Thyroid: థైరాయిడ్‌ను తరిమికొట్టే ఇంటి చిట్కాలు.. క్రమం తప్పకుండా రోజూ ఉదయాన్నే ఇలా చేయండి

పురుషులతో పోల్చితే.. మహిళలు అధికంగా థైరాయిడ్ సమస్యలతో బాధపడుతుంటారు. థైరాయిడ్ గ్రంథి మన గొంతు ముందు భాగంలో ఉంటుంది. ఇది మన శరీరంలోని జీవక్రియలను నియంత్రించడంలో సహాయపడుతుంది. థైరాయిడ్ గ్రంధి మెడలో ఉన్న సీతాకోకచిలుక ఆకారంలో ఉండే ఓ గ్రంథి. ఇది థైరాక్సిన్ (T4), ట్రైయోడోథైరోనిన్ (T3) హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది. ఈ థైరాయిడ్ సమస్యను రెండు రకాలుగా విభజించవచ్చు..

Thyroid: థైరాయిడ్‌ను తరిమికొట్టే ఇంటి చిట్కాలు.. క్రమం తప్పకుండా రోజూ ఉదయాన్నే ఇలా చేయండి
Thyroid
Follow us
Srilakshmi C

| Edited By: Shaik Madar Saheb

Updated on: Oct 03, 2024 | 8:35 PM

పురుషులతో పోల్చితే.. మహిళలు అధికంగా థైరాయిడ్ సమస్యలతో బాధపడుతుంటారు. థైరాయిడ్ గ్రంథి మన గొంతు ముందు భాగంలో ఉంటుంది. ఇది మన శరీరంలోని జీవక్రియలను నియంత్రించడంలో సహాయపడుతుంది. థైరాయిడ్ గ్రంధి మెడలో ఉన్న సీతాకోకచిలుక ఆకారంలో ఉండే ఓ గ్రంథి. ఇది థైరాక్సిన్ (T4), ట్రైయోడోథైరోనిన్ (T3) హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది. ఈ థైరాయిడ్ సమస్యను రెండు రకాలుగా విభజించవచ్చు. ఒకటి హైపోథైరాయిడిజం, మరొకటి హైపర్ థైరాయిడిజం.

హైపోథైరాయిడిజమ్‌ను అండర్‌యాక్టివ్ థైరాయిడ్ అని కూడా అంటారు. ఒక వ్యక్తికి తగినంత థైరాయిడ్ హార్మోన్ లేనప్పుడు ఇది సంభవిస్తుంది. శరీరం అధికంగా థైరాయిడ్ హార్మోన్ను ఉత్పత్తి చేసినప్పుడు హైపర్ థైరాయిడిజం సంభవిస్తుంది. ఈ హైపోథైరాయిడిజమే చాలా మంది స్త్రీలు స్థూలకాయంగా మారడానికి కారణం. సాధారణంగా థైరాయిడ్ సమస్యలు పురుషుల కంటే మహిళల్లోనే ఎక్కువగా కనిపిస్తాయి. థైరాయిడ్ వల్ల మహిళల్లో స్థూలకాయం, పీరియడ్స్ క్రమం తప్పడం, అలసట, మూడ్ స్వింగ్స్ వంటివి కలుగుతాయి. ఇంట్లోనే థైరాయిడ్ సమస్యను సహజంగా ఎలా నయం చేసుకోవచ్చో ఇక్కడ తెలుసుకుందాం..

ధరియాలు

కొత్తిమీరలో సహజసిద్ధమైన థైరాయిడ్‌ను నియంత్రించే గుణాలు ఉంటాయి. థైరాయిడ్ నియంత్రణ కోసం రెండు చెంచాల ధనియాలను ఒక గ్లాసు నీటిలో రాత్రంతా నానబెట్టాలి. ఉదయం నిద్ర లేవగానే ఈ నీటిని తాగి, ధనియాలు తినాలి. ఇలా తీసుకోవడం వల్ల హైపర్ థైరాయిడిజం అదుపులో ఉంటుంది. అలాగే, ఇది మీ జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

