AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ముక్కులో నుండి రక్తం వస్తుందా..? దీనికి కారణమేంటో తెలుసా..?

వేసవికాలం రాగానే ఉష్ణోగ్రతలు తీవ్రమవుతాయి. వేడి అధికంగా ఉన్న రోజుల్లో శరీరంలో నీటి శాతం తగ్గిపోతుంది. ఇది డీహైడ్రేషన్‌కు దారి తీస్తుంది. నీరు తగ్గిపోతే ముక్కులో ఉండే లోపలి భాగాలు పొడిబారి బలహీనంగా మారుతాయి. అలాంటి పరిస్థితుల్లో ముక్కులో చిల్లు పడి రక్తం కారడం మొదలవుతుంది. అయితే కొన్ని చిట్కాలు పాటిస్తే ఈ సమస్య నుంచి తప్పించుకోవచ్చు.

ముక్కులో నుండి రక్తం వస్తుందా..? దీనికి కారణమేంటో తెలుసా..?
Nose Bleeding In Summer
Prashanthi V
|

Updated on: May 08, 2025 | 6:37 PM

Share

శరీరానికి అవసరమైన తేమ అందాలంటే ప్రతిరోజూ ఎక్కువగా నీరు తాగాలి. వేడి ఎక్కువగా ఉన్న రోజులలో కనీసం ఎనిమిది గ్లాసుల నీరు తాగడం మంచిది. అదనంగా కొబ్బరినీరు, నిమ్మకాయ రసం వంటివి కూడా తాగితే ఒంట్లో నీరు సరిగ్గా ఉంటుంది. నీటి ద్వారా లోపలికి తేమ చొచ్చుకుపోతే ముక్కు పొడిబారే ప్రమాదం తగ్గుతుంది.

వేసవిలో పొడి గాలి ప్రభావం వల్ల ముక్కు లోపలి చర్మం ఎండిపోతుంది. దీన్ని నివారించేందుకు వాసెలిన్ లేదా ముక్కుకు సంబంధించిన మృదువైన మాయిశ్చరైజర్‌ను రోజుకు రెండు మూడు సార్లు వాడాలి. ఇది లోపలి పొరలకు తేమ అందించి చిల్లు పడి రక్తం కారే అవకాశం తగ్గిస్తుంది.

బయట సూర్యుడు మండిపోతున్న సమయంలో నేరుగా వెలుతురు తాకకుండా చూసుకోవాలి. తలపై స్కార్ఫ్ లేదా బట్టతో ముఖం కవర్ చేసుకుంటే వేడి తక్కువగా తగులుతుంది. ఇది శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడంలో ఉపయోగకరంగా ఉంటుంది.

ఇంట్లో గాలిలో నీటి శాతం తగ్గిపోతే ముక్కు ఎండిపోయి ఇబ్బందిగా ఉంటుంది. అలాంటప్పుడు హ్యూమిడిఫైయర్ లేదా తక్కువ టెంపరేచర్‌లో పనిచేసే ఏసీ వాడితే గాలిలో తేమ పెరుగుతుంది. ఇది ముక్కులో తడిని ఉంచుతుంది.

ముక్కు దిబ్బడగా ఉంటే గట్టిగా ఊపిరి పీల్చినా లేదా గట్టిగా తుమ్మినా లోపల రక్తనాళాలు పగిలిపోవచ్చు. అలాంటప్పుడు మెల్లగా శుభ్రం చేయాలి. సలైన్ స్ప్రే వాడితే ముక్కు శుభ్రంగా అవ్వడమే కాకుండా తడిగా కూడా ఉంటుంది.

పొడిబారిన ముక్కులో కొందరికి దురదగా అనిపిస్తుంది. అప్పుడు గోకితే లోపల నాజూకైన నాళాలు దెబ్బతిని రక్తం కారుతుంది. అందుకే చేతులతో ముక్కు గోకకుండా జాగ్రత్త పడాలి.

నిద్రపోయేటప్పుడు తల కొంచెం పైకి ఉండేలా దిండు పెట్టుకుంటే ముక్కు మీద ఎక్కువ బరువు పడదు. దానివల్ల రాత్రిపూట ముక్కులోంచి రక్తం రాకుండా ఉంటుంది.

తరచుగా ముక్కులోంచి రక్తం కారుతూ ఉంటే లేదా ఒకేసారి ఎక్కువ వస్తే లైట్ తీసుకోకూడదు. తప్పకుండా డాక్టర్‌ను కలవాలి. ఇది ఎప్పటికీ తగ్గని సమస్య అయితే అసలు కారణం ఏంటో తెలుసుకొని సరైన ట్రీట్‌మెంట్ తీసుకోవాలి.

Follow Us
నెల రోజులు చక్కెర తీసుకోవడం మానేస్తే.. ఎంత బరువు తగ్గుతారో తెలుసా
నెల రోజులు చక్కెర తీసుకోవడం మానేస్తే.. ఎంత బరువు తగ్గుతారో తెలుసా
జుట్టు విపరీతంగా రాలిపోతోందా?ఈ ఒక్క హోమ్ రెమెడీతో చెక్ పెట్టండి!
జుట్టు విపరీతంగా రాలిపోతోందా?ఈ ఒక్క హోమ్ రెమెడీతో చెక్ పెట్టండి!
ఆకాశంలో బ్లూ మూన్ అద్భుతం.. రేపటి ఈ అరుదైన పౌర్ణమిని మిస్..
ఆకాశంలో బ్లూ మూన్ అద్భుతం.. రేపటి ఈ అరుదైన పౌర్ణమిని మిస్..
టీమిండియాలోకి వైభవ్.. సూర్య, గిల్‌ ఔట్.. జాబితా చూశారా?
టీమిండియాలోకి వైభవ్.. సూర్య, గిల్‌ ఔట్.. జాబితా చూశారా?
టెస్లా కార్లపై ఏకంగా రూ. 9 లక్షల తగ్గింపు.. ఎందుకో తెలుసా?
టెస్లా కార్లపై ఏకంగా రూ. 9 లక్షల తగ్గింపు.. ఎందుకో తెలుసా?
ఒకే టూర్‌లో 7 జ్యోతిర్లింగాల దర్శనం.. సికింద్రాబాద్ నుంచి..
ఒకే టూర్‌లో 7 జ్యోతిర్లింగాల దర్శనం.. సికింద్రాబాద్ నుంచి..
వేసవిలో ఈ పండు అమృతం!వడదెబ్బ,డీహైడ్రేషన్ నుండి రక్షణకు బెస్ట్
వేసవిలో ఈ పండు అమృతం!వడదెబ్బ,డీహైడ్రేషన్ నుండి రక్షణకు బెస్ట్
పోస్టాఫీసులో రూ. లక్ష డిపాజిట్‌ చేస్తే రెండేళ్లకు ఎంత వస్తుంది?
పోస్టాఫీసులో రూ. లక్ష డిపాజిట్‌ చేస్తే రెండేళ్లకు ఎంత వస్తుంది?
ఐపీఎల్ హిస్టరీలోనే మోస్ట్ అన్‌లక్కీ ప్లేయర్ ఎవరో తెలుసా?
ఐపీఎల్ హిస్టరీలోనే మోస్ట్ అన్‌లక్కీ ప్లేయర్ ఎవరో తెలుసా?
ఇంటర్ పూర్తి చేశారా? కాలేజీ ఎంపికలో ఈ తప్పులు చేస్తే కెరీర్..
ఇంటర్ పూర్తి చేశారా? కాలేజీ ఎంపికలో ఈ తప్పులు చేస్తే కెరీర్..