Health Tips: గొంతు నొప్పి.. నోటి దుర్వాసనతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ చిట్కాలు పాటించండి

Health Tips: ప్రస్తుతమున్న జీవనశైలి కారణంగా ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చిన్నపాటి చిట్కాలు పాటిస్తే వైద్యుల వద్దకు వెళ్లకుండా నయం చేసుకోవచ్చంటున్నారు..

Health Tips: గొంతు నొప్పి.. నోటి దుర్వాసనతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ చిట్కాలు పాటించండి
Follow us
Subhash Goud

|

Updated on: Feb 15, 2022 | 2:10 PM

Health Tips: ప్రస్తుతమున్న జీవనశైలి కారణంగా ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చిన్నపాటి చిట్కాలు పాటిస్తే వైద్యుల వద్దకు వెళ్లకుండా నయం చేసుకోవచ్చంటున్నారు వైద్య నిపుణులు. కొన్ని ఇంట్లోనే దొరికే వాటితోనే కొన్ని వ్యాధులను దూరం చేసుకోవచ్చు. ఇక చాలా మంది గొంతునొప్పి, నోటి దుర్వాసనతో ఇబ్బందులు పడుతుంటారు. వాటిని నయం చేసుకునేందుకు కొన్ని చిట్కాలు పాటిస్తే నమం అవుతుంది. ఇక ఈ విషయం అటుంచితే తులసి మొక్క గురించి తెలుసుకుందాం. ఇందులో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. దాదాపు ఇది అందరికి తెలిసిందే. ఈ తులసి ఆకులను ఏ రూపంలో తీసుకున్నా.. ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఇక గొంతునొప్పి, నోటి దుర్వాస‌న‌, నోట్లో పొక్కులు లాంటి ఎన్నో సమస్యలు చాలా మందిని వెంటాడుతుంటాయి. దీంతో ఆస్పత్రులకు వెళ్లడం, మందుల కోసం అధికంగా ఖర్చు చేసుకోవడం చేస్తుంటారు. కానీ తులసి ఆకుల ద్వారా ఈ సమస్యలను పోగొట్టుకోవచ్చని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. మరి తులసి వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో తెలుసుకుందాం.

నోటి దుర్వాసన సమస్య వేధిస్తోందా..?

చాలామందిని నోటి దుర్వాసన స‌మ‌స్య వేధిస్తుంటుంది. ఈ స‌మ‌స్య ఉన్నవాళ్లు ప్రతి రోజు రాత్రి నీళ్లల్లో తుల‌సి ఆకుల‌ను నాన‌బెట్టాలి. మ‌రుస‌టి రోజు ఉద‌యాన్నే ఆ నీటితో ప‌ళ్లు తోముకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల నోటి దుర్వాస‌న సమస్య పోతుంది. అలాగే కొందరికి నోట్లో పొక్కులు వస్తుంటాయి. అలాంటి సమస్య కూడా తులసి వల్ల నయం అవుతుంది.

గొంతు నొప్పితో బాధపడుతున్నారా..?

ఇక గొంతు నొప్పి కూడా చాలా మందిలో ఉంటుంది. వారికి ఇది పెద్ద సమస్యగా ఉంటుంది. అలాంటి వారికి కూడా తులసి ఎంతో మేలు చేస్తుంది. గొంతునొప్పి ఉన్నవారు ఏదైనా ప‌దార్థాన్ని మింగినా తీవ్రమైన నొప్పి వ‌స్తుంది. కొన్ని సంద‌ర్బాల్లో అయితే మంచినీళ్లను మింగాల‌న్నా గొంతు నొప్పి వేధిస్తుంది. ఈ స‌మ‌స్య ఉన్నవాళ్లు నీళ్లలో తుల‌సి ఆకులు వేసి బాగా మ‌రిగించాలి. ఆ త‌ర్వాత ఆ నీళ్లు గోరువెచ్చగా మార‌గ‌నే తాగాలి. దాంతో గొంతునొప్పి మ‌టుమాయం అవుతుంది.

తులసి రసంతో..

ఇంకా తుల‌సి ర‌సంలో తేనె క‌లిపి తీసుకుంటే కూడా మంచి ప్రయోజ‌నం ఉంటుందంటున్నారు నిపుణులు. ఈ రెండింటిలోనూ యాంటీ సెప్టిక్ గుణాలు అధికంగా ఉండ‌టంవ‌ల్ల చ‌ర్మ సమస్యలు వెంటాడవు. సాధార‌ణ జ‌లుబు, ద‌గ్గు కూడా త‌గ్గుతాయి. నోటిపూత‌కు కూడా ఇది మంచి ఔష‌ధంగా ప‌నిచేస్తుంది. తుల‌సి ఆకులకు శ‌రీరంలో కొవ్వును త‌గ్గించే గుణం కూడా ఉంటుంది. తుల‌సి ఆకుల‌ను ప్రతిరోజూ క్రమం త‌ప్పకుండా మజ్జిగ‌తో క‌లిపి తీసుకుంటే బ‌రువు తగ్గుతారు. ఇక నిద్రలేమితో బాధ‌పడేవారు తుల‌సి ఆకుల‌ను చ‌క్కెర‌తో క‌లిపి తీసుకుంటే మంచి ఫ‌లితం ఉంటుంది. ఇవే కాకుండా తులసి ఆకులు శరీరానికి ఎన్నో రకాలుగా మేలు చేస్తుంది. అందుకే క్రమం తప్పకుండా తులసి ఆకులను తీసుకుంటే ఎంతో మంచిదంటున్నారు ఆయుర్వేద నిపుణులు.

ఇవి కూడా చదవండి:

Physical Exercise: మెదడు చురుగ్గా పని చేయాలంటే ఇలా చేయండి.. పరిశోధనలలో కీలక విషయాలు

Health Tips: పడుకునే ముందు ఈ 4 పదార్థాలకు దూరంగా ఉండండి.. లేదంటే భారీ నష్టం.. అవేంటంటే?

కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!