయి. తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్, అధిక ప్రోటీన్ కంటెంట్ కారణంగా, వాటిని నెగెటివ్ కేలరీల ఆహారాలుగా సూచిస్తారు. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు అనేక ప్రాణాంతక వ్యాధుల నుండి మనలను రక్షించడంలో సహాయపడతాయి.

గుడ్లు.. సూపర్ ఫుడ్‌గా పరిగణించబడే ఆహారాలలో ఒకటి గుడ్డు. దీనిలో విటమిన్లు, ఖనిజాలు అధికంగా ఉంటాయి. శరీర బరువును నియంత్రిస్తాయి. ఉడికించిన గుడ్డు అధిక ప్రోటీన్‌తో నిండి ఉంటుంది. తద్వారా వారి జీవక్రియను పెంచడానికి సాయపడుతుంది. దీనిని అరిగించడానికి కొవ్వులు లేదా పిండి పదార్థాల కంటే ఎక్కువ శక్తిని శరీరం వినియోగిస్తుంది. దీంతో అధిక కేలరీలు వినియోగం అయ్యి బరువును తగ్గించుకునేందుకు వీలవుతుంది.

చియా సీడ్.. చియా విత్తనాలలో ఫైబర్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీఆక్సిడెంట్లు, మినరల్స్‌లో పుష్కలంగా ఉంటాయి. చియా గింజలలోని తక్కువ క్యాలరీలు. కొలెస్ట్రాల్ కంటెంట్ రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడానికి, షుగర్ స్పైక్‌లను నివారించడానికి సహాయపడుతుంది.

చిక్కుళ్లు.. బీన్స్, చిక్‌పీస్, సోయాబీన్స్, వేరుశనగ, కాయధాన్యాలు, లూపిన్‌ల వంటి వివిధ రకాల చిక్కుళ్లలో విటమిన్లు, ఖనిజాలు, ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల వీటిని జీర్ణం చేయడానికి మీ శరీరం ఎక్కువ సమయం తీసుకుంటుంది. వాటిని అరిగించడానికి శరీరం ఎక్కువ కృషి చేయాల్సి ఉంటుంది. అందువల్ల ఎక్కువ కేలరీలు వినియోగం అవుతాయి. అలాగే దీనిలోని అర్జినైన్, అమైనో ఆమ్లం శరీరంలోని లిపిడ్లు, కార్బోహైడ్రేట్ల వినియోగాన్ని వేగవంతం చేయడంలో సహాయపడుతుంది. అందుకే బరువు నియంత్రించుకోవాలనకొనే వారికి చిక్కుళ్లు బెస్ట్ ఫుడ్.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..