ఇవి కూడా చదవండి

కొత్తిమీర రసం

కొత్తిమీరలో విటమిన్ ఎ, సి, బి పుష్కలంగా ఉంటాయి. ఇవి థైరాయిడ్ లెవల్స్ ను క్రమబద్ధీకరించి, థైరాయిడ్ లెవల్స్ ను బ్యాలెన్స్ లో ఉంచుతాయి. థైరాయిడ్ సంబంధిత సమస్య ఎముకల్లో విపరీతమైన నొప్పిని కలిగిస్తుంది. కొత్తిమీర రసం థైరాయిడ్‌ నుండి ఉపశమనం అందించడంలో చాలా ప్రభావవంతంగా ఉంటుంది. అలాగే, కొత్తిమీర ఆకులలో యాంటీఆక్సిడెంట్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే హాని నుండి శరీర కణాలను రక్షించడంలో సహాయపడతాయి.

తులసి-అలోవెరా

తులసి, కలబంద రెండు శక్తివంతమైనవి. ఇవి రెండూ శరీరానికి వివిధ ప్రయోజనాలను అందిస్తాయి. తులసి ఆకుల్లో యాంటీ బాక్టీరియల్, యాంటీవైరల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఇవి థైరాయిడ్ సమస్యలను అదుపులో ఉంచుతాయి. దీనిని హైపర్ థైరాయిడ్ రోగులు తీసుకుంటే మేలు చేస్తుంది. తులసాకుల సారం థైరాయిడ్ సంబంధిత వ్యాధులను నయం చేస్తుంది. రెండు చెంచాల తులసి రసాన్ని ఒక చెంచా కలబంద రసంతో కలిపి జ్యూస్‌గా తీసుకోవాలి. వీటిని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల థైరాయిడ్ సమస్యల నుంచి బయటపడవచ్చు.

కొబ్బరి నూనె

థైరాయిడ్ సమస్య ఉన్నవారు కొబ్బరి నూనెను ఔషధంగా తీసుకోవచ్చు. కొబ్బరి నూనెలో ఉండే మీడియం చైన్ ఫ్యాటీ యాసిడ్స్ థైరాయిడ్ గ్రంధిని అదుపులో ఉంచుతాయి. అలాగే, కొబ్బరి నూనె జీవక్రియను పెంచుతుంది. శరీర ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది. అంతేకాకుండా, ఇది బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది.

మరిన్ని ఆరోగ్య సంబంధిత కథనాల కోసం క్లిక్‌ చేయండి.

వందల ఏళ్ల నాటి అద్భుతం.. నాగన్న మెట్ల బావి.! వీడియో.
వందల ఏళ్ల నాటి అద్భుతం.. నాగన్న మెట్ల బావి.! వీడియో.
శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.
శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.
నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.
నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.
ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!
ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!
బాబోయ్‌ బటర్‌ టీ.! టీ చేసిన విధానం చూసి షాక్.! వీడియో
బాబోయ్‌ బటర్‌ టీ.! టీ చేసిన విధానం చూసి షాక్.! వీడియో
ఆ విటమిన్ లోపమే మీ మూడ్​ స్వింగ్స్ కు కారణమా ?
ఆ విటమిన్ లోపమే మీ మూడ్​ స్వింగ్స్ కు కారణమా ?
వార్నీ.. బ్రేక్ అనుకుని..! యాక్స్ లేటర్ తొక్కితే.! వీడియో వైరల్.
వార్నీ.. బ్రేక్ అనుకుని..! యాక్స్ లేటర్ తొక్కితే.! వీడియో వైరల్.
డిసెంబరు 21 పగలు 8 గంటలు మాత్రమే.! రాత్రి 16 గంటలు..
డిసెంబరు 21 పగలు 8 గంటలు మాత్రమే.! రాత్రి 16 గంటలు..
'RRR' డాక్యుమెంటరీ చూశారా.? బుక్ మై షోలో డాక్యుమెంటరీ టిక్కెట్లు!
'RRR' డాక్యుమెంటరీ చూశారా.? బుక్ మై షోలో డాక్యుమెంటరీ టిక్కెట్లు!
UI మూవీతో ప్రేక్షకుల ఇంటెలిజెన్స్‌కు పరీక్షపెట్టిన ఉపేంద్ర.!
UI మూవీతో ప్రేక్షకుల ఇంటెలిజెన్స్‌కు పరీక్షపెట్టిన ఉపేంద్ర.!