Health Tips: కరోనా ఎఫెక్ట్.. కీలక విషయాలు వెల్లడించిన వైద్యులు.. ప్రతీ రోజూ ఇలా చేస్తే సేఫ్..!

Health Tips: కరోనా మహమ్మారి ఎఫెక్ట్ వల్ల ప్రజల్లో ఎన్నడూ లేని విధంగా ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

Health Tips: కరోనా ఎఫెక్ట్.. కీలక విషయాలు వెల్లడించిన వైద్యులు.. ప్రతీ రోజూ ఇలా చేస్తే సేఫ్..!
Brush
Follow us
Shiva Prajapati

|

Updated on: Oct 08, 2021 | 8:49 AM

Health Tips: కరోనా మహమ్మారి ఎఫెక్ట్ వల్ల ప్రజల్లో ఎన్నడూ లేని విధంగా ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే, కరోనా ముక్కు, నోటి ద్వారా వ్యాపిస్తుందనే విషయం మనందరికీ తెలిసిందే. అందుకే.. కరోనాను నివారించడానికి నోటిని శుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం అని వైద్యులు చెబుతున్నారు. ఒక అధ్యయనం ప్రకారం.. నోటిని తరచూ శుభ్రపరుచుకోవడం వల్ల కరోనా వ్యాప్తి చెందే ప్రమాదం తగ్గుతుందట. జర్నల్ ఆఫ్ ఓరల్ మెడిసిన్ అండ్ డెంటల్ రీసెర్చ్‌లో ప్రచురించబడిన పరిశోధన ప్రకారం.. నోటి పరిశుభ్రతలో ఉపయోగించే మౌత్‌వాష్‌లో కరోనా వైరస్ (SARS CoV 2)ను బలహీనపరచడంలో ప్రభావవంతగా పని చేస్తుంది.

అందుకే.. కరోనా సంక్షోభం సమయంలో ప్రజలు తమ నోరు విషయంలో శ్రద్ధ వహించాలని ఢిల్లీలోని మౌలానా ఆజాద్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ ప్రొఫెసర్ డాక్టర్ జ్ఞానేంద్ర కుమార్ పేర్కొన్నారు. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం కనీసం నాలుగు నిమిషాలపాటు దంతాలను బ్రష్‌తో శుభ్రం చేసుకోవాలి. ఉదయం మాత్రమే కాకుండా, రాత్రి పడుకునే ముందు కూడా బ్రష్ చేయడం అలవాటు చేసుకోవాలి. ఇలా చేయడం ద్వారా రాత్రి సమయంలో నోట్లో ఏర్పడే చెడు బ్యాక్టీరియా నుంచి ఉపశమనం పొందవచ్చు.

ప్రతీ మూడు, నాలుగు నెలలకోసారి టూత్‌బ్రష్ మార్చాలి.. డాక్టర్ జ్ఞానేంద్ర ప్రకారం.. ప్రతి మూడు నుండి నాలుగు నెలలకు ఒకసారి టూత్‌ బ్రష్ మార్చాలి. ఎందుకంటే పాత బ్రష్ మీ చిగుళ్లను దెబ్బతీస్తుంది. దంతాలను శుభ్రపరచడంతో పాటు, నాలుకను కూడా శుభ్రం చేసుకోవాలి. నాలుక లేదా గొంతులో బొబ్బలు ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. ఈ విషయాలన్నింటినీ జాగ్రత్తగా చూసుకుంటే దంతాలకు సంబంధించిన అనేక రకాల సమస్యల నుండి బయటపడవచ్చు. అలాగే కరోనా బారిన పడకుండా ఉండొచ్చు.

ఈ విషయాలను ఖచ్చితంగా గుర్తుంచుకోండి.. 1. రాత్రిపూట స్వీట్లు తినడం మానుకోండి 2. ఉదయం పళ్ళు తోముకునే ముందు ఏమీ తినవద్దు 3. మీ దంతాలలో నొప్పి ఉంటే వైద్యుడిని సంప్రదించండి

Also read:

Megastar Chiranjeevi : వైష్ణవ్ వచ్చి క్రిష్‌తో సినిమా అనగానే.. ఓకే చేసేయ్ అన్నాను : చిరంజీవి

Crime News: వీడు మామూలోడు కాదు.. ఒక అమ్మాయితో స్నేహం.. 50 మంది మైనర్లు, టీచర్లకు వల.. చివరకు..

Viral Video: వామ్మో.! గ్లాస్‌లో నీళ్లు తాగుతోన్న కింగ్ కోబ్రా.. అదిరే వీడియో మీరూ చూసేయ్యాల్సిందే!