యువతలో గుండెపోటు.. ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త.. నిర్లక్ష్యం చేయొద్దు..!
ప్రస్తుత రోజుల్లో గుండెపోటు కేసులు వేగంగా పెరుగుతున్నాయి. చిన్న వయసు నుంచి పెద్ద వయసు వరకు ఎవరినైనా ఇది ప్రభావితం చేయవచ్చు. గుండెపోటు రాకముందే శరీరం కొన్ని హెచ్చరికలు ఇస్తుంది. దవడ నొప్పి, ఎడమ చేతిలో నొప్పి, అలసట, చెమట, ఊపిరి ఆడకపోవడం వంటి లక్షణాలను ముందుగానే గుర్తించడం ప్రాణాలను కాపాడుతుంది.

గుండె కండరాలకు రక్తం సరిగ్గా అందకపోతే గుండెపోటు వస్తుంది. ఈ మధ్య గుండెపోటు కేసులు బాగా పెరుగుతున్నాయి. చిన్నవారి నుంచి పెద్దల వరకు ఎవరికైనా ఇది రావచ్చు. ప్రపంచంలో గుండెపోటు వల్ల చనిపోతున్న వారి సంఖ్య 50 శాతంకి దగ్గరగా ఉంది. కొన్నిసార్లు గుండెపోటు వచ్చాక హాస్పిటల్‌కు వెళ్లేలోపే ప్రాణాలు పోతున్నాయి.
గుండెపోటుకు కారణాలు
- ఆహారపు అలవాట్లు
- బిజీ లైఫ్ స్టైల్
- జంక్ ఫుడ్
- ఆల్కహాల్, స్మోకింగ్
- హై కొలెస్ట్రాల్, షుగర్
- అధిక బీపీ, ఊబకాయం, ఒత్తిడి
ఈ కారణాలన్నీ యువతలో కూడా గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతున్నాయి. అందుకే గుండెపోటు లక్షణాలు తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. గుండెపోటు రాకముందే కొన్ని లక్షణాలు బాడీలో కనిపిస్తాయి. వాటిని ముందుగానే గుర్తిస్తే ప్రాణాలు కాపాడవచ్చు. గుండెపోటు లక్షణాల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
దవడ నొప్పి
ఫేస్‌లో, ముఖ్యంగా లెఫ్ట్ సైడ్‌లో, సడెన్‌గా నొప్పి వస్తే అది గుండెపోటు లక్షణం కావచ్చు. దీన్ని మజిల్ పెయిన్ లేదా పంటి నొప్పి అనుకుని వదిలేయొద్దు. ఛాతీలో భారంగా అనిపించడం, ఊపిరి ఆడకపోవడం, చెమట, వాంతులు వంటి లక్షణాలతో పాటు దవడ నొప్పి ఉంటే వెంటనే డాక్టర్‌ను కలవాలి.
ఎడమ చేతిలో నొప్పి
గుండె కండరానికి రక్త ప్రసరణ తగ్గినప్పుడు కొందరికి లెఫ్ట్ హ్యాండ్‌లో నొప్పి లేదా బలహీనత వస్తుంది. చిన్న నొప్పి కామన్ కావచ్చు. కానీ సడెన్‌గా తీవ్రమైన నొప్పి వస్తే అది గుండెపోటుకు ప్రీ సిగ్నల్ కావచ్చు.
అలసట, చెమట, ఊపిరి ఆడకపోవడం
గుండెపోటుకు ముందు లేదా తర్వాత విపరీతమైన అలసట వస్తుంది. గుండెకు సరైన రక్తం అందకపోవడం వల్ల బాడీలో ఎక్కువ చెమట పడుతుంది. కొంతమందికి అజీర్తి, వాంతులు కూడా రావచ్చు.
ఇతర లక్షణాలు
గుండెపోటుకు ముందు గుండె వేగం పెరగడం, హెడేక్, తల తిరగడం, ఛాతీలో నొప్పి, తక్కువగా ఊపిరి రావడం వంటి లక్షణాలు కూడా గమనించాలి. ఈ లక్షణాలను చిన్న ప్రాబ్లమ్‌గా అనుకోకండి. ఇవి గుండెపోటు సంకేతాలు కావచ్చు. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్‌ను కలవడం చాలా ముఖ్యం.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)




