AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రోజులో ఎంతసేపు కూర్చోవచ్చు..? ఎక్కువసేపు కూర్చుంటే ఏమౌతుంది..?

ఎక్కువసేపు కూర్చోవడం మన ఆరోగ్యానికి ప్రమాదకరం. పరిశోధనల ప్రకారం రోజుకు 15 గంటలకుపైగా కూర్చున్నవారికి గుండె సమస్యలు, మరణం వచ్చే రిస్క్ రెట్టింపు అవుతుంది. కదలికలు లేకపోవడం వల్ల రక్తంలో చక్కెర, కొవ్వు స్థాయిలు పెరిగి గుండెపై ఒత్తిడి పెరుగుతుంది. కాబట్టి వ్యాయామం, చిన్న కదలికలు చాలా అవసరం.

రోజులో ఎంతసేపు కూర్చోవచ్చు..? ఎక్కువసేపు కూర్చుంటే ఏమౌతుంది..?
Working
Prashanthi V
|

Updated on: Sep 02, 2025 | 7:55 PM

Share

ఎక్కువసేపు కూర్చోవడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ఫిజికల్ యాక్టివిటీ లేకుండా లాంగ్ టైమ్ కూర్చుంటే గుండె సంబంధిత సమస్యలు వస్తాయి. ఇది రాబోయే ఆరోగ్య సమస్యలకు ఒక హెచ్చరికలాంటిది. ఈ విషయంపై పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

పరిశోధనలో ఏం తేలింది..?

ఒక కొత్త అధ్యయనంలో ఛాతీ నొప్పితో ఆసుపత్రిలో చేరిన 609 మంది రోగులను పరిశీలించారు. వారి సగటు వయస్సు 62 ఏళ్లు. ఆసుపత్రి నుంచి ఇంటికి వెళ్ళాక వారు రోజుకు ఎంతసేపు కూర్చున్నారు.. ఎంతసేపు నిద్రపోయారు అనేది ఒక పరికరం ద్వారా రికార్డ్ చేశారు.

రోజుకు 15 గంటల కంటే ఎక్కువ కూర్చున్నవారికి.. ఆసుపత్రి నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక సంవత్సరం లోపు గుండె సమస్యలు వచ్చే అవకాశం రెండింతలు ఎక్కువని తేలింది. డెత్ కూడా సంభవించవచ్చు. 12 గంటలు కూర్చున్న వారితో పోలిస్తే.. ఎక్కువసేపు కూర్చున్నవారికి ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉన్నాయి.

వ్యాయామం, కదలికలు ముఖ్యం

  • ఎక్కువసేపు కూర్చోవడం ఎంత హానికరమో, దాన్ని తగ్గించుకోవడానికి వ్యాయామం చేయడం కూడా అంతే ముఖ్యం.
  • రోజుకు 30 నిమిషాలు వేగంగా నడవడం లేదా రన్నింగ్ చేస్తే గుండె సమస్యలు 62 శాతం వరకు తగ్గుతాయి.
  • 30 నిమిషాలు కూర్చునే బదులు నడవడం, ఇంటి పనులు చేయడం వంటివి చేస్తే గుండెపోటు లేదా మరణం వచ్చే రిస్క్ 50 శాతం తగ్గుతుంది.
  • అలాగే 30 నిమిషాలు కూర్చునే బదులు పడుకుంటే గుండె సమస్యలు 14 శాతం వరకు తగ్గుతాయి.

ప్రతి సంవత్సరం, ప్రపంచవ్యాప్తంగా దాదాపు 80 లక్షల మంది ఛాతీ నొప్పితో ఆసుపత్రిలో చేరుతున్నారు. ఇది గుండెపోటు లాంటి సమస్యలకు దారితీస్తుంది. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత కూడా ఛాతీ నొప్పి వస్తే అది ఒక సీరియస్ హార్ట్ ప్రాబ్లమ్‌కు సంకేతం కావచ్చు.

వ్యాయామం చేయడం కష్టంగా అనిపించినా.. చిన్న చిన్న కదలికలు కూడా గుండెకు చాలా మంచివి. ఎక్కువసేపు కూర్చుంటే రక్తంలో చక్కెర, కొవ్వు స్థాయిలు పెరుగుతాయి. ఇది వాపు, రక్త నాళాల్లో కొవ్వు చేరడం, అవయవాలకు నష్టం వంటి సమస్యలకు దారితీస్తుంది. కండరాలు కదలడం వల్ల చక్కెర, కొవ్వు స్థాయిలు అదుపులో ఉంటాయి.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

శ్రేయస్ కంటే రాహుల్ పెద్ద తోపా? ఏకిపారేసిన ఐపీఎల్ టీమ్ ఓనర్
శ్రేయస్ కంటే రాహుల్ పెద్ద తోపా? ఏకిపారేసిన ఐపీఎల్ టీమ్ ఓనర్
ఈ సీక్రెట్ తెలిస్తే చికెన్ సూప్ కోసం హోటల్‌కు వెళ్లనే వెళ్లరు!
ఈ సీక్రెట్ తెలిస్తే చికెన్ సూప్ కోసం హోటల్‌కు వెళ్లనే వెళ్లరు!
నాగిని పాటకు.. దుమ్మురేపే డ్యాన్స్ వేసిన పాము.. వీడియో వైరల్..
నాగిని పాటకు.. దుమ్మురేపే డ్యాన్స్ వేసిన పాము.. వీడియో వైరల్..
స్టార్ డైరెక్టర్ అయ్యే ప్రయత్నంలో మృత్యు ఒడికి
స్టార్ డైరెక్టర్ అయ్యే ప్రయత్నంలో మృత్యు ఒడికి
అందాల నాట్య మయూరి.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?
అందాల నాట్య మయూరి.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?
కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!
సెలబ్రెటీల అడ్డాలో ఏకంగా రూ. 10 కోట్లతో పృథ్వీ షా డ్రీమ్ హౌస్
సెలబ్రెటీల అడ్డాలో ఏకంగా రూ. 10 కోట్లతో పృథ్వీ షా డ్రీమ్ హౌస్
హైదరాబాద్‌కు దగ్గర్లో స్వర్గాన్ని తలపించే 100 డెస్టినేషన్లు..
హైదరాబాద్‌కు దగ్గర్లో స్వర్గాన్ని తలపించే 100 డెస్టినేషన్లు..