Weight Loss: గంటల కొద్దీ జిమ్, కఠిన డైటింగ్ అవసరం లేదు.. ఈ 2 వ్యాయామాలతో ఈజీగా బరువు తగ్గొచ్చు..
బరువు తగ్గాలనుకుంటున్నారా, అయితే జిమ్‌కి వెళ్లడానికి సమయం లేదా? ఇంట్లోనే ఉంటూ ఈ 2 వ్యాయామాలతో వెయిట్ తగ్గొచ్చని తెలుసా? ఎలానో ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ రోజుల్లో బరువు తగ్గేందుకు(Weight Loss) చాలామంది తెగ కష్టపడుతుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో బరువు తగ్గాలంటే గంటల తరబడి జిమ్‌లో చెమటలు కక్కిస్తుంటారు. లేదా కఠిన డైటింగ్ చేస్తూ ఉంటారు. కానీ, సమయంలేక బరువు తగ్గాలనుకునే వారి పరిస్థితి గందరగోళంగా తయారవుతుంది. జిమ్‌లో వ్యాయామం చేయకుండా బరువు తగ్గడం ఎలా అని ఆలోచిస్తుంటారు. అయితే జిమ్‌కు వెళ్లకుండా ఇంట్లోనే కేవలం 2 వ్యాయామాల(exercise)తో బరువు తగ్గవచ్చని నిపుణులు చెబుతున్నారు. జిమ్‌కి వెళ్లకూడదనుకునే వారు, ఇంట్లోనే ఉంటూ వ్యాయామాలు చేయాలనుకునే వారికి ఇవి ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. మీరు ఇంట్లోనే సులభంగా పుష్ అప్స్, స్క్వాట్‌లు చేస్తూ చాలా ఈజీగా బరువు తగ్గొచ్చు.
పుష్ అప్స్ వల్ల ఉపయోగాలు..
1- ఇంట్లోనే పుష్ అప్స్ చేయడం వల్ల శరీర పైభాగం బలాన్ని పొందుతుంది. 2- ఇది కండరాలను, శరీరాన్ని బలంగా చేస్తుంది. 3- పుష్ అప్స్ చేయడం వల్ల నిద్ర మెరుగుపడుతుంది.
స్క్వాట్స్ వల్ల ఉపయోగాలు..
1- స్క్వాట్‌లు చేయడం వల్ల దిగువ శరీరం బలపడుతుంది. 2- ఒత్తిడి తొలగిపోవడం వల్ల మనస్సు కూడా ఆనందంగా ఉంటుంది. 3- స్క్వాట్‌లు చేయడం ద్వారా మనస్సు పని చేసే సామర్థ్యం పెరుగుతుంది.
ఏ సమయంలో స్క్వాట్స్, పుష్ అప్ వ్యాయామాలు చేయాలి?
వ్యాయామం ఏదైనా, దాని ప్రభావం శరీరంపై ఉండాలంటే ఉదయం పూట మాత్రమే చేయాలి. పుష్ అప్స్, స్క్వాట్స్ కూడా ఉదయం మాత్రమే చేయాలి. ఉదయాన్నే ఇలా చేయడం వల్ల శరీరంపై ప్రభావం కూడా కనిపిస్తుంది. సోమరితనం కూడా తగ్గుతుంది. అదే సమయంలో మీరు రోజంతా శక్తివంతంగా ఉంటారు. ఇది ఒత్తిడి సమస్యను కూడా దూరం చేస్తుంది.
ప్రారంభంలో ఎన్ని పుష్ అప్స్, స్క్వాట్స్ చేయాలి..
ప్రారంభంలో, కనీసం 40 పుష్ అప్లు చేయాలి. దాదాపు 3 సెట్లు 20 చొప్పున 60 స్క్వాట్‌లు చేయాలి. ఇది వ్యాయామం ప్రభావాన్ని కలిగి ఉంటుంది. శరీరానికి ప్రయోజనకరంగా మారుస్తుంది. ఆతర్వాత కొద్డిగా పెంచుకుంటూ పోవాలి.
Also Read: Skin Care: వేసవిలో కొబ్బరి నీరు తాగుతున్నారా ? అయితే ఈ సమస్యలకు చెక్ పెట్టొచ్చు..