AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Snoring: గురకే కదా అని వదిలేస్తే ప్రాణాల మీదికి వస్తుంది జాగ్రత్త! ఈ సింపుల్ టిప్స్‌తో గురకకు చెప్పండి చెక్..

కాంప్లికేషన్లు ఏవీ లేనప్పుడు గురక తాత్కాలికంగా మాత్రమే ఉంటుంది. కానీ స్లీప్‌ అప్నియా వల్ల వచ్చే గురక దీర్ఘకాలం ఉంటుంది. గురకతోపాటు బీపీ, షుగర్, ఊబకాయం ఉంటే ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్ని సంప్రదించాలి.

Snoring: గురకే కదా అని వదిలేస్తే ప్రాణాల మీదికి వస్తుంది జాగ్రత్త! ఈ సింపుల్ టిప్స్‌తో గురకకు చెప్పండి చెక్..
Snoring
Madhu
|

Updated on: Mar 09, 2023 | 11:45 AM

Share

గురక సమస్యను పెద్దగా ఎవరూ పట్టించుకోరు. కానీ మన పక్కన వారికి అది చాలా ఇబ్బందిగా ఉంటుంది. కొన్ని సందర్భా‍ల్లో గురకపెట్టే వారికి కూడా ప్రాణాపాయాన్ని తెచ్చిపెడుతుంది. సాధారణంగా మనం పీల్చుకునే గాలి ముక్కుల నుంచి ఊపిరితిత్తుల్లోకి వెళ్తుంది. ఈ మార్గంలో ఏవైనా అడ్డంకులు ఏర్పడితే గురక వస్తుంది. పొగతాగడం, మద్యం సేవించడం వంటి అలవాట్లున్నవారికి గురక డేంజర్‌గా మారుతుంది. స్థూలకాయులకు గురక సమస్య ఉంటే వారికి హార్ట్‌ ఫెయిల్‌ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీనిని పరిహరించడానికి వీలైనంత వరకూ ప్రయత్నించాలి. లేకుంటే అంది స్లీప్‌ అప్నియాకు దారితీస్తుంది. స్లీప్‌ అప్నియా శారీరక సమస్యలనే కాకుండా మానసిక, సామాజిక సమస్యలనూ తీసుకొస్తుంది. గురక తీవ్రమైతే జబ్బుగానే పరిగణించాలి. కాంప్లికేషన్లు ఏవీ లేనప్పుడు గురక తాత్కాలికంగా మాత్రమే ఉంటుంది. కానీ స్లీప్‌ అప్నియా వల్ల వచ్చే గురక దీర్ఘకాలం ఉంటుంది. గురకతోపాటు బీపీ, షుగర్, ఊబకాయం ఉంటే ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్ని కలవాలి.

బరువు నియంత్రణలో ఉండాలి.. మీ శరీర బరువు నియంత్రణలో ఉండాలి. మెడ చుట్టూ ఉండే అధిక బరువు శ్వాసనాళంపై ఒత్తిడిని కలిగిస్తుంది. ఆరోగ్యకరమైన ఆహారం, క్రమం తప్పకుండా చసే వ్యాయామం బరువును అదుపులో ఉంచుతుంది. బరువు తక్కువగా ఉంటే గురకకూడా తగ్గే అవకాశం ఉంటుంది.

మత్తుమందులను నివారించాలి.. నిద్రవేళకు ముందు ఆల్కహాల్, మత్తుమందులను నివారిస్తే అది గురకను తగ్గించడంలో సహాయపడుతుంది. ఈ మత్తు పదార్థాలు గొంతులోని కండరాలను సడలించి, వాటిని కంపించేలా చేస్తాయి, ఇది గురకకు దారి తీస్తుంది. వీటికి బదులు నిద్రపోయే ముందు హెర్బల్ టీ లేదా నీరు తాగడానికి ప్రయత్నించండి.

ఇవి కూడా చదవండి

నిద్ర భంగిమ.. నిద్ర భంగిమల్లో మార్పులు చేసుకోవాలి. కనీసం నాలుగు అంగుళాల ఎత్తులో తల ఉంచి పడుకోవాలి. ఎడమ చేతివైపు తిరిగి పడుకోవడం మేలు. వెల్లకిలా పడుకోవడం వల్ల ఇబ్బందికర పరిస్థితులు తలెత్తవచ్చు.

మంచి నిద్ర.. ప్రతిరోజూ ఒకే సమయంలో పడుకోవడం, మేల్కొవడం వల్ల మీకు నాణ్యమైన నిద్ర పడుతుంది. అది గురకను తగ్గిస్తుంది. అలాగే మీ పడక గదిని పడకగదిని చల్లగా, చీకటిగా, నిశ్శబ్దంగా ఉంచడం ద్వారా నాణ్యమైన నిద్ర పడుతుంది.

గురక తీవ్రమైన సమస్యా?

గురక అనేది సాధారణంగా తీవ్రమైన సమస్య కాదు, కానీ అది నిద్రకు భంగం కలిగిస్తుంది. పగటిపూట అలసట మరియు చిరాకు కలిగిస్తుంది. కొన్ని సందర్భాల్లో, గురక అనేది స్లీప్ అప్నియా వంటి మరింత తీవ్రమైన పరిస్థితికి సంకేతం కావచ్చు, ఇది చికిత్స చేయకుండా వదిలేస్తే ఇతర అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది.గురకవచ్చే వారు ఒకసారి డాక్టర్ను తప్పనిసరిగా సంప్రదించి అది ప్రమాదరహితమైన మామూలు గురకా లేక ప్రమాదకరమైన ఆప్నియా గురకా అన్నది తెలుసుకోవాలి. అవసరాన్ని బట్టి సీపాప్‌ వంటి ఉపకరణాలు వాడటమో లేదా ఈఎన్‌టీ, పల్మునాలజిస్టులు చెప్పే సూచనలు పాటించడం, చికిత్స చేయించుకోవడం అవసరం.

నివారణ ఇలా..

సరైన ఆహారం తీసుకోవడం, సరైన బీఎంఐ మెయిటెన్‌  చేయడం, దురలవాట్లకు దూరంగా ఉండడం వంటివి గురకను నివారిస్తాయి. స్థూలకాయం ఉన్నవారు బరువు తగ్గాలి. ఆల్కహాల్‌ అలవాటు ఉన్నవారు నిద్రకు ఉపక్రమించడానికి నాలుగు నుంచి ఆరు గంటల ముందు వరకు ఆల్కహాల్‌ ఎట్టిపరిస్థితుల్లో తీసుకోకూడదు. ఆల్కహాల్‌ అలవాటు ఉన్నవారికి గురక ఉంటే, ఆల్కహాల్‌ తీసుకున్న తర్వాత అది ఎక్కువ కావడం గుర్తించవచ్చు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..