AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Liver Health: నిశ్శబ్దంగా దెబ్బతీసే ఫ్యాటీ లివర్.. ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేయొద్దు..!

ఫ్యాటీ లివర్ వ్యాధి మొదట ఎలాంటి లక్షణాలు చూపించదు. అందుకే చాలా మంది దీన్ని పట్టించుకోరు. కానీ దీనిని నిర్లక్ష్యం చేస్తే అది నిశ్శబ్దంగా మన కాలేయాన్ని దెబ్బతీస్తుంది. చివరికి తీవ్రమైన సమస్యలకు దారి తీస్తుంది. ఈ వ్యాధి ఎందుకు వస్తుంది. దాన్ని ఎలా నియంత్రించాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

Liver Health: నిశ్శబ్దంగా దెబ్బతీసే ఫ్యాటీ లివర్.. ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేయొద్దు..!
Fatty Liver Issues
Prashanthi V
|

Updated on: Aug 25, 2025 | 9:42 PM

Share

కాలేయం శరీరాన్ని శుభ్రం చేయడం నుండి జీర్ణక్రియ వరకు ఎన్నో పనులు చేస్తుంది. డాక్టర్లు చెప్పిన దాని ప్రకారం.. కాలేయంలో ఎక్కువ కొవ్వు పేరుకుపోవడాన్ని ఫ్యాటీ లివర్ వ్యాధి అంటారు. ఈ కొవ్వు ప్రారంభంలో ఎలాంటి ఇబ్బంది కలిగించదు. కానీ చాలా కాలం తర్వాత.. ఇది కాలేయంలో వాపుకు కారణమై కాలేయం పనితీరును దెబ్బతీస్తుంది. సరైన సమయంలో చికిత్స తీసుకోకపోతే ఇది సిర్రోసిస్ అనే తీవ్రమైన వ్యాధిగా మారవచ్చు.

ఆల్కహాల్ మాత్రమే కారణమా..?

చాలా మంది ఫ్యాటీ లివర్ అంటే మద్యం వల్లే వస్తుందని అనుకుంటారు. కానీ ఇది నిజం కాదు. మద్యం తాగకపోయినా.. తప్పుడు ఆహారపు అలవాట్లు, వ్యాయామం లేకపోవడం, ఎక్కువ కేలరీలు ఉన్న ఆహారం వల్ల కూడా ఫ్యాటీ లివర్ రావచ్చు. ఈ సమస్యలు ఈ రోజుల్లో చాలా సాధారణం అయ్యాయి.

కాలేయానికి హానికరమైనవి

  • ఎక్కువగా స్వీట్ డ్రింక్స్ (సోడాలు, ప్యాక్ చేసిన జ్యూస్‌ లు, తీపి టీ)
  • ఫ్రైడ్ ఫుడ్స్ (సమోసాలు, పకోడీలు, చిప్స్)
  • ప్రాసెస్ చేసిన ఆహారాలు (బిస్కెట్లు, బేకరీ ఐటెమ్స్)
  • శారీరక శ్రమ లేకపోవడం
  • నిద్ర తక్కువగా ఉండటం
  • ఎక్కువ ఒత్తిడి

ఈ కారణాల వల్ల కాలేయంలో వ్యర్థాలు పేరుకుపోయి.. దాని పనితీరు నెమ్మదిగా తగ్గుతుంది.

ఫ్యాటీ లివర్ నివారించే మార్గాలు

  • ప్రాసెస్ చేసిన ఆహారాలు, వేయించిన వాటిని తినడం తగ్గించండి.
  • మీ రోజువారీ ఆహారంలో పండ్లు, ఆకుకూరలు, తృణధాన్యాలు, ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాలు చేర్చండి.
  • ప్రతిరోజూ వ్యాయామం చేయడం, బరువు తగ్గడం చాలా ముఖ్యం.
  • బ్లాక్ కాఫీ, గ్రీన్ టీ, బ్రోకలీ, బీట్‌రూట్ జ్యూస్ వంటి కాలేయానికి మంచి చేసే పదార్థాలు తీసుకోవాలి.
  • రోజూ సరిపడా నిద్రపోవడం, ఒత్తిడి తగ్గించుకోవడం కూడా చాలా అవసరం.

ఈ విధంగా ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటిస్తే ఫ్యాటీ లివర్ వ్యాధిని రాకుండా నివారించవచ్చు. ప్రారంభ దశలోనే గుర్తించి సరైన జాగ్రత్తలు తీసుకుంటే కాలేయాన్ని కాపాడుకోవచ్చు.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

Follow Us
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ
శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..
శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..
ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!
ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!
విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..
విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..
దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!
దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!
పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు
పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు
న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!
న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!
మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..
మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..
కోడిలో ఏ భాగాన్ని తినకుండా ఉండాలి? చాలా మంది చేసే పొరపాటు ఇదే..!
కోడిలో ఏ భాగాన్ని తినకుండా ఉండాలి? చాలా మంది చేసే పొరపాటు ఇదే..!
పాన్ కార్డులో ఫొటోను ఇంట్లో నుంచే నిమిషాల్లో మార్చుకోండి..
పాన్ కార్డులో ఫొటోను ఇంట్లో నుంచే నిమిషాల్లో మార్చుకోండి..