షుగర్ ఉన్నవారికి గుడ్‌న్యూస్.. ఇవి తింటే కంట్రోల్ అవుతుంది..!
డయాబెటిస్ ప్రస్తుతం చాలా మందిని బాధిస్తున్న ఆరోగ్య సమస్య. ఇది పూర్తిగా నయం కాకపోయినా.. సరైన ఆహారపు అలవాట్లు, క్రమమైన వ్యాయామం, ఆరోగ్యకరమైన జీవనశైలితో దీన్ని నియంత్రణలో ఉంచుకోవచ్చు. రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచడానికి మందులతో పాటు కొన్ని సహజ ఆహారాలు కూడా చాలా ఉపయోగపడతాయి.

ప్రస్తుతం మధుమేహం చాలా సాధారణ సమస్యగా మారింది. ఇది పూర్తిగా నయం కాకపోయినా.. సరైన ఆహారం, వ్యాయామంతో నియంత్రణలో ఉంచుకోవచ్చు. రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచడానికి మందులతో పాటు కొన్ని సహజ ఆహారాలు కూడా చాలా ఉపయోగపడతాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
మెంతులు
మెంతి గింజల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరంలో చక్కెర శోషణను నెమ్మదిగా చేస్తుంది. ఉదయం నానబెట్టిన మెంతి గింజలు లేదా మెంతుల నీళ్లు తాగితే మధుమేహం అదుపులో ఉంటుంది.
బెర్రీ పండ్లు
స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ లాంటి బెర్రీ పండ్లలో చక్కెర తక్కువగా ఉంటుంది. ఇవి తిన్న వెంటనే రక్తంలో గ్లూకోజ్ స్థాయి పెరగదు. ఈ పండ్లలో ఉండే యాంటీఆక్సిడెంట్లు మధుమేహ నియంత్రణకు చాలా మంచివి.
ఓట్స్
ఓట్స్‌లో అధిక ఫైబర్ ఉంటుంది. దీనిలోని బీటా గ్లూకాన్ అనే ఫైబర్ రక్తంలో గ్లూకోజ్ చేరే వేగాన్ని తగ్గిస్తుంది. దీని వల్ల భోజనం తర్వాత చక్కెర స్థాయి ఒక్కసారిగా పెరగదు. మధుమేహ రోగులు అల్పాహారంలో ఓట్స్‌ను తీసుకోవచ్చు.
నట్స్, డ్రై ఫ్రూట్స్
బాదం, వేరుశనగ, అక్రోట్స్, పిస్తా వంటి గింజల్లో ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్‌లు ఉంటాయి. ఇవి శక్తిని ఇస్తూనే రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తాయి. కానీ వీటిని తక్కువ మోతాదులో మాత్రమే తినాలి.
కాకరకాయ
కాకరలో ఉండే చారంటిన్ అనే పదార్థం రక్తంలో చక్కెరను తగ్గించడానికి సహాయపడుతుంది. కాకరకాయ కూరగా లేదా జ్యూస్‌గా కూడా తీసుకోవచ్చు.
పసుపు
పసుపులో ఉండే కుర్కుమిన్ అనే పదార్థం మన శరీరంలో ఇన్సులిన్ పనితీరును మెరుగుపరుస్తుంది. ప్రతిరోజూ వంటల్లో పసుపును వాడటం మధుమేహ నియంత్రణకు మంచిది.
ఉసిరి
ఉసిరిలో విటమిన్ C, యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెరను తగ్గించడమే కాకుండా శరీర రోగనిరోధక శక్తిని కూడా పెంచుతాయి. ఉసిరిని పచ్చిగా లేదా పొడి రూపంలో కూడా తీసుకోవచ్చు.
మునగాకులు
మునగ ఆకుల్లో విటమిన్లు, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. ఇవి మధుమేహ రోగులకు చాలా మంచివి. మునగ ఆకుల్లోని పోషకాలు రక్తంలో చక్కెరను తగ్గించడంలో సహాయపడతాయి.
మధుమేహాన్ని నియంత్రించడంలో మందులు, ఆహారం రెండూ ముఖ్యమే. ఈ ఆహారాలను మీ డైట్‌లో చేర్చుకునే ముందు తప్పనిసరిగా మీ వైద్యులు లేదా పోషకాహార నిపుణులను సంప్రదించండి.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)




