AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎంత ప్రయత్నించినా బరువు తగ్గడం లేదా..? ఎన్ని డైట్లు ఫాలో అవుతున్నా.. ఫలితం లేదా..?

మన శరీరం ఎంత ముఖ్యమో.. మనసు కూడా అంతే ఆరోగ్యం గా ఉండాలి. ఆరోగ్యకరమైన మనసు ఆరోగ్యకరమైన శరీరం తోనే సాధ్యమవుతుంది. మీరు బరువు తగ్గడానికి ఎంత ప్రయత్నించినా ఫలితం కనిపించకపోతే.. అసలు సమస్య ఎక్కడుందో తెలుసుకోవాలి. ఇది చాలా ముఖ్యం.

ఎంత ప్రయత్నించినా బరువు తగ్గడం లేదా..? ఎన్ని డైట్లు ఫాలో అవుతున్నా.. ఫలితం లేదా..?
Weight Loss
Prashanthi V
|

Updated on: Jun 30, 2025 | 1:39 PM

Share

బరువు తగ్గాలని చాలా మంది కోరుకుంటారు. అయితే వ్యాయామం చేస్తూ ఆహారాన్ని నియంత్రిస్తున్నప్పటికీ.. సరైన ఫలితాలు రాకపోతే నిస్సహాయత కలుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో కొన్ని అంశాలను లోతుగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. మీ బరువు తగ్గడాన్ని థైరాయిడ్ గ్రంథి ప్రభావితం చేయవచ్చు. ఇది శరీరంలో మెటబాలిజాన్ని నియంత్రించే ముఖ్యమైన గ్రంథి. ఇది సరిగా పనిచేయకపోతే శరీరం తక్కువ శక్తిని వాడుతుంది. దాంతో బరువు తగ్గడంలో అడ్డంకి వస్తుంది. అవసరమైతే థైరాయిడ్ పరీక్షలు చేయించుకోవడం మంచిది.

ఒత్తిడి ఒక రకమైన లోపలి ప్రతికూల శక్తిగా పనిచేస్తుంది. ఎక్కువ కాలం ఒత్తిడిలో ఉంటే.. శరీరం కార్టిసోల్ అనే హార్మోన్‌ ను ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంది. ఇది కొవ్వు నిల్వలను పెంచుతుంది. దీన్ని తగ్గించేందుకు ధ్యానం, యోగా వంటి పద్ధతులు ప్రయోజనకరం.

ప్రతి రోజు నాణ్యమైన నిద్ర అవసరం. మీరు ఎంత వ్యాయామం చేసినా.. మంచి ఆహారం తీసుకున్నా సరైన నిద్ర లేకపోతే శరీరం మెటబాలిక్ అసమతుల్యతకు గురవుతుంది. రాత్రి 7 నుంచి 8 గంటలు కచ్చితంగా నిద్రపోవాల్సిన అవసరం ఉంటుంది.

తక్కువ తింటున్నా బరువు తగ్గడం లేదు అనే వారు ఉన్నారు. ఇది చాలా సార్లు అపోహ. మీరు తీసుకునే ఆహారంలో మొత్తం కేలరీలు, పోషక విలువలు తెలుసుకోవడం ముఖ్యం. డైటీషియన్ సలహాతో మీ ఆహారాన్ని తిరిగి మార్చుకోవాలి.

శరీరాన్ని దృఢంగా మార్చడానికి కేవలం కార్డియో వ్యాయామాలు చాలవు. స్ట్రెంత్ ట్రైనింగ్ ద్వారా కండరాలను బలపరచడం, మెటబాలిజాన్ని వేగవంతం చేయడం సాధ్యమవుతుంది. రెండు రకాల వ్యాయామాలను సమతుల్యం చేయడం అవసరం.

బరువు తగ్గడంలో శాశ్వత పరిష్కారం

  • సహజంగా ఆహార నియమాలు పాటించాలి.
  • తగినంత నీరు తాగాలి.
  • క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి.
  • ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి.

మీరు బరువు తగ్గే ప్రయత్నాల్లో ఉన్నా.. ఫలితాలు రాకపోతే నిరాశ చెందకండి. అది మీ తప్పు కాదు. కొన్నిసార్లు అసలు సమస్యలు మనకు తెలియవు. అవి తెలిసిన తర్వాత పరిష్కార మార్గాలు కూడా కనిపిస్తాయి. మీ శరీరం ఒక ప్రాజెక్ట్ లాంటిది.. శ్రద్ధ, సహనం, సమయాన్ని ఇస్తే ఖచ్చితంగా విజయాన్ని చూస్తారు.