కిడ్నీ వ్యాధులకు చెక్ పెట్టే అద్భుతమైన ఆహారాలు ఇవే..! వీటిని తింటే చాలు.. ఆరోగ్యం మీ సొంతం..!
మన శరీరంలో కిడ్నీలు రక్తాన్ని శుభ్రం చేయడం, నీటి స్థాయిని సమతుల్యం చేయడం వంటి కీలక పనులు చేస్తాయి. కానీ ఈ రోజుల్లో కిడ్నీ సమస్యలు పెరుగుతున్నాయి. సరైన ఆహారం తీసుకోవడం ద్వారా కిడ్నీలను రక్షించుకోవచ్చు. కిడ్నీల ఆరోగ్యానికి మేలు చేసే 5 ముఖ్యమైన ఆహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

మన శరీరంలో కిడ్నీలు చాలా ముఖ్యమైనవి. ఇవి రక్తాన్ని శుభ్రం చేయడం, శరీరంలోని నీటి స్థాయిని సరిగ్గా ఉంచడం. అలాగే ముఖ్యమైన ఎలక్ట్రోలైట్స్ సమతుల్యం చేయడం వంటి పనులు చేస్తాయి. ఈ మధ్య కాలంలో కిడ్నీ సమస్యలు పెరుగుతున్నాయి. కాబట్టి మనం తినే ఆహారం, మన జీవనశైలి చాలా ముఖ్యం. కిడ్నీలకు మేలు చేసే ఐదు ముఖ్యమైన ఆహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
బ్లూబెర్రీస్
వీటిలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కిడ్నీ కణాలకు నష్టం జరగకుండా కాపాడతాయి. బ్లూబెర్రీస్ తినడం వల్ల కిడ్నీ రోగులలో వాపు తగ్గుతుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. వీటిలో పొటాషియం, ఫాస్పరస్ తక్కువగా ఉండటం వల్ల కిడ్నీ సమస్యలు ఉన్నవారికి ఇవి సురక్షితమైనవి.
సాల్మన్ చేప
సాల్మన్ వంటి చేపల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరంలో మంటను తగ్గించి కిడ్నీలకు మరింత నష్టం జరగకుండా కాపాడతాయి. ఇది మంచి ప్రోటీన్ వనరు కూడా. సాల్మన్ తినడం వల్ల గుండె, మెదడు, కళ్ల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.
కాలే ఆకుకూర
కాలే కేవలం గుండెకే కాకుండా కిడ్నీలకు కూడా మంచిది. ఇందులో విటమిన్లు A, C, K ఎక్కువగా ఉంటాయి. ఇది రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే ఇందులో ఉండే ఫైబర్ శరీరంలోని విషపదార్థాలను బయటకు పంపడానికి ఉపయోగపడుతుంది.
రెడ్ బెల్ పెప్పర్స్
రెడ్ బెల్ పెప్పర్స్ కిడ్నీల ఆరోగ్యానికి ప్రత్యేకంగా మంచివి. వీటిలో పొటాషియం తక్కువగా ఉండి.. విటమిన్లు A, C ఎక్కువగా ఉంటాయి. వీటిని పచ్చిగా కూడా తినవచ్చు.
కాలీఫ్లవర్
కాలీఫ్లవర్ కిడ్నీలను రక్షించే మరొక అద్భుతమైన ఆహారం. ఇందులో పొటాషియం తక్కువగా ఉండి.. ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణక్రియకు సహాయపడి, శరీరంలోని విషపదార్థాలను తగ్గిస్తుంది. కాలీఫ్లవర్ తినడం వల్ల కిడ్నీలో రాళ్ళు ఏర్పడే ప్రమాదం కూడా తగ్గుతుంది. ఈ ఐదు ఆహారాలను మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం ద్వారా మీ కిడ్నీల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)




