AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Diabetes Tips: ఈ పండుగ సీజన్‌లో మీ షుగర్ లెవెల్స్‌ను అదుపులో పెట్టుకోవడానికి 5 సులభమైన మార్గాలు.. మీకోసం..

Festive Season Diabetes Tips: దీపావళి పండుగ సందడి దాదాపు ప్రారంభమైంది. ప్రతి ఇంట్లో స్వీట్లు, స్నాక్స్, వివిధ రకాల ఆహార పదార్ధాలు విందుభోజనంలో ఉంటాయి. మన ఆరోగ్యాన్ని..

Diabetes Tips: ఈ పండుగ సీజన్‌లో మీ షుగర్ లెవెల్స్‌ను అదుపులో పెట్టుకోవడానికి 5 సులభమైన మార్గాలు.. మీకోసం..
Diabetes Diet Tips
Surya Kala
|

Updated on: Nov 03, 2021 | 9:41 AM

Share

Festive Season Diabetes Tips: దీపావళి పండుగ సందడి దాదాపు ప్రారంభమైంది. ప్రతి ఇంట్లో స్వీట్లు, స్నాక్స్, వివిధ రకాల ఆహార పదార్ధాలు విందుభోజనంలో ఉంటాయి. మన ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం తప్పని సరి. ముఖ్యంగా మధుమేహం వంటి దీర్ఘకాలిక వ్యాధులున్నవారు మనల్ని మీరు రక్షించుకోవడం ఎంత ముఖ్యమో మహమ్మారి మనకు అర్థమయ్యేలా చేసింది. మధుమేహం ఉన్న వ్యక్తులు కిడ్నీ సమస్యలు, గుండె జబ్బులు, నరాల సమస్యలు, పాదాల సమస్యలు మొదలైన వ్యాధితో  బాధపడే అవకాశం ఉంది. కనుక శరీరంలోని గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించడం తప్పనిసరి. ఈ పండుగ సీజన్‌లో మధుమేహం ఉన్న ప్రతి వ్యక్తి  అనుసరించాల్సిన ఆహార నియమాలు ఉన్నాయి. షుగర్ వ్యాధి గ్రస్తులు రోజు తమ శరీరంలోని చెక్కర స్థాయిని సరిచూసుకోవాల్సి ఉంటుంది. అయితే మధుమేహ వ్యాధిగ్రస్థులు పండగ సమయంలో మరింత జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది.  మహమ్మారి సమయంలో షుగర్ పేషేంట్స్ కోసం కొన్ని చిట్కాలు  మీకోసం..

* డయాబెటిక్ రోగులు మెడిసిన్ తీసుకోవడానికి బద్దకించకుండా కొనసాగించాలి. గ్లూకోజ్ స్థాయిలను నిరంతరం చెక్ చేసుకోలి. డాక్టర్‌ తప్పకుండా సంప్రదిస్తూ ఉండాలి.

* మధుమేహ స్థాయిల్లో హెచ్చు తగ్గులు లేకుండా మనం తినే ఆహారం, శారీరక శ్రమ, వ్యాయామం ప్రధాన పాత్ర పోషిస్తాయి. అందుకనే వ్యాయామంతో పాటు పోషకాహారం, తగినంత ప్రోటీన్ తీసుకోవడంపై శ్రద్ధ వహించాలి. అంతేకాదు బరువును నియంత్రించడంపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది.  మధుమేహం ఉన్న రోగులు ప్రతిరోజూ 45 నిమిషాల పాటు వ్యాయామంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది.

*షుగర్  రోగులను గ్లూకోజ్ స్థాయిలను నిరంతరం పర్యవేక్షిస్తూ ఉండాలి.

* గ్లూకోజ్ నియంత్రణలో ఒత్తిడి ప్రధాన పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా కరోనా మహమ్మారి సమయంలో ఒత్తిడితో షుగర్ వ్యాధిగ్రస్తుల పరిస్థితి ఆందోళనకరంగా అయ్యిందన్న సంగతి తేలింది.  సుదీర్ఘ లాక్‌డౌన్‌, ఆరోగ్యపరమైన ఆందోళన, నిరాశ , నిరాశ వంటి భావోద్వేగ ప్రతిస్పందనలతో షుగర్ పేషేంట్స్ కు ఒత్తిడికి గురయ్యారు. ఈ ఒత్తిడిని నివారించడానికి వ్యాయామం, యోగా,  ధ్యానం వంటి ఆరోగ్యకరమైన జీవితాన్ని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది.

*కరోనా  మహమ్మారి ఇంకా మనతోనే ఉంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు ఇన్ఫెక్షన్ బారిన పడే ప్రమాదాన్ని నివారించుకోవడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. కరోనా వ్యాక్సిన్ తీసుకోవడంతో పాటు, మధుమేహం ఉన్న రోగులు సామాజిక దూరం, మాక్స్ ధరించడం, తరచుగా చేతులు కడుక్కోవడం వంటి నిబంధనలు పాటించాలి.  ఈ పండుగ సీజన్‌లో, గ్లూకోజ్ స్థాయిలను అదుపులో ఉంచుకోవడానికి ఈ సాధారణ చర్యలు పాటిస్తే, మధుమేహం ఉన్నవారు కూడా దీపావళి పండగను.. జీవితాన్ని సంపూర్ణంగా ఆనందించవచ్చునని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

Also Read:   దేశంలో తొలిసారిగా ఈ కంపెనీ హెల్మెట్ కొంటే లక్ష ప్రమాద భీమా సౌకర్యం..