- Telugu News Photo Gallery Know these skin care tips to use coconut water for pimple sunburn black circle check in telugu
Skin Care: వేసవిలో కొబ్బరి నీరు తాగుతున్నారా ? అయితే ఈ సమస్యలకు చెక్ పెట్టొచ్చు..
ఎండాకాలంలో చాలా మంది చర్మ సంబంధిత సమస్యలను ఎదుర్కోంటారు. చర్మంపై టాన్.. డ్రై స్కీన్, మంట, దద్దుర్లు వంటి సమస్యలు ఇబ్బంది పెడుతుంటాయి. ఈ చర్మ సమస్యలను తగ్గించుకోవడానికి కొబ్బరి నీరు ఉపయోగపడుతుంది.
Updated on: Mar 27, 2022 | 7:33 PM

ఎండాకాలంలో చాలా మంది చర్మ సంబంధిత సమస్యలను ఎదుర్కోంటారు. చర్మంపై టాన్.. డ్రై స్కీన్, మంట, దద్దుర్లు వంటి సమస్యలు ఇబ్బంది పెడుతుంటాయి. ఈ చర్మ సమస్యలను తగ్గించుకోవడానికి కొబ్బరి నీరు ఉపయోగపడుతుంది.

మొటిమలు: కొబ్బరి నీళ్లు తాగడం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. అయితే ముఖంపై వచ్చే మొటిమలను తగ్గించడంలో ఇది సహాయపడుతుంది. ఇందుకోసం కొబ్బరి నీళ్లలో దూదిని నానబెట్టి మొటిమల మీద కాస్త సమయం పెట్టాలి.

డ్రై స్కిన్: ఎండాకాలంలో ముఖం నిర్జీవంగా కనిపించేలా పొడి చర్మం సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుంది. అటువంటి పరిస్థితిలో మీరు కొబ్బరి నీటిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు, సహజ చక్కెరతో పొడిని తొలగించవచ్చు.

టోనర్: సమ్మర్ స్కిన్ కేర్ కోసం టోనర్ కూడా తయారు చేసుకోవచ్చు. ఇందుకోసం కొబ్బరి నీళ్లను స్ప్రే బాటిల్‌లో తీసుకుని అందులో రోజ్ వాటర్ కలపాలి. ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు ఈ టోనర్‌ని ముఖంపై స్ప్రే చేయండి.

టానింగ్ దూరంగా: వేసవిలో టానింగ్ సమస్య సర్వసాధారణం. టానింగ్ లేదా సన్ బర్న్ తొలగించడానికి ముఖానికి కొబ్బరి నీళ్లతో చేసిన ఫేస్ ప్యాక్ ను అప్లై చేయాలి. దీని కోసం ముల్తానీ మిట్టిని తీసుకుని, కొబ్బరి నీళ్లు అవసరాన్ని బట్టి కలపాలి. ఆరిన తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి.

నల్లటి వలయాలు: చర్మంపై నల్లటి వలయాలను పోగొట్టుకోవడానికి కొబ్బరి నీళ్లు ఉపయోగపడతాయి. ఒక గిన్నెలో కొబ్బరి నీళ్లు తీసుకుని అందులో కాస్త పసుపు కలపాలి. ఇందులో చందనం పొడిని కూడా కలపవచ్చు. ఈ పేస్ట్‌ను సుమారు 10 నిమిషాలు అప్లై చేసిన తర్వాత, చల్లటి నీటితో శుభ్రం చేసుకోండి.




