AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Thyroid: థైరాయిడ్‌ ఎన్ని రకాలు.. దీని నుంచి రక్షించుకోవడం ఎలా? ఎలాంటి ఆహారం తీసుకోవాలి?

అనేక వ్యాధులకు కారణం మనం తీసుకునే ఆహారం, ఇతర పానీయాలే. మధుమేహం, థైరాయిడ్, కీళ్లనొప్పులు వంటి వ్యాధులు ఇప్పుడు ప్రజలలో సాధారణమైపోయాయి. థైరాయిడ్ వల్ల ప్రజలు అనేక వ్యాధుల..

Thyroid: థైరాయిడ్‌ ఎన్ని రకాలు.. దీని నుంచి రక్షించుకోవడం ఎలా? ఎలాంటి ఆహారం తీసుకోవాలి?
Thyroid
Subhash Goud
|

Updated on: Jan 30, 2023 | 9:12 PM

Share

అనేక వ్యాధులకు కారణం మనం తీసుకునే ఆహారం, ఇతర పానీయాలే. మధుమేహం, థైరాయిడ్, కీళ్లనొప్పులు వంటి వ్యాధులు ఇప్పుడు ప్రజలలో సాధారణమైపోయాయి. థైరాయిడ్ వల్ల ప్రజలు అనేక వ్యాధుల బారిన పడుతున్నారు. థైరాయిడ్ గ్రంథి మెడ వెనుక భాగంలో ఉంటుంది. ఇది శరీరంలోని జీవక్రియను నియంత్రించడంలో సహాయపడుతుంది. అయితే థైరాయిడ్ రావడానికి కారణం ఏమిటి? దీని లక్షణాలు ఏమిటి? రోగుల ఆహార ప్రణాళిక ఎలా ఉండాలి. వీటి గురించి తెలుసుకుందాం.

థైరాయిడ్ ఎన్ని రకాలు:

థైరాయిడ్‌లో రెండు రకాలు ఉన్నాయి. ఒకటి హైపోథైరాయిడిజం, మరొకటి హైపర్ థైరాయిడిజం. హైపోథైరాయిడిజమ్‌ను అండర్‌యాక్టివ్ థైరాయిడ్ అని కూడా అంటారు. థైరాయిడ్ హార్మోన్ తగినంత మొత్తంలో లేనప్పుడు ఇది జరుగుతుంది. దీని కారణంగా మనిషి సన్నబడటం జరుగుతుంది. హైపర్ థైరాయిడిజం అంటే శరీరంలో హార్మోన్లు అధికంగా ఉత్పత్తి అవుతాయి. అంతే కాకుండా ఆహారంలో ఐరన్ లోపించినా గాయిటర్ లాంటి సమస్య వస్తుంది.

లక్షణాలు ఏమిటి?

  • మలబద్ధకం
  • ఆయాసం
  • టెన్షన్
  • పొడి బారిన చర్మం
  • బరువు పెరుగుట లేదా తగ్గుట
  • గుండె మెల్లగా కొట్టుకోవడం
  • అధిక రక్త పోటు
  • జుట్టు రాలడం

పురుషుల కంటే మహిళలకు థైరాయిడ్ ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా మహిళల్లో ఈ వ్యాధి 30 సంవత్సరాల వయస్సులో ప్రారంభమవుతుంది.

ఇవి కూడా చదవండి
  1. థైరాయిడ్‌లో ఏమి తినాలి?: అవిసె గింజలు: అవిసె గింజలు థైరాయిడ్ రోగులకు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. వీటిలో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్ హైపోథైరాయిడిజంను తగ్గించడంలో సహాయపడుతుంది.
  2. బ్రెజిల్ నట్స్: బ్రెజిల్ నట్స్‌లో సెలీనియం మంచి పరిమాణంలో ఉంటుంది. అటువంటి పరిస్థితిలో థైరాయిడ్ పేషెంట్లు తమ ఆహారంలో బ్రెజిల్ గింజలను చేర్చుకోవచ్చు.
  3. తృణధాన్యాలు: తృణధాన్యాలు తీసుకోవడం ద్వారా మీరు థైరాయిడ్ వంటి వ్యాధుల నుండి బయటపడవచ్చు. ఇందులో జింక్‌ పరిమాణం చాలా మంచిదని గుర్తించారు పరిశోధకులు. అలాగే మీ ఆహారంలో గుడ్లు కూడా చేర్చుకోవచ్చు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం..