AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

యూరిక్ యాసిడ్.. ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు..!

ప్రస్తుత రోజుల్లో రక్తంలో యూరిక్ యాసిడ్ లెవల్స్ పెరగడం ఒక సాధారణ సమస్యగా మారింది. దీన్ని పట్టించుకోకపోతే కిడ్నీ, గుండె సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. ప్రారంభ దశలో కనిపించే చిన్న లక్షణాలను గుర్తించడం చాలా ముఖ్యం. సరైన డయాగ్నోసిస్, డైట్, లైఫ్ స్టైల్ మార్పులతో దీన్ని కంట్రోల్ చేయవచ్చు.

యూరిక్ యాసిడ్.. ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు..!
Uric Acid
Prashanthi V
|

Updated on: Sep 02, 2025 | 6:57 PM

Share

రక్తంలో యూరిక్ యాసిడ్ లెవల్స్ పెరగడం ఇప్పుడు చాలా కామన్ ప్రాబ్లమ్ అయిపోయింది. దీన్ని స్టార్టింగ్‌లో కనిపెట్టకపోతే గుండె, కిడ్నీ ప్రాబ్లమ్స్ రావచ్చు. చాలా సార్లు యూరిక్ యాసిడ్ పెరిగినప్పుడు కనిపించే చిన్నపాటి లక్షణాలను మనం పట్టించుకోం. అందుకే డయాగ్నోసిస్ లేట్ అవుతుంది.

యూరిక్ యాసిడ్ లక్షణాలు

  • స్కిన్ ప్రాబ్లమ్స్.. యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటే స్కిన్‌పై రెడ్ కలర్ స్పాట్స్, అలర్జీలు రావచ్చు.
  • కాళ్లలో పెయిన్.. యూరిక్ యాసిడ్ లెవల్స్ పెరిగితే కాళ్ల వేళ్లలో భరించలేని నొప్పి వస్తుంది. కొన్ని సార్లు యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ పాదాలలో పేరుకుపోయి నొప్పిని మరింత పెంచుతాయి.
  • వెన్నునొప్పి, పాదాలలో తిమ్మిరి.. యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటే.. పాదాల నరాల్లో, వెన్నెముకలో క్రిస్టల్స్ ఫామ్ అవుతాయి. దీని వల్ల పాదాలలో తిమ్మిరి, వాపు, జలదరింపు, వెన్నునొప్పి వస్తాయి. దీన్ని మజిల్స్ లేదా వెన్నెముక ప్రాబ్లమ్‌గా మిస్‌డయాగ్నోస్ చేసే అవకాశం ఉంది.
  • తేలికపాటి జ్వరం, బాడీ పెయిన్స్.. హై యూరిక్ యాసిడ్ ఉన్నవారికి మైల్డ్ ఫీవర్, ఒళ్ళు నొప్పులు వస్తాయి. దీన్ని వేరే జబ్బుగా తప్పుగా అనుకోవచ్చు.

పైన చెప్పిన లక్షణాలు మీకు ఉంటే వెంటనే డాక్టర్ ని కలవాలి. డాక్టర్ టెస్టులు చేసి యూరిక్ యాసిడ్ తగ్గించడానికి ఫుడ్ హాబిట్స్ చెబుతారు. డైట్‌లో, లైఫ్ స్టైల్‌లో చేంజెస్ డాక్టర్ సలహా ప్రకారం మాత్రమే చేయాలి.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)