AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: రోజంతా కూర్చొని పని చేస్తున్నారా? ఒక్క 10 నిమిషాలు ఇలా చకస్తే పొట్ట రాదు..!

ఆఫీస్ అయినా, ఇల్లు అయినా మనం ఎక్కువసేపు ఒకే చోట కూర్చొని పనిచేయాలి. అయితే ఈ అలవాటు మీ ఆరోగ్యానికి ఎంత హానికరమో మీకు తెలుసా? ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల ఎముకలు, కండరాలలో నొప్పి, ఒత్తిడి తీవ్రంగా పెరుగుతుంది. అంతే కాకుండా ఊబకాయం, మధుమేహం, గుండె జబ్బులు వంటి సమస్యలు కూడా తలెత్తుతాయి. దీంతో పాటు, పొట్ట కూడా పెరుగుతుంది. ఇలాంటి పరిస్థితిలో చింతించాల్సిన అవసరం లేదంటున్నారు ఆరోగ్య నిపుణులు.

Health Tips: రోజంతా కూర్చొని పని చేస్తున్నారా? ఒక్క 10 నిమిషాలు ఇలా చకస్తే పొట్ట రాదు..!
Long Time Sitting Effects
Shiva Prajapati
|

Updated on: Aug 22, 2023 | 9:24 PM

Share

నేటి రన్-ఆఫ్-ది-మిల్ జీవితంలో, చాలా మంది వ్యక్తులు 8-9 గంటలు కంటిన్యూగా కూర్చొని పని చేస్తుంటారు. ఆఫీస్ అయినా, ఇల్లు అయినా మనం ఎక్కువసేపు ఒకే చోట కూర్చొని పనిచేయాలి. అయితే ఈ అలవాటు మీ ఆరోగ్యానికి ఎంత హానికరమో మీకు తెలుసా? ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల ఎముకలు, కండరాలలో నొప్పి, ఒత్తిడి తీవ్రంగా పెరుగుతుంది. అంతే కాకుండా ఊబకాయం, మధుమేహం, గుండె జబ్బులు వంటి సమస్యలు కూడా తలెత్తుతాయి. దీంతో పాటు, పొట్ట కూడా పెరుగుతుంది. ఇలాంటి పరిస్థితిలో చింతించాల్సిన అవసరం లేదంటున్నారు ఆరోగ్య నిపుణులు. కొన్ని సాధారణ చర్యలను అనుసరించడం ద్వారా ఈ సమస్యల బారిన పడకుండా ఉండొచ్చని చెబుతున్నారు. మరి ఆ నివారణలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

చిన్న వ్యాయామాలు..

స్క్వాట్స్: స్క్వాట్స్ మీ తొడలు, తుంటి కండరాలను బలంగా మారుస్తాయి. చురుకుగా ఉంచుతాయి. ఇది జీవక్రియను కూడా వేగవంతం చేస్తుంది.

జంపింగ్ జాక్స్: ఈ వ్యాయామం చేయడం ద్వారా, కార్డియో బూస్ట్ పొందుతుంది. ఇది కేలరీలను బర్న్ చేస్తుంది.

డెస్క్‌ ఎక్సర్‌సైజ్‌: కుర్చీపై కూర్చున్నప్పుడు కాళ్లను పైకి లేపడం వంటి చిన్న చిన్న ఎక్సర్‌సైజ్‌లు చేయాలి.

మెట్లు ఎక్కడం: మెట్లు ఉంటే 10 నిమిషాలు పైకి క్రిందికి వెళ్లడం చేయాలి. ఇలా చేస్తే కాస్త రిలీఫ్ అవుతారు.

టైండ్ ప్లాంక్: ప్లాంక్ చేయడం వల్ల మీ కోర్ కండరాలు ఉత్తేజితం అవుతాయి. పొట్టను బిగుతుగా ఉంచడంలో సహాయపడుతుంది.

నిలబడి పని చేయాలి: ప్రతి గంటకు కాసేపు లేచి నిలబడి మీ పనిని చేసుకోవచ్చు.

సాగదీయడం: చేతులు పైకి లేపడం, కాళ్లను నిఠారుగా చేయడం, మెడను అటూ ఇటూ తిప్పడం వంటి కొన్ని సాధారణ స్ట్రెచింగ్ వ్యాయామాలు చేయండి.

ఎప్పటికప్పుడు లేచి ఫ్రెష్ అప్ అవ్వండి: ప్రతి 30-60 నిమిషాలకు ఒకసారి లేచి కొంచెం నడవండి. ఇది మీ కండరాలకు విశ్రాంతినిస్తుంది. రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది.

