AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ నీరు అద్భుతం.. అమృతం.. కిడ్నీల్లో రాళ్ల సమస్యను ఇట్టే మాయం చేస్తుందంట..

నేటి కాలంలో చాలా మంది కిడ్నీ స్టోన్ సమస్యతో బాధపడుతున్నారు. కిడ్నీలో రాళ్లు ఏ వయసులోనైనా రావచ్చు. అనారోగ్యకరమైన జీవనశైలి, ఆహారాల కారణంగా ఇలాంటి సమస్యలు వస్తాయి... కిడ్నీలో రాళ్లు ఏర్పడానికి మరొక ప్రధాన కారణం ఉప్పు, కాల్షియం.. వీటిని అధికంగా తీసుకున్నా మూత్ర పిండాల్లో రాళ్లు ఏర్పడతాయి..

ఈ నీరు అద్భుతం.. అమృతం.. కిడ్నీల్లో రాళ్ల సమస్యను ఇట్టే మాయం చేస్తుందంట..
Kidney Stones
Shaik Madar Saheb
|

Updated on: Aug 14, 2024 | 1:44 PM

Share

నేటి కాలంలో చాలా మంది కిడ్నీ స్టోన్ సమస్యతో బాధపడుతున్నారు. కిడ్నీలో రాళ్లు ఏ వయసులోనైనా రావచ్చు. అనారోగ్యకరమైన జీవనశైలి, ఆహారాల కారణంగా ఇలాంటి సమస్యలు వస్తాయి… కిడ్నీలో రాళ్లు ఏర్పడానికి మరొక ప్రధాన కారణం ఉప్పు, కాల్షియం.. వీటిని అధికంగా తీసుకున్నా మూత్ర పిండాల్లో రాళ్లు ఏర్పడతాయి.. కిడ్నీలో గట్టి నిక్షేపాలు ఏర్పడటాన్నే కిడ్నీ స్టోన్ అంటారు. ఇది బాధాకరమైన అనుభవం.. మూత్ర నాళంలో అడ్డంకిని కలిగిస్తుంది. కిడ్నీ స్టోన్స్ వాంతులు, జ్వరం, మూత్రంలో రక్తం లాంటి సమస్యలను కలిగిస్తాయి. ఈ సమస్య నుంచి మనం ఎలా ఉపశమనం పొందవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం..

మూత్రపిండాల్లో రాళ్ల సమస్యలకు కొబ్బరి నీరు అద్భుతమైన ఔషధమని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇది శరీరాన్ని హైడ్రేట్ చేస్తుంది. మొత్తం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇది కిడ్నీలో రాళ్లను నివారిస్తుంది. ఈ హెల్తీ డైట్ కిడ్నీకి ఎలా మేలు చేస్తుందో ప్రముఖ పోషకాహార నిపుణురాలు న్మామి అగర్వాల్ తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో తెలిపారు.

కొబ్బరి నీరు ఎలాంటి ప్రయోజనాలను అందిస్తుంది?

ఎలక్ట్రోలైట్స్ సమృద్ధిగా ఉంటాయి

కొబ్బరి నీరు పొటాషియం, మెగ్నీషియం, సోడియంతో సహా ఎలక్ట్రోలైట్ల అద్భుతమైన మూలం. ఇవి శరీరంలోని ద్రవాలను నియంత్రించడంలో సహాయపడతాయి. ఇది మూత్రపిండాల పనితీరుకు సహాయపడుతుంది.

యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి

పోషకాహార నిపుణుల అభిప్రాయం ప్రకారం, కొబ్బరి నీళ్లలో ఉండే అధిక యాంటీ ఆక్సిడెంట్లు మీ శరీరంలో ప్రోటీన్లను బంధించకుండా నిరోధిస్తాయి. యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్‌తో పోరాడటానికి కూడా సహాయపడతాయి. అనేక దీర్ఘకాలిక వ్యాధులను అభివృద్ధి చేసే ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

స్ఫటికీకరణను నిరోధిస్తుంది..

కిడ్నీ స్టోన్స్ ఖనిజాలు.. లవణాల గట్టి నిక్షేపాలు.. కొబ్బరి నీళ్లు తాగడం వల్ల టాక్సిన్స్‌ను బయటకు పంపడం, క్రియేటినిన్ స్థాయిలను తగ్గించడం ద్వారా స్ఫటికీకరణను నిరోధించవచ్చు.

ఇది మూత్రాన్ని పలుచన చేస్తుంది

కొబ్బరి నీటిని క్రమం తప్పకుండా త్రాగే వ్యక్తులు వారి మూత్రం పలుచగా ఉంటుంది.. ఎందుకంటే ఇది మూత్రపిండాల నిర్మాణ వస్తువులుగా పరిగణించబడే ఖనిజ స్ఫటికాలు ఏర్పడకుండా నిరోధిస్తుంది.

ఇంకా మంచి ఫలితాల కోసం కొబ్బరి నీళ్లలో సబ్జా గింజలను కలపుకుని తాగాలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.

View this post on Instagram

A post shared by Nmami (@nmamiagarwal)

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..