Orange Side Effects : అతిగా ‘నారింజ’ పళ్లు తింటున్నారా? బిగ్ షాకింగ్ న్యూస్ మీకోసమే.. పొంచి ఉన్న ముప్పు..
శీతాకాలం వచ్చేసింది. ఈ సీజన్‌లో లభించే పండ్లు అన్నీ మార్కెట్‌లోకి వచ్చేస్తాయి. సీజనల్‌గా లభించే పండ్లను వ్యాపారులు విక్రయిస్తుంటారు.
శీతాకాలం వచ్చేసింది. ఈ సీజన్‌లో లభించే పండ్లు అన్నీ మార్కెట్‌లోకి వచ్చేస్తాయి. సీజనల్‌గా లభించే పండ్లను వ్యాపారులు విక్రయిస్తుంటారు. అలాంటి వాటిలో నారింజ పండ్లు కూడా ఒకటి. దీని రుచి కొద్దిగా పుల్లగా, ఇంకొంచెం తీపిగా ఉంటుంది. నారింజ పండ్లను చాలా మంది ఇష్టంతో తింటుంటారు. దీన్ని తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. ఎందుకంటే ఇందులో అనేక పోషకాలు ఉన్నాయి. ఆరెంజ్‌లో తగినంత విటమిన్ సి, నీరు ఉంటుంది. చలికాలంలో దీన్ని తినడం వల్ల శరీరం హైడ్రేట్‌గా ఉంటుంది. దీంతో పాటు రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. అయితే, ఆరెంజ్‌తో ఆరోగ్యం బాగుంటుంది కదా అని అతిగా తిన్నా కూడా కష్టమేనట. అవును ఆరోగ్య నిపుణులు ఇదే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఆరెంజ్‌ను ఎక్కువగా తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలతో పాటు.. వాటి వల్ల కలిగే నష్టాల గురించి వైద్యులు కీలక వివరాలు వెల్లడించారు. మరి నారింజను అధికంగా తీసుకుంటే కలిగే నష్టాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
చలికాలంలో ఎండలో కూర్చొని నారింజ పండ్లను తింటే ఆ సరదానే వేరు. దీనిని తినడం వల్ల శరీరం చాలా ప్రయోజనాలను పొందుతుంది. అయితే, నారింజను ఎక్కువగా తీసుకోవడం వల్ల తీవ్రమైన ఇబ్బందులు తలెత్తుతాయట. ఒక రోజులో 4, 5 నారింజలను తీసుకుంటే.. అది శరీరంలో ఫైబర్ కంటెంట్‌ని పెంచుతుంది. శరీరంలో పీచు పదార్థం ఎక్కువగా ఉంటే.. ఉదర సంబంధిత సమస్యలు పెరుగుతాయి. దీనివల్ల పొత్తికడుపు నొప్పి, కడుపు ఉబ్బరం, వికారం వంటి సమస్యలు వస్తాయి. అవసరమైన దానికంటే ఎక్కువ విటమిన్ సిని ఎప్పుడూ తినకూడదు. ఇది గుండెల్లో మంట, వాంతులు, నిద్రలేమి, గుండెపోటు వంటి సమస్యలను కలిగిస్తుంది.
ఒక రోజులో ఎన్ని నారింజలు తినాలి..
నీరసంగా ఉన్నప్పుడు, శరీరం సహకరించనప్పుడు కాస్త బలం కోసం నారింజ తినమని సిఫారసు చేస్తారు వైద్యులు. అయితే, కొందరు అవసరమైన దానికంటే ఎక్కువగా తింటుంటారు. అధిక పొటాషియం స్థాయిలు ఉన్నవారికి సమస్యలను కలిగిస్తుంది. శరీరంలో ఇప్పటికే తగినంత పొటాషియం ఉంటే.. అది హైపర్‌కలేమియా అనే తీవ్రమైన పరిస్థితికి దారి తీస్తుంది. వాస్తవానికి, నారింజలో ఆమ్లత్వంగా అధికంగా ఉంటుంది. దీని కారణంగా గ్యాస్ట్రోఎసోఫాగియల్ రిఫ్లక్స్ వ్యాధి (GERD)తో బాధపడుతున్న వ్యక్తులు మరింత ఇబ్బంది పడుతారు. GERDతో బాధపడుతున్న వ్యక్తులు నారింజను తీసుకునే ముందు తప్పనిసరిగా వారి వైద్యుడిని సంప్రదించాలి. అందుకే, ఒక రోజులో 1 లేదా 2 నారింజలను మాత్రమే తినాలని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు.
గమనిక: ప్రజల సాధారణ ఆరోగ్య ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని, ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు పైన వివరాలు పేర్కొనడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు. ఏదైనా ఆరోగ్య సమస్యలుంటే వైద్యులను సంప్రదించడం ఉత్తమం.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..