డెస్క్ వ్యాయామాలు: మెడ, భుజాలను తిప్పడం, కాలి వేళ్లను పైకి క్రిందికి తిప్పడం వంటి కొన్ని సాధారణ వ్యాయామాలు కూర్చున్నప్పుడు కూడా చేయవచ్చు.

ఎక్కువ నీరు త్రాగాలి: నీరు త్రాగడం ద్వారా.. మళ్లీ మళ్లీ టాయిలెట్‌కి వెళ్లాల్సి వస్తుంది. అంటే ఈ కారణంగా మళ్లీ మళ్లీ లేవడానికి అవకాశం లభిస్తుంది. ఇది మీకు కదలికలను ఇస్తుంది.

వ్యాయామం, యోగా: క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, యోగా చేయడం కూడా చాలా ముఖ్యం. ఇది మీ శారీరక కమ్యూనికేషన్, కండరాల స్థితిని మెరుగుపరుస్తుంది.

కళ్లను జాగ్రత్తగా చూసుకోండి: మీరు కంప్యూటర్‌లో ఎక్కువసేపు పని చేస్తే, 20-20-20 నియమాన్ని అనుసరించండి. అంటే ప్రతి 20 నిమిషాలకు, 20 సెకన్ల పాటు 20 అడుగుల దూరంలో ఉన్న వస్తువును చూడండి.

సరైన పరికరాలను ఉపయోగించడం: స్టాండింగ్ డెస్క్, ఎర్గోనామిక్ చైర్, ఇతర పరికరాలు మీకు సహాయపడతాయి.

నిద్ర: రెగ్యులర్ నిద్ర, మేల్కొనే సమయాన్ని సెట్ చేసుకోవాలి.

గమనిక: ఈ వ్యాసంలో పేర్కొన్న వివరాలను ప్రజల సాధారణ ఆరోగ్య ప్రయోజనాలను ఉద్దేశించి ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు. ఏవైనా సమస్యలుంటే.. వైద్యులను సంప్రదించండి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

బాడీ షేమింగ్‌ చేశారు.. పెళ్లి చేసుకోవాలంటే ఆ కండిషన్ పెట్టారు
బాడీ షేమింగ్‌ చేశారు.. పెళ్లి చేసుకోవాలంటే ఆ కండిషన్ పెట్టారు
కిలో లక్షల్లోనే.. భారత్‌లోనే అత్యంత ఖరీదైన కూరగాయ.. ఎలా..
కిలో లక్షల్లోనే.. భారత్‌లోనే అత్యంత ఖరీదైన కూరగాయ.. ఎలా..
ఏపీ టెట్‌ 2025 ఆన్సర్‌ కీ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?
ఏపీ టెట్‌ 2025 ఆన్సర్‌ కీ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ!
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ!
ఆ ప్రొడ్యూసర్ రూమ్ కు పిలిచి.. బాంబ్ పేల్చిన బిగ్ బాస్ బ్యూటీ
ఆ ప్రొడ్యూసర్ రూమ్ కు పిలిచి.. బాంబ్ పేల్చిన బిగ్ బాస్ బ్యూటీ
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జనవరిలో జాబ్ క్యాలెండర్ 2026 విడుదల
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జనవరిలో జాబ్ క్యాలెండర్ 2026 విడుదల
ఏపీ vs తెలంగాణ: మళ్లీ మొదలైన నీళ్ల లొల్లి.. తగ్గేదే లేదంటున్న..
ఏపీ vs తెలంగాణ: మళ్లీ మొదలైన నీళ్ల లొల్లి.. తగ్గేదే లేదంటున్న..
తనూజ కంటే బెటర్.. అసలైన అర్హులు వేరే ఉన్నారు..
తనూజ కంటే బెటర్.. అసలైన అర్హులు వేరే ఉన్నారు..
ఈ చెట్ల పెంపకంతో కోట్లల్లో లాభం..సాగు విధానం గురించి మీకు తెలుసా?
ఈ చెట్ల పెంపకంతో కోట్లల్లో లాభం..సాగు విధానం గురించి మీకు తెలుసా?
ఒక కిలోమీటరు నడవడానికి ఎన్ని అడుగులు వేయాలి..? 99శాతం మందికి..
ఒక కిలోమీటరు నడవడానికి ఎన్ని అడుగులు వేయాలి..? 99శాతం మందికి..