AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tooth Infection: నోరు శుభ్రంగా ఉంటే మీ గుండె పదిలం.. నోరు అపరిశుభ్రంగా ఉంటే.. కలిగే వ్యాధులు ఎన్నో తెలుసా..

Tooth Infection: నోరు శుభ్రంగా ఉంటే శరీరంలోని సగం వ్యాధుల నుంచి మనల్ని మనం రక్షించుకున్నట్లే.. నోరు ఆరోగ్యంగా ఉంటే  గుండెజబ్బులు, ఛాతీ ఇన్ఫెక్షన్లను..

Tooth Infection: నోరు శుభ్రంగా ఉంటే మీ గుండె పదిలం.. నోరు అపరిశుభ్రంగా ఉంటే.. కలిగే వ్యాధులు ఎన్నో తెలుసా..
Tooth Infection
Surya Kala
|

Updated on: Nov 03, 2021 | 10:15 AM

Share

Tooth Infection: నోరు శుభ్రంగా ఉంటే శరీరంలోని సగం వ్యాధుల నుంచి మనల్ని మనం రక్షించుకున్నట్లే.. నోరు ఆరోగ్యంగా ఉంటే  గుండెజబ్బులు, ఛాతీ ఇన్ఫెక్షన్లను దరిచేరవు. దంతాల ఇన్ఫెక్షన్లు గుండె జబ్బుల ప్రమాదాన్ని దాదాపు మూడు రెట్లు పెంచుతాయి. దంత ఇన్‌ఫెక్షన్‌లకు చికిత్స పొందిన రోగుల కంటే, చికిత్స చేయని దంతాల ఇన్‌ఫెక్షన్‌లు ఉన్న వ్యక్తులకు హృదయ సంబంధ సమస్యలు వచ్చే అవకాశం 2.7 రెట్లు ఎక్కువగా ఉందని కొన్ని పరిశోధనల్లో వెల్లడింది.  ప్రపంచవ్యాప్తంగా సంభవించే మరణాలలో 30 శాతం మంది హృదయ సంబంధ వ్యాధుల కారణంగానే ఓ పరిశోధనలో వెల్లడైంది.  అందుకనే రోగనిరోధక శక్తి బలహీనం కాకుండా నోరుని శుభ్రంగా ఉంచుకోవాలని సూచిస్తున్నారు.  పరిశుభ్రమైన నోటి లో ఉండే సూక్ష్మక్రిములే ప్రత్యక్షంగా గుండెజబ్బులతో పాటు పరోక్షంగా డయాబెటిస్, ఆస్టియోపోరోసిస్, అనేక శ్వాసకోశ వ్యాధులతో పాటు అరుదుగా కొన్ని క్యాన్సర్లకూ కారణమవుతాయి. కనుకనే ఎప్పటికప్పుడు నోటిని శుభ్రంగా ఉంచుకోవడంతో పాటు.. అవసరమైతే వైద్యులను కూడా సంప్రదించాల్సి ఉంది.

“రూట్ ఇన్ఫెక్షన్ (సాధారణంగా దంతాల చీము అని పిలుస్తారు) నొప్పి, దంతాల వాపు వంటి లక్షలు కనిపిస్తుంటాయి. ఒకొక్కసారి పంటి రంగు మారవచ్చు. అయితే దంతాల్లో కొన్నిసార్లు ఇన్ఫెక్షన్ వెంటనే కనిపించదు. శుభ్రమైన నోరు ఆరోగ్యానికి చిహ్నం. కనుక ఫ్లోరైడ్ టూత్‌పేస్ట్‌తో రోజుకు రెండు సార్లు రాత్రి, పగలు పళ్ళు తోముకోవాలి. దీంతో నోటిలోని బ్యాక్టీరియా నివారింపబడుతుంది. అయితే కరోనా వైరస్ వెలుగులోకి వచ్చిన తరువాత దంత సమస్యలకు చికిత్స చేయించుకునేవారు సంఖ్య గణనీయంగా తగ్గింది. ఫలితంగా రోజు రోజుకీ ఆరోగ్యానికి ముప్పు పెరుగుతుంది.

కనుక అనేక వ్యాధులను నివారించుకోవడం కోసం నోటిని శుభ్రంగా ఉంచుకోవాలి. చిగుర్ల సమస్యలు ఏర్పడకుండా చూసుకోవాలి. చిన్న సమస్య ఏర్పడినప్పుడే.. నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను వెంటనే సంప్రదించాలి. అలాగే మీ నోటి ఆరోగ్యాన్ని చూసుకోవడంతో పాటు చిగుళ్ల వ్యాధిని నివారించడం కోసం ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి.  ధూమపానానికి దూరంగా ఉండడం మంచిది.

Also Read:

ఈ పండుగ సీజన్‌లో మీ షుగర్ లెవెల్స్‌ను అదుపులో పెట్టుకోవడానికి 5 సులభమైన మార్గాలు.. మీకోసం..