Healthy Food Habits: ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకు ఎన్నిసార్లు భోజనం చేయాలి..?
ఆరోగ్యంగా ఉండాలంటే, ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం ఎంత ముఖ్యమో.. వేళకు తినడం కూడా అంతే ముఖ్యం. శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే విటమిన్లు, మినరల్స్, ఫైబర్ వంటి వాటిని రోజూ వారీ ఆహారంలో చేర్చుకోవడం చాలా ముఖ్యం. కానీ చాలా మంది తమ అరోగ్యంపై తగినంత శ్రద్ధ పెట్టరు. దీంతో ఆకలిగా అనిపించినా ప్రతీసారి రోజులో చాలా సార్లు తింటుంటారు. ఇలా చేయడం వల్ల ప్రయోజనాలు పొందడానికి బదులుగా..

ఆరోగ్యంగా ఉండాలంటే, ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం ఎంత ముఖ్యమో.. వేళకు తినడం కూడా అంతే ముఖ్యం. శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే విటమిన్లు, మినరల్స్, ఫైబర్ వంటి వాటిని రోజూ వారీ ఆహారంలో చేర్చుకోవడం చాలా ముఖ్యం. కానీ చాలా మంది తమ అరోగ్యంపై తగినంత శ్రద్ధ పెట్టరు. దీంతో ఆకలిగా అనిపించినా ప్రతీసారి రోజులో చాలా సార్లు తింటుంటారు. ఇలా చేయడం వల్ల ప్రయోజనాలు పొందడానికి బదులుగా, మరిన్ని ఆరోగ్య సమస్యల బారీన పడుతుంటారు. గురుగ్రామ్‌లోని నారాయణ హాస్పిటల్‌లోని ఇంటర్నల్ మెడిసిన్ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ పంకజ్ వర్మ మాట్లాడుతూ.. శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకు ఎన్నిసార్లు తినాలి అనేది సాధారణ ప్రశ్న. దీనికి స్థిరమైన రెగ్యులర్ ప్రమాణం అంటూ ఏమీ లేదు. నిజానికి.. రోజుకు ఎన్నిసార్లు తినాలనేది వేర్వేరు వ్యక్తుల శారీరక స్థితిపై ఆధారపడి ఉంటుందని ఆయన అన్నారు.
మూడు సార్లు మేలు
ఆరోగ్యవంతమైన వ్యక్తి ఉదయం, మధ్యాహ్నం, రాత్రి మూడు పూటలా ఆహారం తీసుకోవడం సముచితమని డాక్టర్ పంకజ్ వర్మ అంటున్నారు. అయితే సాధారణ వ్యక్తితో పోలిస్తే, సాధారణ బరువు కంటే తక్కువ బరువు ఉన్నవారు లేదా ఏదైనా శారీరక సమస్యతో బాధపడుతున్నవారు రోజుకు నాలుగు సార్లు తినడం మంచిదని డాక్టర్ పంకజ్ చెబుతున్నారు. ఉదాహరణకు.. డయాబెటిక్ పేషెంట్లు కూడా రోజుకు మూడు పూటలా తినాలి. ఎందుకంటే వారు ఎక్కువసేపు ఆకలితో ఉంటే వారి సమస్య మరింతగా పెరుగుతుంది. అదేవిధంగా, ఊబకాయంతో బాధపడేవారు లేదా సాధారణం కంటే ఎక్కువ బరువు ఉన్నవారు రోజుకు రెండు లేదా మూడుసార్లు తేలికపాటి ఆహారం తీసుకోవడం మంచిది.
మీ ఆహారంలో వీటిని చేర్చుకోవాలి
ఉదయం అల్పాహారంలో ప్రొటీన్లు, విటమిన్లు సమృద్ధిగా ఉండే ఆహారం తీసుకోవాలి. మధ్యాహ్నం తక్కువ కేలరీల ఆహారం, సాయంత్రం త్వరగా జీర్ణమయ్యే ఆహారాలను తీసుకోవాలి. దీనితో పాటు శారీరక స్థితిని బట్టి రోజుకు ఎన్ని సార్లు తినాలో నిర్ణయించుకోవాలి. నిర్ణీత సమయంలో మాత్రమే ఆహారం తీసుకోవాలి. తద్వారా జీర్ణవ్యవస్థ సరిగ్గా పని చేస్తుంది.
మరిన్ని ఆరోగ్య సంబంధిత కథనాల కోసం క్లిక్ చేయండి.








